పది శాతం మెదడు సామర్థ్యం పుకారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనిషి మెదడూ, పుర్రే

మనుషులు మామూలుగా వారి మెదడు సామర్థ్యంలో పది శాతం (లేదా అంతకన్నా తక్కువ) మాత్రమే వాడుకుంటారు అనే ఒక పుకారుని పది శాతం మెదడు సామర్థ్యం పుకారు అంటారు. ఈ పుకారుని చాలా మంది ప్రముఖ శాస్త్రవేత్తలకీ, చారిత్రాక పురుషులకీ, ముఖ్యంగా అల్బెర్ట్ ఐన్‌స్టైన్‌కి, తప్పుగా ఆపాదించారు.[1] ఈ పుకారు నుండి వాడకుండా మిగిలిపోయిన సామర్థ్యాన్ని మేల్కొలిపి, మనుష్యులు తమ మేధాశక్తిని పెంచుకోగలరు అనే నమ్మకం కూడా పుట్టింది.

కొత్త విషయాలూ, కొత్త అనుభవాలూ మెదడులోని ధూసర, శ్వేత ద్రవ్యాలలో మార్పులను తెస్తాయని తెలిసింది కానీ, ఈ మార్పులేమిటన్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియరాలేదు.[2] మెదడులో చాలా నిద్రాణ భాగాలు ఉన్నాయీ, వీటిని మేల్కొలపొచ్చూ అనే భావన కట్టుకథే తప్ప శాస్త్రీయ ఆధారాలు గల విషయం కాదు. మెదడు పనితీరుకు సంబంధించిన కొన్ని అంశాల (స్పృహా, జ్ఞాపకశక్తీ) గురించి ఇంకా పూర్తిస్థాయిలో తెలియరావాల్సి ఉన్నప్పటికీ, బ్రెయ్న్ మెపింగ్ (Brain Mapping)ను బట్టి, మెదడులో అన్ని భాగాలకూ ఉపయోగాలు ఉన్నాయనీ, దాదాపుగా ఎప్పుడూ ఈ భాగాలన్నీ చురుగ్గానే ఉంటాయనీ తెలుస్తోంది.[3][4]

పుట్టుక[మార్చు]

ఈ "10% పుకారు" హర్వర్డ్ మానసిక శాస్త్రవేత్తలైన విల్యం జెయ్మ్స్, బొరిస్ సైడిస్‌ల రిజర్వ్ ఎనర్జి సిద్ధాంతాల నుండి వచ్చి ఉండవచ్చు. వీరు 1890ల్లో బాలమేధావి ఐన విల్యం సైడిస్‌ను త్వరితగతిన పెంచుతూ వారి సిద్ధాంతాలని పరిక్షించారు. తరువాత జెయ్మ్స్ ఒక ప్రసంగంలో మనుషులు తమ మానసిక సామర్థ్యంలో ఒక చిన్న భాగాన్నే ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య నిజం అయ్యుండొచ్చు.[5]

వ్యక్తిత్వ వికాస పుస్తకాలకు ఆదరణ ఎక్కువగా ఉన్న 1920ల్లో, ఈ పుస్తకాల వలన జెయ్మ్స్ పరిభావన ప్రాచుర్యం పొందింది. మచ్చుకు మైన్డ్ మిథ్స్: ఎక్స్‌ప్లోరింగ్ పొప్యులర్ అసంప్షన్స్ అబౌట్ ద మైన్డ్ అన్డ్ బ్రెయ్న్ (Mind Myths: Exploring Popular Assumptions About the Mind and Brain, అర్థం: మెదడు పుకార్లు:మెదడూ, మనస్సుల ప్రఖ్యాత నమ్మకాల ఆవిష్కరణ) అనే పుస్తకంలో ఈ 10% పుకారుపై ఒక ప్రకరణం ఉంది. ఈ ప్రకరణంలో 1929 నాటి వర్ల్డ్ ఎల్మనెక్ ప్రపంచంలో జరిగే ముఖ్య విషయాల సమాహారంగా ఏడాదికొకసారి ప్రచురితమయ్యే అమెరికా పుస్తకం లోని ఒక ప్రకటన ఉండేది. అందులోని వాక్యం: "మానవ మేధస్సు సాధించగలిగే దానికి పరిమితి లేదు. శాస్త్రవేత్తలూ, మానసిక నిపుణులూ మనం మన మెదడు సామర్థ్యంలో పది శాతం మాత్రమే వాడుకుంటాం అని చెబుతున్నారు."[6]

ఈ "పది శాతం" పరిభావనపై నాటి పేరున్న అమెరికా వైజ్ఞానిక కాల్పనిక రచయిత జొన్ కెంప్‌బెల్ చాలా మక్కువ చూపించేవాడు.[7] 1932లో ఒక కథానికలో ఆయన "చరిత్ర మొత్తంలో ఏ మనిషీ కూడా ఎప్పుడూ తన మెదడులోని ఆలోచనా భాగంలో కనీసం సగం కూడా వాడలేదు." అని వ్రాసాడు.[8]

1936లో అమెరికా రచయితా, బుల్లితెర సమర్పకుడూ ఐన లవల్ థొమస్, డెయ్ల్ కార్నగి పుస్తకం హౌ టు విన్ ఫ్రెన్డ్స్ అన్డ్ ఇన్ఫ్లుయెన్స్ పీపౢకు (How to win friends and influence people, అర్థం: మిత్రులను పొందడం, జనాలపై ప్రభావం చూపడం ఎలా) వ్రాసిన ముందుమాటలో "హార్వర్డ్ ఆచార్యులు విల్యం జెయ్మ్స్ ఒక సగటు వ్యక్తి తన నిక్షిప్త మానసిక శక్తిలో పది శాతం మాత్రమే ఉపయోగించుకుంటాడు అని అనేవాడు" అని వ్యాఖ్యానించాడు.[9]

1970ల్లో బల్గేరియా మానసిక నిపుణుడూ, విద్యావేత్తా ఐన జొర్జి లొజనోవ్ "మనం మన మానసిక శక్తిలో ఐదు నుండి పది శాతం మాత్రమే వాడుకుంటూ ఉండి ఉంటాం" అనే నమ్మకంతో సజెస్టోపీడియా అనే బోధనా పద్ధతిని ప్రతిపాదించాడు.[10][11]

కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలోని మన్ట్రియోల్ న్యూరలొజికల్ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటి డైరెక్టర్‌గా సేవలందించిన అమెరికా మెదడు శస్త్రచికిత్సా నిపుణుడు విల్డర్ పెన్‌ఫీల్డ్‌కి కూడా ఈ పుకారు పుట్టుక ఆపాదించబడింది.[12]

19వ శతాబ్ది చివర్లోనూ, 20వ శతాబ్ది మొదట్లోనూ జరిగిన పరిశోధనలను తప్పుగా అర్థం చేసుకోవడం వలన కూడా ఈ పుకారు పుట్టి ఉండవచ్చు. మచ్చుకు మెదడులో చాలా భాగాల పనులు చాలా సంక్లిష్టమైనవి. ఈ భాగాలు దెబ్బతింటే, ఆ ప్రభావం చాలా సూక్ష్మంగా ఉండేది. అందువలన మొదట్లో ఈ విషయాలను శోధించిన పరిశోధకులు, అసలు ఈ భాగాల పని ఏమిటా అని అనుకునేవారు.[13] అలాగే మెదడు చాలావరకు గ్లైయల్ కణాలతో నిర్మితమైంది అని కూడా కనిపెట్టబడింది. ఈ కణాలవి అల్పవిధులు. బైయలొజికౢ సైకొలజి (Biological Psychology, అర్థం: జీవ మానసికశాస్త్రం) అనే పుస్తకం వ్రాసిన అమెరికా మానసిక నిపుణుడు జెయ్మ్స్ కలట్, 1930ల్లోనే శాస్త్రవేత్తలకు మెదడులో ఎక్కువగా ఉండే "స్థానిక" న్యూరాన్ల గురించి తెలుసు అన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ స్థానిక న్యూరాన్ల పనితీరుని తప్పుగా అర్థం చేసుకోవటమే ఈ పుకారుకు కారణమయ్యుండొచ్చు అని అభిప్రాయపడ్డాడు.[14] కొంత మంది ఎల్లప్పుడూ తమ మెదడులో ఎంతో కొంత భాగాన్ని వాడుకుంటూనే ఉంటారు అనే పరిభావనే తరువాతి కాలంలో ఈ పుకారుగా మారి ఉండొచ్చు. సైయన్టిఫిక్ అమెరికన్ (Scientific American, అర్థం: శాస్త్రీయ (దృక్పథం గల) అమెరికావాడు) అనే శాస్త్ర సంబంధ పత్రికలో, అమెరికా రాష్ట్రం మినిసోటాలోని రొచెస్టర్‌ నగరంలో ఉన్న ప్రముఖ వైద్య కేంద్రం ఐన మెయొ క్లినిక్‌లో (Mayo Clinic) మెదడు వైద్య నిపుణుడుగా చేస్తున్న, జొన్ హెన్లి తన వ్యాసంలో ఇలా వ్రాసాడు:"ఆధారాలను బట్టి చూస్తే మీరు ఒక రోజు మొత్తంలో మీ మెదడుని 100 శాతం వాడతారని తెలుస్తోంది".[1]

విశ్లేషణ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Do People Only Use 10 Percent Of Their Brains?". Scientific American. 7 February 2008. Archived from the original on 17 November 2008. Retrieved 7 February 2008.
  2. University of Oxford (16 October 2009). "Juggling Enhances Connections In The Brain". ScienceDaily. Archived from the original on 29 December 2011. Retrieved 30 May 2012. We've shown that it is possible for the brain to condition its own wiring system to operate more efficiently.
  3. Radford, Benjamin (8 February 2000). "The Ten-Percent Myth". snopes.com. Retrieved 13 April 2006.
  4. Chudler, Eric. "Myths About the Brain: Ten percent and Counting". Archived from the original on 2 April 2006. Retrieved 12 April 2006.
  5. "Debunking Common Brain Myths". Archived from the original on 10 May 2013. Retrieved 24 May 2011.
  6. Beyerstein, Barry L. (1999), "Whence Cometh the Myth that We Only Use 10% of our Brains?", in Della Sala, Sergio (ed.), Mind Myths: Exploring Popular Assumptions About the Mind and Brain, Wiley, p. 11, ISBN 978-0471983033
  7. Nevala-Lee, Alec (2018). Astounding: John W. Campbell, Isaac Asimov, Robert A. Heinlein, L. Ron Hubbard and the Golden Age of Science Fiction. Dey St. p. 67.
  8. Campbell, John W. (Spring–Summer 1932). "Invaders from the Infinite". Amazing Stories Quarterly. p. 216. Campbell followed up on this notion in a note to another story published five years later: "The total capacity of the mind, even at present, is to all intents and purposes, infinite. Could the full equipment be hooked into a functioning unit, the resulting intelligence should be able to conquer a world without much difficulty": Campbell, John W. (August 1937), "The Story Behind the Story", Thrilling Wonder Stories (note to the short story "The Double Minds"). Throughout his career, Campbell had sought grounds for a new "scientific psychology" and he was instrumental in formulating the brainchild of one of his more imaginative science fiction writers—the "Dianetics" of L. Ron Hubbard. (Nevala-Lee, Alec (2018). Astounding: John W. Campbell, Isaac Asimov, Robert A. Heinlein, L. Ron Hubbard and the Golden Age of Science Fiction. Dey St. passim.)
  9. "A Shortcut to Distinction". Archived from the original on 15 May 2011. Retrieved 24 May 2011.
  10. Larsen-Freeman, Diane (2000). "Techniques and Principles in Language Teaching". Teaching Techniques in English as a Second Language (2nd ed.). Oxford: Oxford University Press. p. 73. ISBN 978-0-19-435574-2..
  11. http://lppm.dinus.ac.id/docs/m/Suggestopedia:_How_Does_It_Accelerate_Language_Learning1.pdf[permanent dead link]
  12. "Do we use only 10 percent of our brain?". Psychology Today.
  13. Wang, Sam; Aamodt, Sandra (2 February 2008). Welcome to Your Brain: Why You Lose Your Car Keys but Never Forget How to Drive and Other Puzzles of Everyday Life. Bloomsbury Publishing USA. ISBN 9781596912830. Retrieved 25 September 2011.
  14. Kalat, J.W. (1998). Biological Psychology (sixth ed.). Pacific Grove: Brooks/Cole Publishing Co. p. 43. ISBN 9780534348939.