పప్పు యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పప్పు యాదవ్
పప్పు యాదవ్


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు శరద్ యాదవ్
తరువాత దినేష్ చంద్ర యాదవ్
నియోజకవర్గం మాధేపురా

వ్యక్తిగత వివరాలు

జననం (1967-12-24) 1967 డిసెంబరు 24 (వయసు 56)
పూర్ణియా
రాజకీయ పార్టీ జన్ అధికార పార్టీ (లోక్‌తంత్రిక్)
(9 మే 2015 – ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రీయ జనతాదళ్
జీవిత భాగస్వామి రంజీత్ రంజన్[1]
సంతానం సార్థక్ రంజన్
ప్రకృతి రంజన్
నివాసం పూర్ణియా, బీహార్, భారతదేశం

రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ (జననం 24 డిసెంబర్ 1967) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ రాష్ట్రంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల నుండి 1991, 1996, 1999, 2004, 2014లో స్వతంత్ర / ఎస్.పి / లోక్ జనతా పార్టీ / రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థిగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.[2] పప్పు యాదవ్ ప్రస్తుతం జన్ అధికార్ పార్టీ (లోక్‌తంత్రిక్) అధ్యక్షుడిగా ఉన్నాడు.[3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పప్పు యాదవ్ 24 డిసెంబర్ 1967న బీహార్‌లోని కుమార్ ఖండ్‌లోని ఖుర్దా కర్వేలి గ్రామంలో జన్మించాడు. ఆయన ఆనంద్ మార్గ్ స్కూల్, ఆనంద్ పల్లి, సుపౌల్‌లో చదివాడు. అతను మాధేపురాలోని బి.ఎన్ మండల్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ & IGNOU నుండి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్‌లో డిప్లొమా పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పప్పు యాదవ్  1990లో సింగేశ్వర్, మాధేపురా నుండి బీహార్ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో పూర్నియా నుండి 10వ లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. పప్పు యాదవ్ ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయనను 7 మే 2015న  ఆర్జేడీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా రాజేష్ రంజన్‌ని ఆర్జేడీ పార్టీ నుండి బహిష్కరించింది, ఆయన ఆ తర్వాత నుఅతనంగా జన్ అధికార్ పార్టీని స్థాపించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Hindustan Times (1 April 2019). "Lok Sabha Elections 2019: Pappu Yadav, wife Ranjeet Ranjan face tough political battle" (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  2. NDTV (11 March 2014). "Pappu Yadav returns to RJD, gets ticket from Bihar's Madhepura". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  3. Namasthe Telangana (8 May 2021). "బీజేపీ ఎంపీ స్థ‌లంలో అంబులెన్స్‌లు.. మండిప‌డిన ప‌ప్పు యాద‌వ్‌". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  4. Madhepura MP Pappu Yadav expelled from RJD, may join hands with BJP | Zee News. Zeenews.india.com (7 May 2015). Retrieved on 2015-07-28.