నాగళ్ళ రాజేశ్వరమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగళ్ళ రాజేశ్వరమ్మ 1943లో జాతీయోద్యమం నడుస్తున్న కాలంలో మహిళల హక్కులు, స్వేచ్ఛా, సమానత్వం కోసం చేసే పోరాటాల్లో ముందుకొచ్చి నినధించిన మహిళ .

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె ఉయ్యూరుకు చెందిన వారు. ఈమె చిన్నతనం నుంచే మహిళా ఉద్యమాల్లోనూ సంఘసంస్కరణోద్యమాల్లోనూ పాల్గొనడమే కాకుండా వితంతు వివాహాలు జరిపించడంలోనూ ముఖ్యపాత్ర వహించారు.తన తండ్రి ప్రోద్భలంతో 14 యేళ్ల ప్రాయంలో ఉద్యమాలు ప్రారంభించిన ఆమె నేటి వరకూ ఆదే స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక మహిళ ఉద్యమాల్లో పాల్గొన్నారు.వివాహానంతరం ఉయ్యూరు మండలం కాటూరు గ్రామం వెళ్లారు. మహిళా ఉద్యమ నిర్మాణం కోసం మొట్టమొదటి సారిగా కాటూరు గ్రామం వచ్చిన ఈడ్పుగంటి రత్నమాంబ, కడియాల గోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకున్నారు. తమ గ్రామంలో జరిగే బాల్య వివాహలు, మేనరికపు పెళ్ళిళ్లకు వ్యతిరేకంగా గ్రామంలోని మహిళలను ఐక్యంచేసి నిలబెట్టారామె. 1937లో పామర్రుకు దగ్గరలోని జమీగోల్వేపల్లిలో తూర్పు కృష్ణా ఉద్యమాన్ని నిర్మించాలనే తలంపుతో వల్లభనేని సీతామహాలక్ష్మి అధ్యక్షతన జాతీయ కాంగ్రెస్‌కు అనుబంధంగా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానిలో ఆమెను వర్కింగ్‌ కమిటీ సభ్యురాలిగా ఎన్నుకున్నారు. 1938-40 మధ్యకాలంలో మహిళా ఉద్యమ ప్రచార బాధ్యతలను మానికొండ సూర్యావతితో కలిసి తీసుకున్నారు.

1942లో బాల్య వితంతువుకు మేజరైన వర్ణాంతర వివాహం జరిపించారామె. బోళ్ళపాడులో 'పుత్రసంతానం' సాకుతో 60 యేళ్ల వృద్ధునికి జరిగే మూడో వివాహాన్ని వ్యతిరేకించి గ్రామంలోని మహిళలతో సభ జరిపారు. తాడంకిలో జరిపిన వితంతు వివాహంపై కొందరు దాడి చేయగా మహిళలు అక్షరాస్యుల్ని చేయాలనే సంకల్పంతో యలమర్రులో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా 1958లో కాటూరులో తాను, నందమూరులో తన సహచరురాలు మానికొండ సూర్యావతి మొట్టమొదటి మహిళా సదస్సుకు హాజరై, మహిళ సంఘం ఉద్ధేశ్యాలను, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని ప్రసంగించారు. 1964లో ఎకె గోపాలన్‌, రాహుల్‌ సాంకృత్యాయన్‌ వంటి మహానీయులు కాటూరుకు వచ్చి ఇది 'ఆంధ్ర మాస్కో' అన్ని పేర్కొన్నారు. నాటి ఉద్యమాలు, పోరాటాలు మహిళా అక్షరాస్యత, స్త్రీ స్వాతంత్య్రం, స్వేచ్ఛ, వివాహ చట్టాల్లో మార్పులు, స్త్రీ హక్కులు వంటి వాటిని సాధించారు.


మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]