నిత్యజీవితంలో భౌతికశాస్త్రం
నిత్యజీవితంలో భౌతికశాస్త్రం | |
నిత్యజీవితంలో భౌతికశాస్త్రం | |
కృతికర్త: | యాకొవ్ పెరెల్మాన్ |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | జనిమాటెల్నోయ్ ఫిజీకీ |
అనువాదకులు: | కొడవటిగంటి కుటుంబరావు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | భౌతికశాస్త్రం |
విభాగం (కళా ప్రక్రియ): | శాస్త్రవిజ్ఞానం |
ప్రచురణ: | మిర్ ప్రచురణాలయం, మాస్కో |
విడుదల: | 1960 |
నిత్యజీవితంలో భౌతికశాస్త్రం యాకొవ్ పెరెల్మాన్ రష్యను భాషలో రచించగా కొడవటిగంటి కుటుంబరావు తెలుగు లోకి అనువదించాడు. ఇది సోవియట్ యూనియన్ కాలంలో మాస్కో లోని మిర్ ప్రచురణాలయంలో ముద్రించబడింది. సాధారణ మానవునికి నిత్యజీవితంలో ఎదురయ్యే సందేహాలను చాలా సులభ శైలిలో, తేలిగ్గా అర్థంచేసుకొనగలిగేలా ఈ పుస్తక రచన చేసాడు. మొదటి సారిగా రష్యన్ భాషలో ఈ పుస్తకం 1913 లో జనిమాటెల్నోయ్ ఫిజీకీ అనే పేరుతో ముద్రితమైంది. ఆ తరువాత చాలా భాషల లోకి అనువదించబడింది. ఆ కాలపు విజ్ఞానశాస్త్ర విద్యార్థులపై ఈ పుస్తకం చాలా ప్రభావం చూపింది. పోయిన్కేర్ తర్కాన్ని సాధించిన గ్రిగరీ యాకోవ్లిచ్ పెరెలమాన్ దీనినుంచే స్ఫూర్తిని పొందాడు.
ముందుమాటలో రచయిత పుస్తకం గురించి చెపుతూ “ క్లిష్టమైన సమస్యలు, మెదడుకు మేత, హాస్య సంభాషణలు, అనుకోని పోలికలతో కూడివుందని, జూల్స్ వెర్న్ హెచ్ జి వెల్స్, మార్క్ ట్వేన్, ఇతర రచయితల ను వుటంకించినట్లు ఎందుకంటే ఆనందంతో పాటు, ఈ అత్యుత్తమ రచయితల ప్రయోగాలు భౌతిక శాస్త్ర విద్యార్థులు నేర్చుకోటానికి చాలా వుపయోగకరం ” అని అన్నారు. కదులుతున్న కారు నుండి ఎగిరి దిగటం ఎలా, మృత సముద్రంలో మనం ఎందుకు మునిగిపోలేము మొదలైనవి దీని లోని ఆసక్తికర విషయాలలో కొన్ని. ఈ పుస్తకంలో కనిపించే ఆలోచనలను ఇప్పటి భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు కూడా వాడుతారు.
మిర్ ప్రచురణాలయం ప్రచురించిన కూర్పు దట్టమైన గ్లేజ్ కాగితంపై ముద్రించి, గట్టి అట్ట వేసి ఉండేది. అట్టకు ఒక గ్లేజ్ కాగితపు తొడుగు కూడా ఉండేది. తదనంతర కాలంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కూడా, కె.బి గోపాలం అనువదించిన కూర్పును ప్రచురించింది. ఇది మామూలు కాగితంపై ముద్రించి, పల్చటి అట్టతో ఉంటుంది. విశాలాంధ్ర వారి కూర్పు ఇంటర్నెట్ ఆర్కీవ్ లో అందుబాటులో ఉంది. దీని ఇంగ్లీషు కూర్పు, ఫిజిక్స్ ఫర్ ఎంటర్‌టెయిన్‌మెంట్ , కూడా అక్కడ అందుబాటులో ఉంది.
రచయిత
[మార్చు]యాకోవ్ పెరెల్మాన్ (1882 డిసెంబరు 4–1942 మార్చి 16) ప్రసిద్ధిచెందిన రష్యన్, సోవియట్ శాస్త్రవిజ్ఞాన రచయిత. ఇతను చాలా జనరంజకమైన పుస్తకాలను రచించాడు. వానిలో "Physics Can Be Fun", "Mathematics Can Be Fun" ముఖ్యమైనవి. ఇవి రెండూ ఆంగ్లంతో సహా పలు ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి.
పెరెల్మాన్ 1882 సంవత్సరం పోలెండ్ లోని బైలోస్టాక్ నగరంలో జన్మించాడు. ఇతడు 1909లో అరణ్యశాస్త్రంలో డిప్లొమా పొందాడు. వినోదం కోసం భౌతికశాస్త్రం ("Physics for Entertainment") పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందిన ఇతడ్ని మరిన్ని పుస్తకాలను రచించడానికి ప్రోత్సహించింది. అలాంటివే కొన్ని పుస్తకాలను గణితశాస్త్రం, జ్యామితి, ఖగోళశాస్త్రం మొదలైన విషయాలమీద రచించారు. ఇతని రచనలలో భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం లకు సంబంధించిన పుస్తకాలను సోవియట్ యూనియన్లో వివిధ భాషలలో ప్రచురించారు. ఇవే కాకుండా పాఠ్యపుస్తకాలలోను, పత్రికలలో కోసం ఎన్నో వ్యాసాలను సమకూర్చారు. ఇతడు "నేచర్, ప్రజలు" అనే పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
పెరెల్మాన్ 1942 సంవత్సరంలో జర్మనీ ప్రభుత్వం లెనిన్ గ్రేడ్ను చుట్టుముట్టినప్పుడు ఆకలితో అలమటిస్తూ మరణించాడు.[1]
మొదటి భాగం
[మార్చు]మొదటి అధ్యాయం-వేగము, చలన సంకలనము
[మార్చు]- మనం ఎంత వేగంతో కదులుతున్నాం?
- కాలంతో పోటీ
- సెకండులో సహస్రాంశం
- స్లోమోషన్ కెమేరా
- మనం సూర్యుడి చుట్టూ హెచ్చు వేగంతో తిరిగేది ఎప్పుడు: రాత్రా-పగలా?
- బండి చక్రం సమస్య
- చక్రంలో అతినెమ్మదిగా కదిలే భాగం
- చిక్కు ప్రశ్న
- పడవ ఎక్కడనుండి బయలు దేరింది?
రెండవ అధ్యాయం-గురుత్వాకర్షణ, బరువు, లీవరు, పీడనం
[మార్చు]- లేచి నిలబడు దీనిని!
- నడక, పరుగు
- కదిలే రైలుబండిలోనుండి ఎలా దూకాలి?
- చేతికి చిక్కిన తుపాకి గుండు
- పుచ్చకాయ "బాంబు"
- బరువు చూసుకునే పద్ధతి
- బరువు ఎక్కడ జాస్తిగా వుంటుంది?
- పతనమయే వస్తువు బరువెంత?
- భూమినుండి చంద్రుడికి
- చంద్రుడి వద్దకు ప్రయాణం: జూల్స్ వెర్న్ వర్ణించిన విధ, అసలు నిజం
- తప్పుడు కాటాతో సరి అయిన తూకం
- నీ బలం నీకే తెలీదు
- వాడి మొనగల వస్తులెందుకు గుచ్చుకుంటాయి?
- సౌఖ్యమైన రాతిపరుపు
మూడవ అధ్యాయం-వాయు నిరోధం
[మార్చు]- తుపాకి గుండూ, గాలీ
- బిగ్ బెర్తా
- గాలిపటం ఎందుకు ఎగురుతుంది?
- ప్రాణంగల గ్లైడర్లు
- మోటారు లేకుండా ఎగిరే విత్తులు
- ఆలస్యంగా తెరుచుకునే గాలిగొడుగులు (పారాచూటులు)
- "బూమరాంగ్"
నాలుగవ అధ్యాయం-భ్రమణం, శాశ్వత చలన యంత్రాలు
[మార్చు]- గుడ్డు వుడికినదా, పచ్చిదా?
- రంగుల రాట్నం
- సిరాతో సుడిగాలులు
- మోసపోయిన మొక్క
- "శాశ్వత చలన" యంత్రాలు
- "కిటుకు"
- గుండ్లే అంతా చేసేస్తాయి
- ఉఫీమ్ త్సెవ్ యొక్క సంచాయకము (అక్యూములేటరు)
- "అభుతంకాని అద్భుతం"
- మరికొన్ని "శాశ్వత చలన" యంత్రాలు
- గ్రేట్ పీటర్ కొనాలనుకున్న "శాశ్వత చలన" యంత్రం
అయిదవ అధ్యాయం-ద్రవాలూ, వాయువులూ వాటి ధర్మములు
[మార్చు]- రెండు కాఫీపాత్రల సమస్య
- ప్రాచీనుల అజ్ఞానం
- ద్రవాల ఊర్థ్వ పీడనం
- దేని బరువు హెచ్చు?
- ద్రవాల సహజ ఆకారము
- సీసం గుండ్లు గుండ్రంగా ఎందుకుంటాయి?
- "అగాధమైన" వైను గ్లాస్
- పాడు గుణం
- మునగని నాణెం
- జల్లెడలో నీరు
- ఇంజనీరులకు నురుగు యొక్క ఉపయోగం
- ఉత్తుత్త "శాశ్వత చలన" యంత్రం
- సబ్బు బుడగలు ఊదడం
- అన్నిటికన్న పలచనిది
- వేలు తడవకుండా
- మనం ఎలా తాగుతాం?
- మంచి గరాటు
- టన్ను కర్ర, టన్ను ఇనుమూ
- బరువులేని మనిషి
- "శాశ్వతమైన" గడియారం
ఆరవ అధ్యాయం-ఉష్ణ క్రియలు
[మార్చు]- ఒక్ త్యాబ్ర్ స్కయ రైలు మార్గం ఎప్పుడు దీర్ఘతరమవుతుంది?
- శిక్షలేని చౌర్యం
- ఐఫెల్ టవరు ఎత్తెంత?
- గాజులోటాలూ, జలమానాలూ
- స్నానశాలలో జోడు
- అద్భుతాలు చేసే పద్ధతులు
- కీ ఇవ్వనక్కరలేని గడియారం
- బోధించే సిగరెట్టు
- మరిగే నీళ్లలో కరగని మంచుగడ్డ
- పైననా, క్రిందనా?
- మూసిన కిటికీ నుండి ఈదర గాలి
- వింత భ్రమణం
- చలికోటు వెచ్చబరుస్తుందా?
- భూమిలోపలి ఋతువులు
- కాగితపు పాత్ర
- మంచుమీద ఎందుకు జారుతుంది?
- ఈటె మంచు సమస్య
ఏడవ అధ్యాయం-కాంతి కిరణములు
[మార్చు]- పట్టుబడిన నీడలు
- కోడిగుడ్డులో కోడిపిల్ల
- వ్యంగ్య ఫోటో చిత్తరువులు
- సూర్యోదయం సమస్య
ఎనిమిదవ అధ్యాయం-పరావర్తనం, వక్రీభవనం
[మార్చు]- గోడల గుండా చూడడం
- మాట్లాడే తలకాయ
- ముందా వెనకా?
- అద్దం కనపడుతుందా?
- ప్రతిబింబాలు
- ప్రతిబింబ లేఖనం
- హ్రస్వతమ, శీఘ్రతమ మార్గం
- కాకి మార్గం
- కెలిడోస్కోపు (సౌష్ఠవచిత్ర దర్శకము)
- మాయాభవనాలు
- కాంతి ఎందుకు, ఎలా వక్రీభవనం చెందుతుంది?
- దూరపు దారే శీఘ్రతరమయినది
- కొత్త రాబిన్సన్ క్రూసోలు
- మంచు సహాయంతో మంట
- ఎండ సహాయంతో
- ఎండమావులు
- "ఆకుపచ్చ కిరణం"
తొమ్మిదవ అధ్యాయం-ఏకనేత్రదృష్టి, ద్వినేత్రదృష్టి
[మార్చు]- ఫోటోగ్రఫీ రాక పూర్వం
- చాలామందికి చేత కానిది
- ఫోటోగ్రాఫ్ లను చూసే విధం
- ఫోటోను ఎంత దూరం నుంచి చూడాలి?
- భూతద్దంతో చూస్తే
- ఫోటోలను పెద్దవి చేయుట
- సినిమాహాలులో అత్యుత్తమమైన సీటు
- బొమ్మల పత్రిదీనినికలు చేసేవారికి చిన్న సలహా
- చిత్తరువులను చూసే విధం
- స్టీరియోస్కోపు (ఘనచిత్ర దర్శకము)
- ద్వినేత్ర దృష్టి
- ఒంటి కన్నుతో, జంట కళ్లతో
- దొంగ పత్రాలను కనిపెట్టడం
- రాక్షసకళ్లతో చూడడం
- ఘనచిత్ర దర్శకములో విశ్వం
- త్రినేత్ర దృష్టి
- ఘనచిత్రంలో ధగధగ
- రైలు కిటికీలోనుంచి చూస్తే
- రంగు అద్దాలతో చూడడం
- నీడల వింతలు
- రంగు మార్పుల గారడీ
- యీ పుస్తకం ఎత్తెంత?
- గంట స్తంభ గడియారము
- నలుపూ, తెలుపూ
- ఏది హెచ్చు నలుపు?
- తేరి చూసే చిత్తరువు
- మరి కొన్ని దృగ్భ్రమలు
- హ్రస్వదృష్టి
పదవ అధ్యాయం-ధ్వని, శ్రవణమూ
[మార్చు]- ప్రతిధ్వని కోసం వేట
- కొలబద్దగా ధ్వని
- ధ్వని దర్పణాలు
- థియేటరులలో ధ్వని
- సముద్రం అడుగునుంచి ప్రతిధ్వని
- తుమ్మెదలు ఎందుకు ఝంకారం చేస్తాయి?
- కర్ణభ్రమలు
- కీచురాయి ఎక్కడ వున్నది?
- చెవులు చేసే మోసం
రెండవ భాగం
[మార్చు]మొదటి అధ్యాయం-మెకానిక్సు మూలసూత్రాలు
[మార్చు]- అతి చవక అయిన ప్రయాణం
- "భూమీ, నిలు!"
- విమాన భట్వాడా
- ఆగని రైలు
- కదిలే పేవ్మెంట్లు
- జటిల సూత్రము
- వీరుడు స్వ్యతోగోర్ వినాశానికి కారణం
- ఆధారం లేకుండా కదలగలమా?
- రాకెట్టు పైకి ఎందుకు పోతుంది?
- "కటిల్" చేప ఎలా కదులుతుంది?
- నక్షత్రాలకు రాకెట్టు ప్రయాణం
రెండవ అధ్యాయం-బలము, పని, ఘర్షణము
[మార్చు]- హంస, గాజురొయ్య, చేపల సమస్య
- కృలోవ్ ను ధిక్కరించి
- కోడిగుడ్డు నలగనొక్కడం సులభమేనా?
- ఎదురుగాలికి తెరచాప
- ఆర్కిమిడీస్ భూమిని ఎత్తగలుగునా?
- జూల్స్ వెర్న్ బలశాలి, ఓయ్ లర్ సూత్రమూ
- ముడుల గట్టితనం దేనిమీద ఆధారపడి ఉంటుంది?
- ఘర్షణ లేకపోతే
- "చెల్యూస్కిన్" నౌక ప్రమాదానికి భౌతిక కారణం
- తనంతతానే సరితూగే కర్ర
మూడవ అధ్యాయం-పరిభ్రమణం
[మార్చు]- తిరిగే బొంగరం ఎందుకు పడిపోదు?
- హస్త లాఘవం
- కొలంబస్ కోడిగుడ్డు సమస్యకు కొత్త పరిష్కారం
- గురుత్వాకర్షణను "రహితం చెయ్యడం"
- మీకు గలీలియో గతి పట్టుతుంది
- నన్ను సవాలు చెయ్యండి
- వాదనలు నెగ్గే విధం
- "మంత్ర గోళం"
- ద్రవ టెలిస్కోపు
- "లూప్" తిరగడం
- సర్కసు గణితం
- తరుగు తూకం
నాలుగవ అధ్యాయం-గురుత్వాకర్షణ
[మార్చు]- గురుత్వాకర్షణ బలం గణనీయమా?
- సూర్యుడికీ భూమికీ మధ్య ఉక్కు బంధాలు
- గురుత్వాకర్షణ నుండి తప్పించుకోగలమా?
- వెల్స్ కథానాయకులు చంద్రలోకానికి ప్రయాణించిన విధం
- చంద్రుడిపైన అరగంట
- చంద్రుడిపై కాల్పులు
- అడుగులేని బావి
- విచిత్రమైన రైలు మార్గం
- సొరంగాలు తవ్వే విధం
అయిదవ అధ్యాయం
[మార్చు]- ఫిరంగిగుండులో ప్రయాణం
- న్యూటన్ పర్వతం
- వింత ఫిరంగి
- బరువైన టోపీ
- అదుటు తగ్గించే మార్గం
- గణితంలో ఆసక్తి కలవారికి
ఆరవ అధ్యాయం-ద్రవాల, వాయువుల గుణాలు
[మార్చు]- మనిషి మునగని సముద్రం
- హిమవిధ్వంసి (ఐస్ బ్రేకర్) పనిచేసే విధం
- మునిగిన నౌకలు ఎక్కడ ఉంటాయి?
- జూల్స్ వెర్న్, హెచ్.జి.వెల్స్ ల ఊహలు ఎలా నిజమయాయి?
- "సాడ్కో"ను తిరిగి తేల్చిన విధం
- "శాశ్వత చలన" జలయంత్రం
- "గేస్" అనే మాటను సృష్టించిన దెవరు?
- తేలికగా కనబడే లెక్క
- నీటితొట్టె సమస్య
- విడ్డూరపు పాత్ర
- గాలి బరువు
- హిరోన్ జలయంత్రంలో కొత్త మార్పు
- తడవకుండా తాగు
- తలకిందులుగా ఉండే గ్లాసులోని నీటి బరువెంత?
- నౌకలు పరస్పరం ఎందుకు ఆకర్షించుకుంటాయి?
- బెర్నూలీ సూత్రం - దాని ఫలితాలు
- చేపలకు తిత్తు లెందుకు?
- అలలు, సుడులు
- భూగర్భానికి ప్రయాణం
- ఊహ, గణితం
- లోతైన గనిలో
- స్ట్రాటోస్ఫియర్ బెలూనులో
ఏడవ అధ్యాయం-ఉష్ణం
[మార్చు]- విసనకర్ర
- మారుతాలు చలిని జాస్తి చేస్తాయి
- ఎడారి గాడ్పులు
- మేలిముసుగులు వెచ్చదనాన్నిస్తాయా?
- చల్లబరచే కూజాలు
- మంచులేని ఐస్ బాక్సు
- మనిషి భరించగల హెచ్చు ఉష్నోగ్రత
- థర్మామీటరా బరామీటరా?
- లాంతరుగ్లాసు దేనికి?
- మంట తనను తానెందు కార్పుకోదు?
- జూల్స్ వెర్న్ నవలలో లోపించిన అధ్యాయం
- భారరాహిత్యంలో భోజనం చేయడం
- నీరు నిప్పునెందు కార్పేస్తుంది?
- నిప్పును నిప్పుతో ఆర్పడం
- మరిగేనీటిలో నీటిని మరిగించగలమా?
- మంచులో నీటిని మరిగించగలమా?
- "బరామీటరు సూప్"
- మరిగేనీరు విధిగా వేడిగా ఉంటుందా?
- వేడి మంచుగడ్డ
- బొగ్గు ఉంచి చల్లదనం
ఎనిమిదవ అధ్యాయం-అయస్కాంతత్వము, విద్యుత్తు
[మార్చు]- "ప్రేమించే శిల"
- దిక్సూచి సమస్య
- అయస్కాంత క్షేత్ర రేఖలు
- ఉక్కు ఎలా అయస్కాంతీకరణం పొందుతుంది?
- బ్రహ్మాండమైన విద్యుదయస్కాంతాలు
- అయస్కాంతంతో గారడీ
- వ్యవసాయంలో అయస్కాంతం
- అయస్కాంత విమానం
- "మహమ్మదు గోరీ"
- విద్యుదయస్కాంత ప్రయాణం
- భూవాసులతో అంగారకేయుల యుద్ధతంత్రం
- గడియారాలు, అయస్కాంతత్వము
- అయస్కాంత "శాశ్వత చలన" యంత్రము
- మ్యూజియం సమస్య
- మరొక మాయ శాశ్వత చలన యంత్రం
- రమారమి శాశ్వతచలన యంత్రం
- అతిదాహంగల పిట్ట
- భూమియొక్క వయస్సెంత
- తీగెలపైన కూర్చునే పక్షులు
- మెరుపుయొక్క వెలుగు
- మెరుపు ఖరీదెంత?
- ఇంట్లో తుఫాను
తొమ్మిదవ అధ్యాయం-కాంతియొక్క ప్రతిఫలన, వక్రీభవనములు, దృష్టి
[మార్చు]- పంచ ముఖాల ఫోటో
- సూర్యశక్తితో పనిచేసే మోటర్లూ, హీటర్లూ
- అదృశ్యఘటిక
- "అదృశ్య వ్యక్తి"
- అంతర్ధానంలో గల మహత్తర శక్తి
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ ఆర్కైవులో ఈ పుస్తకం: ఈ పుస్తకాన్ని కె.బి గోపాలం అనువదించగా విశాలంధ్ర పబ్లిషింగ్ హైస్ వారు ప్రచురించారు.
- ఈ పుస్తకపు ఇంగ్లీషు ప్రతి అదే ఆర్కైవులో
మూలాలు
[మార్చు]- ↑ "Доктор занимательных наук. Книги. Наука и техника". Archived from the original on 2018-10-30. Retrieved 2012-01-30.