నొప్పి

వికీపీడియా నుండి

శరీరానికి కలిగే లేదా కలగబోయే ఎటువంటి రకమైన శారీరక లేదా మానసిక బాధనైనా నొప్పి (Pain) అంటారు.[1] నొప్పిలో చాలా వ్యక్తిగత వ్యత్యాసం ఉంటుంది. వైద్యులు నొప్పి యొక్క తీవ్రత మొదలైన వివిధ లక్షణాలను విశ్లేషించి వ్యాధిని నిర్ధారిస్తారు.

నొప్పి వివిధ వ్యాధుల వలన కలుగుతుంది. చాలా మందిలో సాధారణ జీవనానికి అంతరాయం కలిగిస్తుంది. చాలా వరకు నొప్పి ఏవిధమైన వైద్యం అవసరం లేకుండా తగ్గిపోతుంది. కొన్నింటికి గృహ వైద్యాలు లేదా చిట్కాలు బాగా పనిచేస్తాయి. అతి తక్కువ శాతం మాత్రమే తగ్గకుండా వైద్యుని అవసరం పడుతుంది. వీరిని సంప్రదించిన నొప్పి నివారణ మందుల వల్ల చాలా నొప్పులు తగ్గిపోతాయి.

నొప్పి అనేది ప్రాధమికంగా మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించినది. దీని ముఖ్య ఉద్దేశం నొప్పిని కలిగించే కారకాల నుండి శరీరాన్ని లేదా శరీర భాగాన్ని తొలగించడం మరియు మానసికంగా మనల్ని జాగరూకులను చేయడం.


[మార్చు] నొప్పుల్లో రకాలు

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B1%8A%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు