పద్మిని మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్

పద్మిని మూర్తి
ఇతర పేర్లుమినీ
విద్యMD, MPH, MS, CHES, MPhil, FAMWA
విద్యాసంస్థగుంటూరు వైద్య కళాశాల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
న్యూయార్క్ విశ్వవిద్యాలయం
వృత్తిరచయిత, సంపాదకురాటు, సహాయ ఆచార్యులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, గ్లోబల్ హెల్త్
గుర్తించదగిన సేవలు
ఐక్యరాజ్యసమితికి MWIA సహ-ప్రతినిధి

పద్మిని మూర్తి, భారతదేశానికి చెందిన ఆమె న్యూయార్క్ మెడికల్ కాలేజీలో వైద్యురాలు, ప్రొఫెసర్, గ్లోబల్ హెల్త్ డైరెక్టర్. 2016లో వైద్యరంగంలో మహిళాలోకానికి చేసిన కృషికి అమెరికన్ మెడికల్ ఉమెన్స్ అసోసియేషన్(AMWA) ఆమెకు ఎలిజబెత్ బ్లాక్‌వెల్ మెడల్‌ను ప్రదానం చేసింది.

జీవిత చరిత్ర[మార్చు]

ఆమె దేశంలోని గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించింది.[1] ఆమె ప్రసూతి, స్త్రీ జననేంద్రియ శాస్త్రం(Obstetrics and Gynecology)లో రెసిడెన్సీ చేసింది.[2]

ఆమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్, అలాగే మేనేజ్‌మెంట్‌లో మరో మాస్టర్స్ చేసింది. ఆమె నేషనల్ కమీషన్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్‌తో సర్టిఫైడ్ హెల్త్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ కూడా.[3]

2010లో, ఆమె ఉమెన్స్ గ్లోబల్ హెల్త్ అండ్ హ్యూమన్ రైట్స్ రచయిత.[4]

ఆమె ఐక్యరాజ్యసమితి ఎన్జీఓ కమిటీలలో సేవలు అందిస్తుంది. గతంలో ఐక్యరాజ్యసమితికి సలహాదారుగా ఉంది.[5] ఆమె అమెరికన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ మహిళల హక్కుల కమిటీకి వరుసగా మూడు పర్యాయాలు అధ్యక్షురాలిగా నియమితులయింది.[6]

ఆమె ప్రస్తుతం న్యూయార్క్ మెడికల్ కాలేజీలో హెల్త్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్, ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ మెడిసిన్, గ్లోబల్ హెల్త్ డైరెక్టర్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తోంది.[7]

అవార్డులు[మార్చు]

  • 2010లో, పద్మిని మూర్తి న్యూయార్క్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ఫెలోషిప్ పొందింది.[8]
  • 2015లో, వైద్యం, విద్య, ప్రజారోగ్యంలో ఆమె సాధించిన విజయాల కోసం ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హూస్ హూచే ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.[9]
  • 2013లో, ఆమెకు మేరీ క్యాచటూర్ మెమోరియల్ అవార్డు దక్కింది.
  • 2016లో, డాక్టర్ లతా పాటిల్ ప్రారంభ ప్రసంగం అవార్డు, డాక్టర్ హోమీ కొలబవల్లా ఓరేషన్ అవార్డు లభించాయి. ఆమెకు సోజర్నర్ ట్రూత్ పిన్ కూడా లభించింది, ఇది సమాజ సేవలో రాణిస్తున్న మహిళలకు ప్రదానం చేయబడుతుంది. జిరాద్ ఒరేషన్ అవార్డును కూడా అందుకుంది.
  • 2016లో, ఆమెకు ఎలిజబెత్ బ్లాక్‌వెల్ మెడల్ లభించింది, ఇది అమెరికన్ మెడికల్ ఉమెన్స్ అసోసియేషన్ అందించే అత్యున్నత పురస్కారం, ఇది వైద్యరంగంలో మహిళల కృషికి ఏటా అత్యుత్తమ మహిళా వైద్యురాలిని గుర్తిస్తుంది.[10]

మూలాలు[మార్చు]

  1. "Padmini Murthy MD, MPH, MS, CHES, MPhil, FAMWA". American Medical Women's Association (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-10-22. Retrieved 2018-10-22.
  2. "Prof. Dr. Padmini Murthy | The Medical Women's International Association (MWIA)". mwia.net (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-09-27. Retrieved 2018-10-22.
  3. "Padmini Murthy MD, MPH, MS, CHES, MPhil, FAMWA". American Medical Women's Association (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-10-22. Retrieved 2018-10-22.
  4. "Prof. Dr. Padmini Murthy | The Medical Women's International Association (MWIA)". mwia.net (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-09-27. Retrieved 2018-10-22.
  5. "Padmini Murthy - WEF". WEF (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-10-22.
  6. College, New York Medical. "Padmini Murthy, M.D., M.P.H., M.S., FAMWA, FRSPH". www.nymc.edu (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-22. Retrieved 2018-10-22.
  7. "Fellows News: Padmini Murthy, MD, MPH to Receive AMWA Blackwell Medal | New York Academy of Medicine". nyam.org (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-22. Retrieved 2018-10-20.
  8. "Fellows News: Padmini Murthy, MD, MPH to Receive AMWA Blackwell Medal | New York Academy of Medicine". nyam.org (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-22. Retrieved 2018-10-20.
  9. "Dr. Padmini Murthy Is Named Professional of the Year by the International Assoc. of Who's Who". Market Wired. 31 August 2015. Archived from the original on 10 ఏప్రిల్ 2019. Retrieved 22 October 2018.
  10. "Fellows News: Padmini Murthy, MD, MPH to Receive AMWA Blackwell Medal | New York Academy of Medicine". nyam.org (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-22. Retrieved 2018-10-20.