ఆర్థ్రోపోడా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
ఆర్థ్రోపోడా |
|||||||
|---|---|---|---|---|---|---|---|
Mexican redknee tarantula
Brachypelma smithi |
|||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||
|
|||||||
|
|
|||||||
|
ఆర్థ్రోపోడా (Arthropoda) జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం. దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా జీవులు. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు కీళ్ళు గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. రొయ్యలు, కీటకాలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్ళు, సాలెపురుగులు మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.
[మార్చు] సాధారణ లక్షణాలు
- శరీరం ఖండీభవనం కలిగి ఉండి, తల, వక్షం, ఉదరం లేదా తల, మొండెంగా విభేదనం ఉంటుంది. ఈ జీవులలో శిరఃప్రాధాన్యం కోసం తలలో ఎక్కువ ఖండితాలు కలవడం, నాడీ నియంత్రణ జ్ఞాన గోచరత్వం శిరస్సు భాగంలో కేంద్రీకృతమవడం జరిగింది.
- కీళ్ళు గల ఉపాంగాలుంటాయి.
- శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం రక్షణకు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
- రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
- వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్ధం ఉంటుంది.
- వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
- వివిధ సమూహాలలో హరిత గ్రంధులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంధులు మొదలయినవి విసర్జక అవయవాలు.
- నాడీ వ్యవస్థలో నాడీవలయం, ద్వంద్వ ఉదర నాడీ దండం ఉంటాయి.
- సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు, స్పర్శకాలు సంతులన కోశం మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి.
- ఇవి ఏకలింగ జీవులు; అంతఃఫలదీకరణ జరుగుతుంది; అభివృద్ధి సాధారణంగా పరోక్షంగా జరుగుతుంది. జీవితచరిత్రలో ఒకటి లేదా ఎక్కువ డింభక దశలు ఉంటాయి. రూపవిక్రియ జరుగుతుంది.
[మార్చు] వర్గీకరణ
- ఉపవర్గం I: ట్రైలోబైటా
- ఉపవర్గం II: కెలిసరేటా
- విభాగం 1: యూరిప్టెరిడా: ఉ. సముద్రపు తేళ్ళు
- విభాగం 2: జీఫోస్యూరా ఉ. రాచపీత
- విభాగం 3: ఎరాక్నిడా: ఉ. తేలు, సాలెపురుగు, మైట్
- ఉపవర్గం III: మాండిబ్యులేటా

