శతపాదులు

వికీపీడియా నుండి

శతపాదులు
శిలాజ విస్తృతి: Silurian - Recent
Centipede.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: ఆర్థ్రోపోడా
Subphylum: మిరియాపోడా
తరగతి: కీలోపోడా
Latreille, 1817
Orders and Families
See text

శతపాదులు (Centipede) (from లాటిన్ prefix centi-, "నూరు", and గ్రీకు ποδός podos, "పాదం") ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జంతువులు. ఇవి మిరియాపోడా ఫైలమ్ లోని కీలోపోడా తరగతికి చెందినవి. వీటిని జెఱ్ఱి అని కూడా పిలుస్తారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 జాతుల శతపాదులున్నట్లు అంచనా.[1] వీటిలో సుమారు 3,000 జాతులు మాత్రమే గుర్తించబడ్డాయి. ఇవి విస్తృతంగా ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఉష్ణమండలం మరియు ఎడారి వాతావరణంలోనూ నివసిస్తాయి.[2] వీటికి తేమ చాలా అవసరం. అందువలన ఇవి ఎక్కువగా భూమిలోపల, రాళ్ళక్రింద నివసిస్తాయి.

కొన్ని శతపాదులు మానవులకు హాని కలిగిస్తాయి. అయితే వీటికాటు వలన నొప్పి కలుగుతుంది. కొందరికి ఎలర్జీ వస్తుంది. సామాన్యంగా ప్రాణహాని ఉండదు.

[మార్చు] సామాన్య లక్షణాలు

  • శతపాదులు పొడవుగా సన్నగా ఉండే జీవులు. ఇవి కొన్ని మిల్లీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు ఉంటాయి.
  • వీటి దేహం తల, మొండెంగా విభజితమై ఉంటుంది.
  • తలలో ఒక జత స్పర్శశృంగాలు, రెండు జతల జంభికలు, ఒక జత హనువులు ఉంటాయి. రెండవ జత హనువులు విలీనం చెందడం వలన అధరం ఏర్పడుతుంది.
  • ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళుంటాయి. (సహస్రపాదులకు రెండు జతలుంటాయి)
  • శతపాదులన్నింటికీ మొదటి ఖండితంలో ఒక జత విషపు నఖాలు (venom claws) ఉంటాయి.
  • విసర్జకాంగాలు - మాల్పీజియన్ నాళికలు.

[మార్చు] మూలాలు

  1. Adis, J. and M.J. Harvey. 2000. How many Arachnida and Myriapoda are there worldwide and in Amazonia? Studies on Neotropical Fauna and Environment, 35: 139-141.
  2. Lewis, J.G.E. 1981. The biology of centipedes. Cambridge University Press, Cambridge.
పేజీకి సంభందించిన లింకులు