న్యాయవాది
19th century painting of lawyers, by French artist Honoré Daumier |
|
| Occupation | |
|---|---|
| Names | Attorney, counselor (counsel), solicitor, barrister, advocate |
| Activity sectors | Law, business |
| Description | |
| Competencies | Analytical skills Critical thinking skills Knowledge of the law Proficiency in legal research and legal writing |
| Education required | see Professional requirements |
న్యాయవాది ని ఆంగ్లంలో లాయర్ అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు. న్యాయస్ధానంలో కక్షి (వాది), ప్రతికక్షి (ప్రతివాది) దారుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున వకల్తా పుచ్చుకొని, వారి తరుపున, వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించెవాడు న్యాయవాది. ఇతనిని ప్లీడరు, వకీలు, అడ్వకేటు అని కూడా పిలుస్తారు. వ్యాజ్యాలు రెండు రకాలు. ఒకటి సివిల్, మరొకటి నేరసంబంధమైన క్రిమినల్. సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని, నేరపూరితమైన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ లాయరందురు.
న్యాయవ్యాది పట్టబద్రుడై వుండి (బి.ఎ; బి.కాం; బి.ఎస్సి), న్యాయశాస్త్రంలో (LLB నందు) కూడా పట్టభడద్రుడైవుండాలి. గతంలో జరిగిన వివిధ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి వుండి, చట్టంలోని విషయముల పట్ట పూర్తి అవగాహన వుండాలి. మంచి వాదన పటిమ వుండాలి. బార్ ఆసోసొయేసనులో సభ్యత్వముండాలి. న్యాయవాదులకు డ్రస్‍కోడ్ కలదు. తెల్లచొక్కా మీద తెల్ల ప్యాంటు ధరించి, పైన నల్లకోటు ధరించాలి.
- సివిల్ వ్యాజ్యాలు
- ఉదా: భూతగాదాలు, అస్తి తగాదాలు, వారసత్వపు తగాదాలు, అర్థిక మోసం, కుటుంబతగాదాల వంటివి సివిల్ వ్యాజ్యాల క్రిందికి వస్తాయి.
- క్రిమినల్ (నేరపూరితం)
- ఉదా: ఇతరులమీద భౌతికంగా దాడిచేసి గాయపరచడం, ప్రాణహాని కల్గించడం, దోపిడి, గాయ పరచి దొంగలించడం, దొంగతనం, మాదకద్రవాల అమ్మకం, దొంగనోట్ల మార్చుట, గృహహింస యిత్యాదులు క్రిమినల్ కేసుల క్రిందికి వస్తాయి.
చిత్రమాలిక[మార్చు]
-
న్యాయవాదికి ప్రముఖ ఉదాహరణ నాటి యు.ఎస్.అధ్యక్షుడు అబ్రహాం లింకన్, తరువాత ఇతను రాజకీయ నాయకుడుగా మారాడు.