Jump to content

నీలకంఠి

వికీపీడియా నుండి

నీలకంఠి : ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులోని 13వ కులం .

వృత్తి, సామాజిక జీవితం

[మార్చు]

ఎనిమిది లక్షల జనాభా ఉన్న నీలకంఠ కులస్థులు తెలంగాణా ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తారు. చేనేత వీరి ప్రధాన వృత్తి. నేత ప్రధాన వృత్తిగా ఎంచుకున్న ఇతర కులాలతో పోల్చి చూస్తే వీరు భిన్నంగా కనిపిస్తారు. పద్మశాలీల మాదిరి వీరు జంథ్యం ధరించరు. కానీ రుద్రాక్షను ధరిస్తారు. పద్మశాలీలతో కలిసి భోంచేస్తాం కానీ వియ్యమందమని అంటారు. నేతలో వీరు 12 గజాల చీర నేయటానికి వీరు ప్రాధాన్యం ఇచ్చేవారు. అప్పట్లో వీరు నేసిన వస్త్రాలను తలపై పెట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అమ్మేవారు. స్వాతంత్య్రానికి పూర్వమే వీరు సామాజిక దురాచారాల్ని సరిదిద్దుకునే ప్రయత్నంచేశారు. ముందుగా వీరి కులంలో బాల్య వివాహాలు జరగకుండా కట్టడి చేశారు. యాంత్రీకరణవల్ల చేనేత వృత్తి దెబ్బతింటున్న దశలో వీరు వలసలు వెళ్లారు. ఎక్కువమంది మహారాష్ట్రలో స్థిరపడ్డారు. ఇక్కడున్నవారు కూడా కొత్త వృత్తులు ఎంచుకున్నారు. అలా కొందరు వ్యాపారులుగా స్థిరపడ్డారు. ఆర్థికంగా ఎదిగినవారు తమ పిల్లలను చదివించే ప్రయత్నం చేశారు కనుకనే డాక్టర్లు, ఇంజనీర్లు వచ్చారు. కాలానుగుణంగా మారుతూ తమ జీవితాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే వీరిలో40 శాతం మంది, ముఖ్యంగా మహారాష్ట్రకు వెళ్లి కులవృత్తిని నమ్ముకున్న నీలకంఠీయులు నేటికీ పేద స్థితిలో జీవనం గడుపుతున్నారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నీలకంఠి&oldid=2887962" నుండి వెలికితీశారు