నిహార్ రంజన్ మహానంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిహార్ రంజన్ మహానంద
నిహార్ రంజన్ మహానంద


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
తరువాత స్నేహాంగిని చురియా
నియోజకవర్గం అట్టబిరా

వ్యక్తిగత వివరాలు

జననం (1977-07-17) 1977 జూలై 17 (వయసు 46)
ఒడిశా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కృష్ణేశ్వర్ మహానంద్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]

నిహార్ రంజన్ మహానంద ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అట్టబిరా శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

నిహార్ రంజన్ మహానంద కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అట్టబిరా శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బిజు జనతాదళ్ అభ్యర్థి స్నేహాంగిని చురియాపై 13329 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014, 2019 ఎన్నికలలో ఓడిపోయాడు.

మోహనంద 2024 ఫిబ్రవరి 12న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను అందజేశాడు. ఆయన ఫిబ్రవరి 25న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, మాజీ అధ్యక్షుడు సమీర్ మొహంతి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 The Indian Express (25 February 2024). "Two former Odisha MLAs join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.