పెండ్యాల రాఘవరావు

వికీపీడియా నుండి
పెండ్యాల రాఘవరావు
పార్లమెంటు సభ్యుడు
Constituency వరంగల్
Personal details
Born 1917
చిన్నపెండ్యాల, వరంగల్ జిల్లా
Political party Peoples Democratic Front (Hyderabad)
Spouse(s) వెంకటమ్మ
Children 2 కుమారులు
Religion హిందూమతం
Website [2]

పెండ్యాల రాఘవరావు (Pendyala Raghava Rao) లోక్‌సభ సభ్యుడు. ఇతడు 1952 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంటుకు భారతీయ కమ్యూనిష్టు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.[1]

ఇతడు శ్రీ పెండ్యాల రామచంద్రరావు గారి కుమారుడు. ఇతడు వరంగల్ జిల్లాలోని చిన్నపెండ్యాల గ్రామంలో 1917 సంవత్సరంలో జన్మించాడు. వరంగల్ ఉన్నత పాఠశాలలో చదువుకొని 1934లో వెంకటమ్మను వివాహం చేస్తుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.

ఇతడు Conversion Movement (1935-36) ను వ్యతిరేకించి; 1938లో కాంగ్రెసు సత్యాగ్రహంలో చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వం అందులకు రూ. 300 జరిమానాను విధించి ఖైదు చేసింది. తర్వాత ఆంధ్ర మహాసభలో చేరాడు. ఇతడు రజాకర్ల ఉద్యమాన్ని వ్యతిరేకించి Peoples Democratic Front సభ్యునిగా చేరాడు. 1952లో 1వ లోకసభ కు హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.

మూలాలు [మార్చు]