నిమ్మకాయ పచ్చడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిమ్మకాయ ఊరగాయ

కావాల్సిన పదార్ధాలు[మార్చు]

నిమ్మకాయ పచ్చడి
  • నిమ్మకాయలు -- 60
  • కారం -- రెండున్నర కప్పులు
  • ఉప్పు -- రెండు కప్పులు
  • మెంతులు -- పావు కప్పు
  • పసుపు -- ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం[మార్చు]

ముందుగ నిమ్మకాయలను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. తడి ఆరిన నిమ్మకాయలను 24 తీసుకుని నిలువుగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.మిగిలిన 36 నిమ్మకాయలను చెక్కలుగా తరిగి రసం పిండాలి.తీసిన రసాన్ని నిమ్మకాయ ముక్కల్లో పోసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఒక రోజంతా అలానే వుంచేయాలి మూత పెట్టి.మరునాడు మెంతులను వేయించి మెత్తగా పొడి చేసి మెంతి పొడిని, కారాన్ని నిమ్మకాయ రసం, ముక్కలు కలిసివున్న గిన్నెలో పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి.అంతే, ఘుమఘుమ లాడే నిమ్మకాయ ఊరగాయ రెడీ. ఈ ఊరగాయను వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాల బావుంటుంది. సి విటమిన్ కూడా లభిస్తుంది.చలికాలంలో జలుబు చేయకుండా నివారిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]