నోయెల్ సీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోయల్ సీన్
విబిఐటి విభా ఫెస్ట్ 2019లో ప్రదర్శననిస్తున్న నోయల్ సీన్
జననం (1982-11-28) 1982 నవంబరు 28 (వయసు 41)
భారతదేశం
విద్యాసంస్థడి.ఎస్.ఎస్. ఆర్‌సిఐ, డిఫెన్స్ లాబొరేటరీ కళాశాల, హైదరాబాదు
వృత్తి
  • గాయకుడు
  • స్వరకర్త
  • ర్యాపర్
  • నటుడు
  • గీతరచయిత
  • టెలివిజన్ వ్యాఖ్యాత
  • రేడియో జాకీ
క్రియాశీల సంవత్సరాలు2006 నుండి ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2019; div. 2020)

నోయెల్ సీన్ భారతీయ ర్యాప్ కళాకారుడు, స్వరకర్త, సినీ నటుడు. అతను ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. టాలీవుడ్ లో మొదటి ర్యాపర్ ( తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ), బహుముఖ నటుడిగా గుర్తింపు పొందిన అతను స్వతంత్రంగా సంగీత నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రేడియో జాకీ, గేయ రచయిత,స్వరకర్తగా గుర్తింపు, ప్రశంసలను పొందాడు.

నేపథ్యం[మార్చు]

నోయెల్ సీన్ 1982 నవంబర్ 28 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాద్‌లో శామ్యూల్, సారా దంపతులకు జన్మించాడు. అతని తండ్రి పదవీవిరమణ చేసిన సైనికొద్యోగి, తల్లి గృహిణి. నోయెల్ కు మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. రక్షణ రంగానికి చెందిన కుటుంబానికి చెందిన బాలునిగా నోయెల్ సీన్ 10 వ తరగతి వరకు డిఎల్ఎస్ ఆర్‌సిఐ (రీసెర్చ్ సెంటర్ ఇమారత్) లో చదువుకున్నాడు. అతను డిఫెన్స్ లాబొరేటరీ కళాశాలలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసాడు. అతను ఎస్.వి.సి.ఎఫ్.ఎ లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని అభ్యసించాడు. తరువాత అతను వెబ్ డిజైనర్ అయ్యాడు. అతను చిత్ర పరిశ్రమలో చేరే వరకు కాగ్నిజెంట్ లో ట్రైనీగా పనిచేశాడు. అతను 2019 జనవరి 3న సినిమా నటి ఈస్టర్ నోరోన్హాను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జూన్ 2019 ‌లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు వారిరువురికీ విడాకులు మంజూరు చేసింది.[2]

జీవితం[మార్చు]

నోయెల్ సీన్ విద్యాభ్యాసం చేయుచున్న సమయంలో అతను గుర్తింపు పొందిన విలువిద్య శిక్షకుడు రవిశంకర్ ను కలుసుకున్నాడు. రవిశంకర్ అతనికి సినీ రంగంలోకి వెళ్ళేందుకు ప్రోత్సహిస్తూ దర్శకుడు తేజ కు కాస్టింగ్ దర్శకునిగా పనిచేస్తున్న రామానంద్ కు పరిచయం చేసాడు. అతనికి మొదటి సారి తెలుగు సినిమా పరిశ్రమలొ సంభవామి యుగే యుగే లో నటించే అవకాశం కలిగింది. తరువాత అతను దర్శకుడు కృష్ణకు పరిచయమయ్యాడు. అతను నోయల్ ను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి పరిచయం చేసాడు. కీరవాణి అతనికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా విక్రమార్కుడు లో ర్యాపింగ్ చేసే అవకాశం కల్పించాడు. ఇది నోయల్ కు భారీ గుర్తింపు తెచ్చి పెట్టింది. తద్వారా అతనిని 'మొదటి తెలుగు రాపర్' గా గుర్తించారు. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. 2007 లో, నోయెల్ చార్మి కౌర్‌తో కలిసి మంత్ర చిత్రంలో తెరపై కనిపించాడు. అదే సమయంలో నోయెల్ 93.5 రెడ్ ఎఫ్ఎమ్ కోసం రేడియో జాకీగా పనిచేసాడు. ఆ క్రమంలో అతను అనేక మంది అభిమానులను పొందాడు. ఆ తరువాత అతను అనేక పెద్ద ప్రాజెక్టులలో వరుసగా అనేక ముఖ్యమైన పాత్రలను పోషించాడు. తెలుగు చలనచిత్రంలో బహుముఖ నటుడిగా స్థిరపడ్డాడు. 2015 లో, నోయెల్ నటుడిగా అందరూ గుర్తించారు. అతను దర్శకుడు సుకుమార్ నిర్మాణంలోని సినిమా కుమారి 21 ఎఫ్ కు సంతకం చేసాడు. ఈ సినిమాలో అతను శంకర్ అనే ప్రతినాయకుని పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో అతని నటన విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అతను త్వరలోనే హెబా పటేల్ సరసన నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో కథానాయకునిగా అడుగుపెట్టాడు. ఈ చిత్రం బాగా విజయవంతమైంది. ఇది అతని కెరీర్ లో మరొక విజయవంతమైన సినిమాగా చేరింది.

టెలివిజన్[మార్చు]

నోయెల్ 2010 లో జీ తెలుగులో సా రే గా మా పా లిల్ చాంప్స్‌తో టెలివిజన్ వ్యాఖ్యాతగా అడుగుపెట్టాడు. 2013 లో జెమిని టీవిలో సూపర్ కుటుంబం లో వ్యాఖ్యాతగా చేసాడు.

సంగీతం[మార్చు]

నోయెల్ అనేక స్వతంత్ర పాటలను స్వరపరచి, వాటిని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశాడు. అతను గుర్తింపు పొందిన గీత రచయిత అనంత శ్రీరామ్‌తో కలిసి 'ది షేక్ గ్రూప్' అనే తెలుగు బ్యాండ్‌ను ఏర్పాటు చేశాడు. గాయకులు రమ్య బెహారా, మోహనా, డామిని, మౌనిమా, ఆదిరే అభి, ఆదిత్య, అరుణ్ కూడా ఈ బృందంలో ఒక భాగంగా ఉన్నారు. ఈస్టర్ నోరోన్హాతో కలిసి అతని తాజా వీడియో డెస్పాసిటో తెలుగు కవర్ ర్యాప్ పాటను తెలుగులో చేసాడు. అది వైరల్ అయ్యింది. 2 వారాలలోపు 1 మిలియన్ వీక్షణలను దాటింది. అతను కొంకణి సంగీత పరిశ్రమలో ఈస్టర్ నోరోన్హా చే చేయబడిన డిస్పాసిటో కొంకణి కవర్ వెర్షన్ ద్వారా ర్యాపర్ గా చేరాడు.

సినిమాలు[మార్చు]

మూలం
Films that have not yet been released ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం సినిమా పాత్ర
2006 సంభవామి యుగే యుగే
2007 మంత్రం
2008 నేను మీకు తెలుసా
2009 శశిరేఖా పరిణయం
2009 మగధీర
2012 ఈగా / నాన్ ఈ నాని స్నేహితునిగా
2012 రే
2015 గడ్డం గ్యాంగ్
2015 కుమారి 21 ఎఫ్ శంకర్
2015 నాన్నకు ప్రేమతో నోయెల్
2016 గుప్పెడంత ప్రేమ అభి
2016 ప్రేమం అర్జున్
2016 నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్ గోకుల్
2017 రాజా మీరు కేక శశాంక్
2018 రంగస్థలం ఎర్ర శ్రీను
2018 విజేత రామ్ స్నేహితుడు
2018 హలో గురూ ప్రేమ కొసామే కార్తీక్
2018 పడి పడి లేచే మనసు శ్రావణ్
2018 ఎందుకో ఏమో
2020 వలయం
2021 మ‌నిషి [3][4] చందు
2022 దీర్ఝ ఆయుష్మాన్ భవ
2022 డై హార్డ్ ఫ్యాన్

డిస్కోగ్రఫీ[మార్చు]

మూలం
Films that have not yet been released ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం డిస్కోగ్రఫీ
2011 BGOTN (క్రిస్టియన్ భక్తి ఆల్బమ్)
2014 లవ్ ఫీవర్ (సింగిల్)
2015 బాహుబలి నివాళి పాట
2015 బహా కిలికి (స్మిత నటించారు)
2016 భీమావరం బీట్ (సింగిల్)
2016 మాయీ (సింగిల్)
2016 బం చికి బం బం (కుమారి 21 ఎఫ్ నివాళి)
2016 హ్యాపీ మదర్స్ డే మమ్మీ (సింగిల్)
2016 మక్కికిర్కిరి ( రాహుల్ సిప్లిగుంజ్ నటించారు )
2016 సలాం ఇండియా (ది షేక్ గ్రూప్ చేత)
2016 డబ్బూ చాలట్లే (ది షేక్ గ్రూప్ చేత)
2018 డెస్పాసిటో తెలుగు కవర్ (ఈస్టర్ నోరోన్హా నటించిన సింగిల్)
2018 డెస్పాసిటో కొంకణి కవర్ (ఈస్టర్ నోరోన్హా కలిగి)
2019 బేబీ (ఈస్టర్ నోరోన్హా నటించారు)
2020 హస్ట్‌లర్‌ తెలుగు రాప్ సాంగ్

గాయకుడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Divya Goyal (1 September 2020). ""Wish You The Best," Writes Noel Sean After Divorce From Ester Noronha". NDTV. Retrieved 13 September 2020.
  2. "Bigg Boss Telugu 4's Expected Contestant Noel Sean Announces Divorce With Ester Noronha". News18. Retrieved 2020-09-07.
  3. HMTV (9 June 2021). "నోయల్‌ చెప్పిన శుభవార్త ఏంటంటే..?". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  4. Sakshi (9 June 2021). "పెళ్లి గురించి కాదు.. నోయల్‌ శుభవార్త ఇదే". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.

బాహ్య లింకులు[మార్చు]