పి.వి.ఆర్.కె ప్రసాద్
పి. వి. ఆర్. కె ప్రసాద్ ఒక మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అధికారి. ఈయన ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. సాహిత్యాభిమాని. ఆధ్యాత్మిక, ధార్మికవేత్త. సాహితీవేత్తలను, కళాకారులను ఎంతో ప్రోత్సహించాడు. తన ఉద్యోగప్రస్థానంలో సంభవించిన, తారసపడిన అనుభవాలను పుస్తకరూపంలో అందించాడు. తిరుపతి తిరుమల దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా ఈయన అందించిన సేవలకు రాష్ట్రరత్న, శ్రీ కృష్ణ అనుగ్రహ, రాజర్షి వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు
పదవులు
[మార్చు]ప్రసాద్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో వివిధ పదవులు నిర్వహించాడు. ఈయన నిర్వహించిన కొన్ని పదవులు:[1]
- సబ్ కలెక్టర్ - భువనగిరి (1969-1970)
- చిన్న,సన్నకారురైతుల ప్రాజెక్ట్ డైరెక్టర్,నల్లగొండ (1970-1971)
- ముఖ్యమంత్రి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ (1971-1972)
- జిల్లాకలెక్టర్, ఖమ్మం (1974-1977)
- రాష్ట్ర నీటిపారుదలసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (1977-1978)
- ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ : తిరుమల తిరుపతి దేవస్థానములు (1978-1982)
- కమీషనర్, సాంస్కృతిక శాఖ (1984-1985)
- కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ (1985)
- కమీషనర్, ఎక్సైజ్ శాఖ (1986-88)
- ఛైర్మన్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు (1988-1992)
- భారత ప్రధానమంత్రి మీడియా సలహాదారు, ప్రధానమంత్రి కార్యాలయ కార్యదర్శి (1992-1996)
- ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ (1996)
- డైరెక్టర్ జనరల్, మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృధ్ది సంస్థ (1997-2004)
- ఛైర్మన్: హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ (2015-2017)
- గౌరవసలహాదారు,తిరుమల,తిరపతి దేవస్థానాలు (2004-2017)
మరణం
[మార్చు]ఆయనకి గుండెపోటు రావడంతో హైదరాబాదు బంజారా హిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2017, ఆగస్టు 21, సోమవారం తెల్లవారు జామున మరణించారు[2].
రచనలు
[మార్చు]- తిరుమల లీలామృతం
- తిరుమల చరితామృతం[3]
- సర్వసంభవామ్ (నాహం కర్తాః హరిః కర్తాః)
- అసలేం జరిగిందంటే...
- When I Saw Tirupati Balaji[4]
- Wheels Behind The Veil
మూలాలు
[మార్చు]- ↑ జి, వల్లీశ్వర్ (22 August 2017). "నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం". సాక్షి దినపత్రిక. Archived from the original on 22 ఆగస్టు 2017. Retrieved 22 August 2017.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్‌కే ప్రసాద్ ఇకలేరు
- ↑ పుస్తక సమీక్ష[permanent dead link]
- ↑ గూగుల్ బుక్స్‌లో When I Saw Tirupati Balaji