పావురము

వికీపీడియా నుండి

పావురాలు
ఎగురుతున్న ఫెరల్ పావురము (Columba livia domestica)
ఎగురుతున్న ఫెరల్ పావురము (Columba livia domestica)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: పక్షులు
వర్గము: కొలంబిఫార్మిస్
కుటుంబము: కొలంబిడే
ఉపకుటుంబాలు
see article text

పావురము (Pigeon or Dove) ఒక రకమైన పక్షులు. ఇవి కొలంబిఫార్మిస్ క్రమంలోకొలంబిడే కుటుంబానికి చెందినవి. ఇవి 'శాంతి'కి చిహ్నాలు. ఇవి పెంపుడు పక్షులు.

పావురాలలో సుమారు 300 జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి కానీ ముఖ్యంగా ఇండోమలయా మరియు ఆస్ట్రేలాసియా ప్రాంతాలలో ఎక్కువగా రకాలున్నాయి.

పావురాలు పొట్టిగా లావుగా ఉండి, చిన్న మెడ మరియు ముక్కు కలిగివుంటాయి. సామాన్యంగా మనం పట్టణాలలో ఇంటి పరిసరాల్లో చూసే పావురాలను ఫెరల్ పావురాలు (Feral Pigeon) అంటారు.

పావురాలు చెట్లు, కొండచరియలు మరియు భూమి మీద పుల్లలతో గూడు కట్టుకుంటాయి. ఇవి ఒకటి లేదా రెండు గుడ్లు పెడతాయి. పిల్లల్ని ఆడమగ పక్షులు రెండూ సంరక్షిస్తాయి. పిల్లలు 7 నుండి 28 రోజుల తర్వాత గూడు వదిలి ఎగిరిపోతాయి.[1] పావురాలు గింజలు, పండ్లు మరియు చిన్న మొక్కల్ని తింటాయి.

[మార్చు] మూలాలు

  1. Crome, Francis H.J. (1991). in Forshaw, Joseph: Encyclopaedia of Animals: Birds. London: Merehurst Press, 115–116. ISBN 1-85391-186-0. 
పేజీకి సంభందించిన లింకులు