పరిమార్జన్ నేగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిమార్జన్ నేగి
దేశంభారతదేశం
పుట్టిన తేది (1993-02-09) 1993 ఫిబ్రవరి 9 (వయసు 31)
న్యూఢిల్లీ, భారతదేశం
టైటిల్గ్రాండ్ మాస్టర్ (2006)
ఫిడే రేటింగ్2638 (ఏప్రిల్ 2024)
అత్యున్నత రేటింగ్2671 (అక్టోబరు 2013)

1993 పిబ్రవరి 9 న జన్మించిన పరిమార్జన్ నేగి (Parimarjan Negi) భారతదేశపు చదరంగ క్రీడాకారుడు. 2005 లో ఇంటర్నేషనల్ మాస్టర్ హొదా పొంది ఈ ఘనతను సాధించిన పిన్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2006 జూలై లో 13 సంవత్సరాల 4 నెలల వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది ఈ ఘనత పొందిన పిన్న వయస్కులలో రెండో వాడిగా రికార్డు స్థాపించాడు.

నేగి భారతీయ, ఆసియా ఛాంపియన్. అతను నార్వేలోని ట్రోమ్సోలో 2014 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు కోసం టాప్ బోర్డులో ఆడాడు. అతనికి భారత ప్రభుత్వం 2010 లో అర్జున అవార్డును ప్రదానం చేసింది.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

పరిమార్జన్ నేగి న్యూఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. తరువాత అతనుస్టాన్‌పర్డు విశ్వవిద్యాలయం నుండి 2018 లో మ్యాథమెటిక్స్ ప్రధానాంశంగా పట్టభద్రుడయ్యాడు. ప్రస్తుతం అతను యునైటెడ్ స్టేట్స్ లోని మసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జ్ లో ఉన్న ఒక ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబొరేటరీలో పి.హెచ్.డి విద్యార్థి.


మూలాలు[మార్చు]

  1. Upama Sinha (22 October 2010). "Chess mate". The Hindu. Retrieved 23 December 2013.

బయటి లింకులు[మార్చు]