జంతువు

వికీపీడియా నుండి
(ఏనిమేలియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


జంతువులు
కాల విస్తరణ: Ediacaran - Recent
Clockwise from top-left: Loligo vulgaris (a mollusk), Chrysaora quinquecirrha (a cnidarian), Aphthona flava (an arthropod), Eunereis longissima (an annelid), and Panthera tigris (a chordate).
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
(unranked):
Kingdom:
ఏనిమేలియా

Phyla

Subregnum Parazoa

(alternatively)
Calcarea
Silicarea

Subregnum Eumetazoa

జంతువులు (లాటిన్: Animalia, స్పానిష్: Animales, ఆంగ్లం: Animals, పోర్చుగీస్: Animais, జర్మన్: Tiere) ఈ సృష్టిలో పరిణామక్రమంలో అన్నింటికన్నా ఉన్నతస్థాయిలో ఉన్న జీవులు.

ఏనిమేలియా వర్గీకరణ[మార్చు]

ఏనిమేలియా రాజ్యాన్ని కణజాలాల అభివృద్ధిని బట్టి రెండు ఉపరాజ్యాలుగా వర్గీకరించారు.

  • ఉపరాజ్యం అ: పేరాజోవా: ఇవి స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు. ఈ రాజ్యంలో పోరిఫెరా అనే ఒక వర్గం చేరి ఉంది.
  • ఉపరాజ్యం ఆ: మెటాజోవా: ఇవి స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణ జీవులు. దీన్ని రెండు శ్రేణులుగా (Grades) విభజించారు.
    • శ్రేణి 1: రేడియేటా లేదా డిప్లోబ్లాస్టికా: ఇవి వలయ సౌష్టవం కలిగిన ద్విస్తరిత (Diploblastic) జీవులు. నిడేరియా అనే వర్గాన్ని ఈ శ్రేణిలో చేర్చారు.
    • శ్రేణి 2: బైలటీరియా లేదా ట్రిప్లోబ్లాస్టికా: ఇవి ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన త్రిస్తరిత (Triploblastic) జీవులు. ఈ శ్రేణిని రెండు డివిజన్లుగా విభజించారు.
      • డివిజన్ ఎ: ప్రోటోస్టోమియా: (ప్రోటో = ముందు; స్టోమం = నోరు) ఇవి ఆది ఆంత్రరంధ్రం ( ) నోరుగా మారిన బహుకణ జీవులు. వీటిలో సర్పిలాకార, నిర్ధారిత విదళనాలు జరుగుతాయి. వీటిని మూడు సబ్ డివిజన్లుగా వర్గీకరించారు.
        • సబ్ డివిజన్ 1: ఏసీలోమేటా: ఇవి దేహకుహర రహిత బహుకణ జీవులు. దేహకుడ్యానికి, అంతరంగాలకు మధ్యప్రదేశం మీసెంఖైం లేదా మృదుకణజాలంతో నిండి ఉంటుంది. ఉ. వర్గం.ప్లాటీహెల్మింథిస్
        • సబ్ డివిజన్ 2: మిధ్యాసీలోమేటా: దేహకుడ్యానికి, ఆహారనాళానికి మధ్య కుహరం ఉంటుంది. కానీ ఇది మధ్యస్త్వచం ఉపకళలతో ఆవరించబడి ఉండదు. కాబట్టి ఇది నిజమైన సీలోం కాదు. ఉ. వర్గం. నెమటోడ
        • సబ్ డివిజన్ 3: షైజోసీలోమేటా: దేహకుహరం షైజోసీలిక్ రకానికి చెందిన నిజమైన సీలోం. ఇది మధ్యస్త్వచం చీలడం వల్ల ఏర్పడుతుంది. ఉ. వర్గం. అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా
      • డివిజన్ బి: డ్యూటిరోస్టోమియా: (డ్యూటిరో = ద్వితీయ; స్టోమం = నోరు) ఇవి ఆది ఆంత్ర రంధ్రం పాయువుగా లేదా దేహ ఆది ఆంత్ర రంధ్రానికి సమీపంలో పాయువు ఏర్పడిన యూసీలోమేట్లు. తరువాత నోరు ఆది ఆంత్ర రంధ్రానికి దూరంగా వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. వీటిలో వలయ విదళనాలు, అనిర్ధారిత విదళనాలు జరుగుతాయి. దీనిలో ఎంటిరో సీలోమేటా అనే సబ్ డివిజన్ ను చేర్చారు.

వర్గీకరణ చరిత్ర[మార్చు]

అరిస్టాటిల్ జీవ ప్రపంచాన్ని జంతువులు, మొక్కలుగా వర్గీకరించాడు. ఆ తరువాత కరోలస్ లిన్నేయస్ తొలసారిగా ఒక క్రమానుసారంగా జీవులను వర్గీకరించాడు. అప్పటినుండి జీవశాస్త్రజ్ఞులు వర్గీకరణలో జీవపరిణామ సంబంధాలకు పెద్దపీట వెయ్యటం వలన ఈ వర్గాల యొక్క విస్తృతి కొంత కుదింపుకు గురైనది. ఉదాహరణకు, సూక్ష ప్రోటోజోవాలు చర జీవులు కాబట్టి, ఇదివరకు వాటిని జంతువులుగా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు వాటిని ప్రత్యేక వర్గముగా భావిస్తున్నారు.

కరోలస్ లిన్నయస్ యొక్క తొలి ప్రతిపాదనలోని మూడు సామ్రాజ్యాలలో జంతు సామ్రాజ్యము ఒకటి. జంతువులను ఆయన వెర్మిస్, ఇన్సెక్టా, పిసెస్, ఆంఫీబియా, ఏవ్స్, మమ్మేలియా తరగతులుగా విభజించాడు. ఆ తరువాతి కాలంలో చివరి నాలుగింటినీ, కార్డేటా అనే ఒకే ఫైలం కింద ఉంచి ఇతర జంతుజాలాన్ని ప్రత్యేకంగా ఉంచారు. ఒక మూలం నుండి ఇంకో మూలానికి చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ, పైన ఇచ్చిన జాబితా జంతువుల వర్గీకరణపై మన ప్రస్తుత అవగాహనను స్థూలంగా ప్రతిబింబిస్తున్నది.

ఆధునిక టాక్సానమీ యొక్క పితగా భావించబడే కరోలస్ లిన్నేయస్.

విలుప్త జంతువులు[మార్చు]

ఎగిరే జంతువులు[మార్చు]

కొన్ని జంతువులు గాలిలోకి ఎగిరే శక్తిని కలిగివుంటాయి. వీటిని ఎగిరే జంతువులు అంటారు. వీటిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు మొదలైనవి ముఖ్యమైనవి. అరుదుగా కొన్ని రకాల చేపలు, క్షీరదాలు కూడా పరిణామ క్రమంలో ఈ లక్షణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=జంతువు&oldid=3572485" నుండి వెలికితీశారు