ఫైర్‌ఫాక్స్ ఓయస్

వికీపీడియా నుండి
(ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం
Mozilla Firefox 3.5 logo 256.png
FirefoxOS Screenshot Development Build.jpg
ఫైర్‍ఫాక్స్ అభివృద్ధి దశ నివ్య యొక్క తెరపట్టు
వెబ్‌సైట్ http://www.mozilla.org/firefoxos/
అభివృద్ధిచేసినవారు మొజిల్లా కార్పోరేషన్
మెదటి విడుదల ఏప్రిల్ 23, 2013 (2013-04-23)
సరికొత్త విడుదల 1.3.0 /
సహకార వేదికలు ARM, x86
కెర్నల్ మోనోలిథిక్ (లినక్స్ కెర్నల్)
వాడుకరి అంతరవర్తి గ్రాఫికల్
లైసెన్సు మొజిల్లా పబ్లిక్ లైసెన్స్
ప్రస్తుత స్థితి అభివృద్ధి దశలో ఉంది

ఫైర్‍ఫాక్స్ నివ్య(ప్రకరణం పేరు : బూట్ టు గెక్కో/బీటుజీ) లినక్స్ ఆధారిత నిర్వహణా వ్యవస్థ(నివ్య). ఇది మొజిల్లా సంస్థ ద్వారా రూపొందించబడింది. ఇది ముఖ్యంగా స్మార్ట్‍ఫోన్‍లూ, ట్యాబ్లెట్ కంప్యూటర్ల కోసం రూపొందించబడింది. ఏదయినా పరికరం యొక్క మూలవ్యవస్థను జావాస్క్రిప్టు ద్వారా అందుకునే విధంగా ఈ నివ్యను రూపొందించారు. ఔత్సాహికులు హెచ్‍టీఎమ్‍ఎల్5 వాడి రూపొందించిన అనువర్తనాలు ఈ నివ్యలో ఒక ముఖ్యమయిన ఆకర్షణ.

Firefox OS నిర్మాణం రేఖాచిత్రం