నాన్కానా నరమేధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాన్కానా సాహిబ్ లోని గురుద్వారా జనమ్ అస్తాన్ నానక్ జన్మించినట్లు భావిస్తున్న స్థలాన్ని గుర్తుచేసే దృశ్యచిత్రం

నాన్కానా నరమేధం (లేక సాకా నాన్కానా) అన్నది బ్రిటీష్ ఇండియాలో ప్రస్తుతం పాకిస్తానీ పంజాబ్ ప్రాంతంలోని నాన్కానా సాహిబ్ ప్రాంతంలో జరిగిన నరమేధం.[1] ఈ సంఘటన సిక్ఖుల చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకుంది. రాజకీయ ప్రాధాన్యతలో ఇది జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత స్థానాన్ని పొందుతుంది. 20వ శతాబ్దిలో గురుద్వారా సంస్కరణ ఉద్యమం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న సిక్ఖు నిరసనకారులపై దారుణమైన దాడులు చేసి, అనేకమంది మరణానికి కారణమయ్యారు. మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు కూడా ఈ సంఘటన సందర్భంగా సిక్ఖులు కనబరిచిన స్వయం నియంత్రణ, ఆత్మశక్తి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.[2]

చారిత్రక నేపథ్యం[మార్చు]

సిక్కు మతం చిహ్నం

సిక్ఖు మత విస్తరణకు, మతాచారాల నిర్వహణకు కృషిచేసే గురుద్వారాలకు ఆదాయాన్ని సమకూర్చే ఉద్దేశంతో సిక్ఖు రాజ్య స్థాపకుడైన మహారాజా రంజిత్ సింగ్ హయాంలో భూములు, ఆదాయాలు ఇచ్చారు. కాలక్రమేణా వ్యవస్థలో మార్పులు చేర్పులు చోటుచేసుకుని అవినీతిమయమైపోయింది. ఇది సిక్ఖు పంత్ లో పరిస్థితులను మార్చేసింది.

నాన్కానాలో అభ్యంతరకరమైన కార్యక్రమాలు[మార్చు]

20వ శతాబ్ది తొలినాళ్ళలో మహాంత్ నారాయణ్ దాస్ గురుద్వారా నాన్కానా సాహిబ్ ను నిర్వహించేవారు. గురుద్వారాకు 19వేల ఎకరాల అత్యంత ఫలవంతమైన భూములు ఉండేవి, అవి ఎంతో ఆదాయాన్ని సమకూర్చిపెట్టేది. మహాంత్ అవినీతిపరుడయ్యారని ఆరోపణలు ఎదురయ్యాయి.

పవిత్రమైన పరిసరాలకు నాట్యకత్తెలను తీసుకువచ్చి, అశ్లీల నృత్యాలు చేయడం ప్రారంభించారని ఆరోపణలు ఎదురయ్యాయి. మహాంత్ ఓ బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

మూలాలు[మార్చు]

  1. "95th Anniversary Of Nankana Massacre Observed At Gurdwara Nankana Sahib". Sikh24.com. 23 February 2016. Retrieved 20 April 2016.
  2. "Massacre at Nankana Sahib". Welcome to website about history of the sikhs. Archived from the original on 14 ఏప్రిల్ 2016. Retrieved 20 April 2016.