పిఎస్‌ఎల్‌వి-సీ27 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
320 టన్నులు
పిఎస్‌ఎల్‌వి-సీ27 ఉపగ్రహ వాహకనౌక
విధి Medium lift launch system
తయారీదారు ఇస్రో
దేశము ఇండియా
పరిమాణము
ఎత్తు 44.4 metres (146 ft)
వ్యాసము 2.8 metres (9 ft 2 in)
ద్రవ్యరాశి PSLV: 295,000 kg (650,000 lb)
PSLV-CA: 230,000 kg (510,000 lb)
PSLV-XL: 320,000 kg (710,000 lb)
దశలు 4
సామర్థ్యము
ప్రయోగ చరిత్ర
స్థితి Active
ప్రయోగ స్థలాలు సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం బూస్టర్లు (PSLV-G) - S12
బూస్టర్ల సంఖ్య 6
ఇంజన్లు off
థ్రస్టు 716 kN (161,000 lbf)
Specific impulse 262 s (2.57 km/s)
ఇంధనం HTPB=హైడ్రాక్సిల్ టెర్మినెటెడ్ పాలి బ్యూటడైన్
First దశ
ఇంజన్లు S139
థ్రస్టు 4,819 kN (1,083,000 lbf)
Specific impulse 237 s (2.32 km/s) (sea level)
269 s (2.64 km/s) (vacuum)
ఇంధనం HTPB=హైడ్రాక్సిల్ టెర్మినెటెడ్ పాలి బ్యూటడైన్
Second దశ
ఇంజన్లు 1 Vikas
థ్రస్టు 804 కిలో న్యూటన్లు
Specific impulse 293 s (2.87 km/s)
ఇంధనం Unsymmetrical Dimethyl Hydrazine + 25% Hydrazine Hydrate
Third దశ
ఇంజన్లు S7
థ్రస్టు 240కిలోన్యూటన్లు
ఇంధనం solid HTPB
Fourth దశ
ఇంజన్లు 2 x L-2-5
థ్రస్టు 2X7.3కిలో న్యూటన్లు
ఇంధనం MMH= Monomethylhydrazine+Mixed Oxides of Nitrogen(MON)

పిఎస్ఎల్‌వి-సీ27 ఉపగ్రహ వాహకనౌక ఇస్రో వారు రూపొందించిన 29వ ధ్రువియ ఉపగ్రహ ప్రయోగనౌక. ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి అను నావిగేసన్ వ్యవస్థకు చెందిన నాల్గవఉపగ్రహన్ని అంతరిక్షకక్ష్యలో 2015 మార్చి 28లో ప్రవేశపెట్టారు.మొదట ఈ ఉపగ్రహవాహనాన్ని2015 మార్చి 9లో ప్రవేశపెట్టూటకు మొదట నిర్ణయించినప్పటికి, తరువాత వాయిదా వేశారు.[1] ఇండియన్ రిజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టాన్ని క్లుప్తంగా ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటారు. భారతీయ ప్రాదేశిక ప్రాంతానికి చెంది విమానయాన, నౌకాయాన, రహదారి వాహన యానాలపై స్వంత జిపియస్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణలోనియంత్రణకై ఇండియన్ రిజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టాన్ని రూపొందించారు.ఈ ప్రణాళిక విధానం ప్రకారం ఏడు నావిగేసన్ ఉపగ్రహాలను అంతరిక్షములో ప్రదక్షణ చేయించడం ద్వారా, భారత దేశానికి చెందిన 1500 కి.మీ.పరిధి మేరకు అంతరిక్షము నుండి భారతీయ ప్రాదేశిక ప్రాంతానికి చెంది విమానయాన, నౌకాయాన, రహదారివాహన యానాలపై స్వంత జిపియస్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చెయ్యవచ్చును. ఇప్పటికే మూడు నావిగేసన్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఆవరుసలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి అనేది నాల్గవ నావిగేసన్ ఉపగ్రహం.

పిఎస్ఎల్‌వి శ్రేణి ఉపగ్రహ వాహకనౌక[మార్చు]

ఇస్రోతయారుచేసి ప్రయోగించిన ఉపగ్రహ వాహకనౌక రకాలలో పిఎస్ఎల్‌వి రకానికి చెందిన ఉపగ్రహ వాహకనౌక ఎక్కువ విజయవంతమైన వాహకనౌక. అందులో పిఎస్ఎల్‌వి –XLతరగతి చెందిన వాహకనౌక ద్వారా 1400-1700 కిలోల వరకు బరువు ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలో సునాయాసంగా ప్రవేశపెట్టగలదు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి ఉపగ్రహాన్నికూడా పిఎస్ఎల్‌వి –XLతరగతి చెందిన పిఎస్ఎల్‌వి-సీ27ద్వారా కక్ష్యలోకిపంపారు.

పిఎస్ఎల్‌వి-సీ27 నిర్మాణం[మార్చు]

పిఎస్ఎల్‌వి-సీ27 వాహకనౌక నాలుగు దశలను/అంచెలను/స్టేజిలను కలిగి ఉంది.ఇందులో మొదటి, మూడో దశలలో ఘన ఇంధనాన్ని, రెండవ, నాలగవ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. మొదటి దశలో రాకెట్ భూమ్యాకర్షణశక్తిని ఛేదించి, ఆకాశంవైపు దూసుకు వెళ్ళుటకు కావలసిన అదనపు త్రోపుడు/గమన శక్తిని మొదటి దశ బాహ్య భాగమున అమర్చిన ఆరు బుస్టారు, స్ట్రాపాన్ మోటరుల ఇంధనదహనం వలన అందించబడును.

మొదటిదశను PS1అందురు.దీని పొడవు 20 మీటర్లు. మొదటిదశ వ్యాసము 2.8 మీటర్లు.ఈదశలో నింపిన ఘన ఇంధన పరిమాణం 138.2 టన్నులు.మొదటి దశచోదక దహనం వలన 4815కిలోన్యూటనుల త్రోయుపీడన శక్తి ఏర్పడును. మొదటిదశలో వాడిన ఘన ఇంధనం HTPB (హైడ్రాక్సిల్ టెర్మినెటేడ్ పాలి బ్యుటడైన్). మొదటి దశకు అనుసంధానింపబడిన స్ట్రాపాన్ బూస్టరు పొడవు 12 మీటర్లు, వ్యాసము 1మీటరు.ఒక్కో స్ట్రాపాన్ బూస్టరులో నింపబడిన ఇంధన పరిమాణం 12.2టన్నులు. ఒక్కో స్ట్రాపాన్ బూస్టరు వలన 716 కిలో న్యూటనుల శక్తి ఏర్పడును. ఈఆరు స్ట్రాపాన్ బూస్టరులలో కూడా ఘన ఇంధనం HTPB (హైడ్రాక్సిల్ టెర్మినెటేడ్ పాలి బ్యుటడైన్) ఉపయోగించారు.రెండవదశ పొడవు 12.8 మీటర్లు, వ్యాసము 2.8 మీటర్లు.రెండవ దశను PS2అందురు.ఇందులో వాడిన ద్రవ ఇంధన పరిమాణం 42 టన్నులు.వాడిన ఇంధనం UH25 + N2O4 (UH25= Unsymmetrical Dimethyl Hydrazine + 25% Hydrazine Hydrate, N2O4= Nitrogen Tetroxide).ఈ ఇంధన దహనం వలన 804కిలో న్యూటనుల త్రోపుడు (thrust) శక్తి వెలువడును. మూడవ దశను PS3అందురు.ఈ దశపొడవు 3.6 మీటర్లు. వ్యాసం 2.0 మీటర్లు. ఇందులో కూడా మొదటిదశలో వాడిన HTPB (హైడ్రాక్సిల్ టెర్మినెటేడ్ పాలి బ్యుటడైన్) నే ఇంధనంగా ఉపయోగించారు. ఇంధన పరిమాణం 7.6టన్నులు. వెలువడు త్రోపుడు శక్తి 240 కిలో న్యూటన్లు. ఇక చివరి నాల్గవ దశను PS4 అంటారు.ఈ దశ పొడవు 3.0మీటర్లు, వ్యాసం 1.3 మీటర్లు.ఇందులో నింపిన ద్రవ ఇంధన పరిమాణం 2.5టన్నులు.వాడిన ద్రవ ఇంధనం MMH + MON-3 (MMH=మోనో మిథైల్ హైడ్రాజిన్, MON-3=మిశ్రమ నైట్రోజన్ ఆక్సైడులు). ఇందులో రెండు దహన ఇంజనులు ఉండి, ఒక్కో ఇంజను 7.5 న్యూటన్ల శక్తిని విడుదల చేయును.[2]

పిఎస్ఎల్‌వి-సీ27 గమన వివరాలు[మార్చు]

కౌంట్‌డౌన్ సున్నాకు చేరిన వెంటనే మొదటి దశ/PS1 యొక్క ఘన ఇంధనం కలిగిన S-138 రాకెట్ ఇంజన్ మండటం (దహన చర్య) మొదలైనది. 0.4 సెకన్ల తరువాత, మొదటి దశకు బాహ్యంగా, వలయాకారంలో అమర్చిన ఆరు స్ట్రాపాన్ బుస్టారు మోటరులలో, రెండు స్ట్రాపాన్ బుస్టారు మోటరుల దహన క్రియ మొదలైనది. 0.62సెకన్ల తరువాత మరో రెండు స్ట్రాపాన్ మోటరుల ఇంజనులు కూడా పనిచెయ్యడం ప్రారంభించాయి. చివరి రెండు స్ట్రాపాన్ బుస్టారు మోటరులు, వాహకనౌక గాలిలోకి లేచి, పయనం మొదలు పెట్టిన 25 సెకన్ల తర్వాత మండటం ప్రారంభించాయి.స్ట్రాపాన్ బుస్టరులలో S-12 ఘనఇంధనాన్ని మండించు ఇంజన్లను అమర్చారు. రాకెట్ అంతరిక్ష కక్ష్య వైపు గమనం ప్రారంభింన 70 (69.9) సెకన్లకు, మొదటి రెండు స్ట్రాపాన్ ఇంజనుల దహన చర్య ముగిసి, రాకెట్ నుండి వేరుపడినవి. ఆతరువాత సెకనులో 20 వ వంతు వ్యవధిలో రెండో జత స్ట్రాపాన్ ఇంజనుల దహన చర్య ముగిసి అవికూడా వేరుపడినవి. రాకెట్ గాలిలోకి లేచిన తరువాత అంటించిన చివరి రెండు స్ట్రాపాన్ మోటరులు 92సెకన్ల తరువాత దహన చర్య ముగిసిన తరువాత రాకెట్ నుండి విడి పోయాయి.మొదటి దశ మోటరు 110.8సెకన్ల పాటు మండి, వేరుపడు సమయానికి వాహకనౌకను 56 కి.మీ ఎత్తుకు మోసుకెళ్ళినది.ఈ సమయంలో రాకెట్ గమన త్వరణం సెకనుకు 2.39కి.మీ. మొదటి దశవేరుపడిన సెకనులో ఇరవైవ వంతు కాలవ్యవధి తరువాత రెండోదశ/ PS2 ఇంజను దహన చర్య మొదలైనది.ఇందులో వికాస్ ఇంజన్ ను ఉపయోగించారు[3].

రెండవ దశ పనిచెయ్యడం మొదలైన 92.8 సెకన్ల తరువాత, నాల్గవ దశపై భాగాన ఉన్న ఎక్విఫ్‌మెంట్ బేస్ పైన అమర్చిన ఉపగ్రహం చుట్టూ, వాహకనౌక పరిసర వాతావరణం గుండా అంతరిక్షము వైపు దూసు కెల్లునపుడు ఘర్షణ/రాపిడి వలన ఏర్పడు వత్తిడి, ఉష్ణోగ్రతవత్యాసాలనుండి, ఉపగ్రహ రక్షణకై అమర్చిన రక్షణకవచం సురక్షితగా వేరుపడినది. రెండవ దశదహన చర్య 2 నిమిషాల 21.8సెకన్లపాటు కొనసాగినది.రెండవ దశ పనిచెయ్యడం పూర్తఅయిన 1.2 సెకన్ల తరువాత ఇది వాహకనౌక నుండి వేరుపడినది. ఆతర్వాత మూడోదశ పనిచెయ్యడం మొదలైనది. మూడవ దశ ఇంజను 70 సెకన్లపాటు ఇంజనును మండినది. మూడవ దశలో S-7అను ఘన ఇంధనాన్ని మండించు ఇంజనును అమర్చారు. మూడవదశ దహన చర్య ముగిన తరువాత 4 నిమిషాల 53.9 సెకన్ల తరువాత ఈ భాగం వాహకనౌక నుండి వేరుపడినది. మూడవదశ వాహకనౌక నుండి వేరుపడిన 10.3సెకన్ల తరువాత నాల్గవ దశపని చెయ్యడం మొదలైనది. నాల్గవ దశలో రెండు L-2.5 ఇంజనులను ఉపయోగించారు. నాల్గవదశ ఎనిమిది నిమిషాల 39 సెకన్లు మండినతరువాత, నాల్గవ దశ దహన క్రియ ముగిసిన 37 సెకన్ల తరువాతనిర్దేశిత ఎత్తుకు చేరి, ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి ఉపగ్రహాన్ని ప్రాథమికంగా బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టినది.ఉపగ్రహ వాహకనౌక పయనం మొదలైన తరువాత నాల్గవ దశ వరకు మొత్తం 19 నిమిషాల 25 సెకన్ల సమయం పట్టినది[3].

ఉపగ్రహ ప్రయోగం[మార్చు]

ఐఆర్ఎన్ఎస్ఎస్-1D ఉపగ్రహాన్ని కూడా పిఎస్ఎల్ వి-సీ27 ఉపగ్రహ వాహకనౌక ద్వారా శనివారం,2015 మార్చి 28 అంతరిక్షకక్ష్యలో ప్రవేశ పెట్టారు.పిఎస్ఎల్ వి-సీ27 ఉపగ్రహ వాహకనౌకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ థవన్ అంతరిక్షకేంద్రం నుండి, రెండవ ప్రయోగ వేదిక నుండి ప్రయోగించారు.[4]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "Isro launches India's 4th navigation satellite". business-standard.com. Archived from the original on 2016-02-13. Retrieved 2016-02-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "PSLV-C27 IRNSS-1D" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2015-07-12. Retrieved 2016-02-13.
  3. 3.0 3.1 "PSLV launches with IRNSS-1D to open India's 2015 campaign". nasaspaceflight.com. Archived from the original on 2016-02-14. Retrieved 2016-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "IRNSS 1D". isro.gov.in. Archived from the original on 2015-03-31. Retrieved 2016-02-11.