పరీక్ష (నవల)
పరీక్ష విశ్వనాథ సత్యనారాయణ 1951లో రాసిన నవల. దీనిని పి.ఆర్ అండ్ సన్సు, విజయవాడ 1959 లో ముద్రించారు.[1] ఈ పుస్తకం 1949-51 మధ్య కవిసామ్రాట్ రాసినట్లు అతని మనుమడు విశ్వనాథ సత్యన్నారాయణ విశ్వనాధుని 121వ జయంతి వేడుకలు సందర్భంగా విజయవాడలో తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఈ ‘పరీక్ష’ నవల ఆంగ్ల భాషా అనువాద పుస్తకాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న శతావధాని మేడసాని మోహన్ ఆవిష్కరించాడు. ఈ పుస్తకం రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం భారతదేశ పరిస్ధితి, ఆర్థిక వ్యవహారాలు, మార్పులు, పరిణామాలు వంటి విషయాలను అన్ని కోణాలలో విద్యార్థుల కోసం ఆవిష్కరించిన రచన,[2]
కథాంశం
[మార్చు]పరీక్ష కథా వస్తువు “పేరు”లోనే ఉన్నట్లు పరీక్ష. ఆ రోజుల్లో ఇంగ్లీషు చదువులు పేద సంసారాల మీద ఎలా ప్రభావం చూపాయన్నది ప్రధాన విషయం. కాని, లోతుగా ఆలోచించి చూస్తే ఈ రోజుల్లో విద్యా విధానాలు, పరీక్షలు విద్యార్థుల మనస్సుల మీద, తద్వారా వాళ్ళ జీవన స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది ఈ నవలలో కథాంశం.
మూలాలు
[మార్చు]- ↑ "పుస్తకం » Blog Archive » "పరీక్ష"-విశ్వనాథ వారి నవల" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-27.
- ↑ "విజయవాడలో పండుగలా విశ్వనాథుని జయంతి". lit.andhrajyothy.com. Retrieved 2021-01-27.
బాహ్య లంకెలు
[మార్చు]- "శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ' పరీక్ష' నవల - అనువాదం - Trial of Tenderness - ఆవిష్కరణ సభ 10.09.2016 - YouTube". www.youtube.com. Retrieved 2021-01-27.