ప్లాటీహెల్మింథిస్
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ప్లాటిహెల్మింథిస్ | |
|---|---|
| "Platodes" from Ernst Haeckel's Kunstformen der Natur, 1909 | |
| Scientific classification | |
| Kingdom: | ఏనిమేలియా |
| Subkingdom: | Eumetazoa |
| Superphylum: | Platyzoa |
| (unranked): | Bilateria |
| Phylum: | ప్లాటిహెల్మింథిస్ Gegenbaur, 1859 |
| Classes | |
ప్లాటిహెల్మింథిస్ (ఆంగ్లం Platyhelminthes) వర్గాన్ని గెగెన్ బార్ ఏర్పరిచారు. సాధారణంగా బల్లపరుపు పురుగులు (ప్లాటి:బల్లపరుపు) అని పిలిచే ఈ జీవులు త్రిస్తరిత జీవులు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవంతో, శరీర కుహరరహితంగా ఉంటాయి. ఎక్కువగా పరాన్నజీవులు, కొన్ని స్వేచ్ఛాజీవులు. ఇవి సాగర, మంచినీటి, భూచర పరిసరాలలో నివసిస్తాయి.
సాధారణ లక్షణాలు [మార్చు]
- శరీరం పృష్టోదరంగా అణిగి ఉంటుంది. కాబట్టి వీటిని సాధారణంగా 'బల్లపరుపు పురుగులు' అంటారు.
- ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం కనబరుస్తాయి. మధ్య అక్షానికి ఇరువైపులా శరీర అవయవాలు ఉంటాయి. జీవిని సమాయత అక్షంలో ఖండించినప్పుడు దర్పణ ప్రతిబింబ అర్ధబాగాలు ఏర్పడతాయి.
- మితమైన శిరఃప్రాధాన్యం, ఏకదిశా చలనం కలిగి ఉంటాయి.
- ఇవి మొట్టమొదటి త్రిస్తరిత జీవులు. ఇవి పిండదశలో మధ్యత్వచాన్ని ఏర్పరుచుకొంటాయి. ఇది మూడో జననస్తరం, నిజ కండర కణజాలం అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
- జీర్ణనాళానికి, శరీర కుడ్యానికి మధ్య శరీర కుహరం లేదు. కాబట్టి వీటిని కుహరరహిత జీవులు అంటారు. మధ్యత్వచం నుంచి ఏర్పడిన మృదుకణజాలం దీని స్థలంలో నిండి ఉంటుంది.
- బల్లపరుపు పురుగు శరీర నిర్మాణం, అవయవ, వ్యవస్థల స్థాయిని ప్రదర్శిస్తుంది.
- జీర్ణనాళానికి ఒకే ఒక్క రంధ్రం ఉంటుంది. అదే నోరు. నిడేరియాలలోలాగ పాయువు లేదు. నోటిద్వారానే ఆహార అంతర్గ్రహణం, మలవిసర్జనం జరుగుతుంది. నిడేరియా జీవులలో లాగా జఠరప్రసరణ కుహరకుడ్యపు కణాలు, ఆహారపదార్ధాలను భక్షించి, కణాంతస్థ జీర్ణక్రియ జరుపుకొంటాయి.
- మిధ్యాఖండీభవనం గల సెస్టోడా (బద్దెపురుగులు) మినహాయించి ఏ జీవులలోనూ ఖండీభవనం లేదు.
- జ్వాలా కణాలు అనే ప్రత్యేకమైన ప్రాధమిక వృక్కాలతో విసర్జన జరుగుతుంది. జ్వాలా కణాలు జంతువుకూ పరిసరాలకూ మధ్య ద్రవాభిసరణక్రమతను నియంత్రిస్తాయి.
- శ్వాస, రక్తప్రసరణ వయవస్థలు లేవు.
- నాడీవ్యవస్థలో మితంగా అభివృద్ధిచెందిన మెదడు, నాడీదండాలు ఉంటాయి. స్వేచ్ఛగా నివసించే జీవులలో జ్ఞానాంగాలు ఉంటాయి.
- ఎక్కువగా ఉభయలింగ జీవులలో అంతఃఫలదీకరణ జరుగుతుంది.
- జీవితచరిత్ర సరళంగా లేదా క్లిష్టంగా ఉంటుంది. ఒకటి లేదా ఎక్కువ మాధ్యమిక అతిధేయులు కలిగి, వివిధ రకాలైన పిండాభివృద్ధి దశలైన మిరాసీడియమ్, స్పోరోసిస్టు, రీడియా, సర్కేరియా మొదలయినవి ఉంటాయి. కొన్నిటిలో బహుపిండత్వం సర్వసాధారణం.
వర్గీకరణ [మార్చు]
ప్లాటిహెల్మింథిస్ వర్గాన్ని మూడు విభాగాలుగా వర్గీకరించారు.
- విభాగం 1: టర్బెల్లేరియా:
- విభాగం 2: ట్రెమటోడా: ఉ. లివర్ ఫ్లూక్
- విభాగం 3: సెస్టోడా: ఉ. టీనియా, ఎకైనోకోకస్