పి.చంద్ యాదగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూరుగొండ యాదగిరి
జననం
పూరుగొండ యాదగిరి

11-9-1954
వరంగల్లు
ఇతర పేర్లుపి.చంద్, కార్మిక, వీరమల్లు, కె.రమాదేవి, ఉదయగిరి, ఎ.చంద్ర శేఖర్, వి. హరి, గోపి, వినిల్ చైతన్య....
వృత్తిసింగరేణి కాలరీస్ కంపెనీ క్లర్క్
ఉద్యోగంసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
జీవిత భాగస్వామిబి.ఇందిర,
పిల్లలుముగ్గురు
తల్లిదండ్రులు
  • కీ.శే.మల్లయ్య (తండ్రి)
  • కీ.శే.వూగొండ వీరమ్మ (తల్లి)

పి.చంద్ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతను అనేక కలం పేర్లతో రచనలు చేశారు అవి వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరు 1980 నుండి 100 కు పైగా కథలు వ్రాశారు. 4 కథా సంపుటాలు, 7 నవలలు ఇతర పుస్తకాలు 10 కి పైగా ప్రచురించ బడ్డాయి.

తెలుగు సాహిత్యం లో కార్మిక, శ్రామిక వర్గాలపట్ల ఉద్యమ స్పృహతో నవలలు రాసిన ఒకరిద్దరిలో పి.చంద్ ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.పి. చంద్ గారి నాయిన ఆజంజాహి మిల్లులో కార్మికునిగా పని చేశారు. పి.చంద్ కూడా సింగరేణిలో కార్మికునిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కాబట్టే వారి నవలలలో, కథలలో ఎక్కువగా కార్మికుల, శ్రామికుల జీవితం కనపడుతుంది. ఆ వర్గాలపట్ల అంకితంగా పనిచేసిన ఉద్యమ నాయకుల ప్రభావంతో కూడా పి.చంద్ నవలలు రాశారు. 

దాదాపు వారు రాసిన అన్ని నవలలు ప్రసిద్ధి పొందాయి.100 కు పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. పి.చంద్ ఎక్కువగా కార్మిక, కే. రమాదేవి, వి. చంద్రశేఖర్, వీరమల్లు, గోపి తదితర మారుపేర్లతో ( కలం పేరు) రాశారు.

తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎక్కువగా కథలు, కవిత్వం, పాటలు, వ్యాసాలూ వచ్చాయి కాని నవలలు రాలేదు. అయితే పి. చంద్ మాత్రం తెలంగాణ మలిదశ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉద్యమంలో పాల్గొంటూ 2 నవలలు రాశారు. తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ‘తెలంగాణ‘ నవల, సింగరేణి కార్మికుల ఉద్యమం మీద ‘సకల జనుల సమ్మె‘ నవల రాశారు.

అద్దంలో మొఖం చూసుకొని ఎట్లయితే సవరించుకుంటమో అట్లనే సాహిత్యం కూడా జీవితాన్ని వున్నతీకరించాలని పి.చంద్ భావిస్తూ, కార్మిక, శ్రామిక వర్గాలపట్ల అంతులేని ప్రేమతో, బాధ్యతతో, నడుస్తున్న వర్తమాన చరిత్రను నవలలు, కథలుగా నిబద్ధతతో సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు.

ప్రస్తుతం పి. చంద్ తెలంగాణ రచయితల వేదిక – వరంగల్ జిల్లా అధ్యక్షులుగా వున్నారు.

రచనలు[మార్చు]

  1. శేషగిరి
  2. అంతర్జాతీయ శ్రామిక యోధుడు కె.ఎల్.మహేంద్ర,
  3. శ్రామిక యోధుడు
  4. ఒక కన్నీరు
  5. హక్కుల యోధుడు.. బాల గోపాల్
  6. నెత్తుటి ధార
  7. విప్లవాగ్ని
  8. తెలంగాణా
  9. స్ట్రయిక్
  10. భూదేవి
  11. బొగ్గులు
  12. గుమ్మన్ ఎగ్లాస్‌పూర్ గ్రామస్థుడు (పుస్తకం) -కథల సంపుటి

పురస్కారాలు[మార్చు]

తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం (2016)