పాతాళ భైరవి
| పాతాళభైరవి (1951) | |
మాంత్రికునిగా ఎస్.వి.రంగారావు, ప్రక్కన ఎన్.టి.ఆర్. [1] |
|
|---|---|
| దర్శకత్వం | కె.వి.రెడ్డి |
| నిర్మాణం | నాగి రెడ్డి & చక్రపాణి |
| రచన | పింగళి నాగేంద్రరావు, కమలాకర కామేశ్వరరావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు , ఎస్వీ రంగారావు , కె.మాలతి, చిలకలపూడి సీతారామాంజనేయులు, సావిత్రి , గిరిజ, వల్లూరి బాలకృష్ణ, సురభి కమలాబాయి, పద్మనాభం, రేలంగి |
| సంగీతం | ఘంటసాల |
| విడుదల తేదీ | 15 మార్చి 1951 |
| నిడివి | 195 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాతాళ భైరవి 1951 లో విడుదలైన జానపద చిత్ర రాజము (ఆల్ టైమ్ హిట్ క్లాసిక్). డి.వి.డి లాంటి కొత్త టెక్నాలజీ లు ఎన్ని వచ్చినా ఈ సినిమాను గౌరవించవలసినదే. యన్.టి.ఆర్ యుక్తవయస్సు ,ప్రతిభ నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది.
మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కధలులోని ఒక కధ దీనికి ఆధారం.
విషయ సూచిక |
కధ [మార్చు]
ఒక తోటలో పనిచేసే అమ్మాయి కొడుకు తోటరాముడు (ఎన్.టి.ఆర్.), ఉజ్జయిని రాజ్యం రాజుగారి కూతురిని (మాలతి) చూసి ప్రేమలో పడతాడు. రాజుగారినుండి సహకారం అందదని తెలిసిన తోటరాముడు ఒక మాంత్రికుడి (ఎస్.వి. రంగారావు) సహాయాన్ని కోరుతాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళభైరవి (గిరిజ) అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తికి ఎదురు ఉండదని, మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకొన్న తోటరాముడు అదునుచూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు.
కధ అంతతో ముగియదు. మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకొంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరది (రేలంగి) పాతాళభైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయవలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు ప్రయాణమౌతాడు.
తారాగణం [మార్చు]
- నందమూరి తారకరామారావు ... తోటరాముడు
- ఎస్.వి. రంగారావు ... నేపాళ మాంత్రికుడు
- కె.మాలతి ... ఇందుమతి
- చిలకలపూడి సీతారామాంజనేయులు ... రాజు
- గిరిజ ... పాతాళ భైరవి
- బాలకృష్ణ ... అంజి
- సురభి కమలాబాయి
- లక్ష్మీకాంతం
- పద్మనాభం ... డింగిరి
- హేమలతమ్మ
- రేలంగి .... రాజుగారి బావమరది
- సావిత్రి ... నర్తకి (రానంటే రానే పాటలో)
ముఖ్యమైన డైలాగులు [మార్చు]
- సాహసము సేయరా ఢింభకా రాజ కుమారి లభించునురా
- మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా
- జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?
- జై పాతాళ భైరవి
పాటలు [మార్చు]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
| కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
| కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
| ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్ఛగా | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
- ఇతిహాసం వినరా - కమలా చంద్రబాబు
- ప్రేమకోసం వలలో పడెనే పాపం పసివాడు - వి.జె. వర్మ
- వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు - జిక్కి
- తాళలేనే నే తాళలేనే - (రేలంగి?)
- హాయిగా మనమింకా స్వేచ్ఛగా - ఘంటసాల, లీల
- రానంటే రానే రాను - పిఠాపురం నాగేశ్వరరావు, టి.కె. సావిత్రి
- వినవే బాలా నా ప్రేమ గోలా - రేలంగి
మూలాలు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
| కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
|---|---|
| భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కధ | శ్రీకృష్ణసత్య |