లినక్స్ కెర్నల్

వికీపీడియా నుండి


లినక్స్ కెర్నల్
Tux
Linux 3.0.0 boot.png
లినక్స్ కెర్నల్ 3.0.0 ప్రారంభం
వెబ్‌సైట్ www.kernel.org
అభివృద్ధిచేసినవారు లినక్స్ టోర్వాల్డ్స్ మరియు వేలాది సహాయకారులు
OS కుటుంబం Unix-like
మెదటి విడుదల 1991
భాషల లభ్యత English
లైసెన్సు GNU General Public License version 2 (only)

ప్రతి ఆపరేటింగ్ సిస్టంని మూడు భాగాలుగా విభజించ వచ్చు. అవి కెర్నెల్, షెల్ మరియు అప్లికేషన్లు గా చెప్పవచ్చు. వీటిలో అతి ముఖ్యమైనది కెర్నెల్. ఇది సరాసరి హార్డువేరు పరికరాలతో సంభాషిస్తుంది. షెల్ మరియు ఇతర అప్లికేషన్ల ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రాసెసర్, మెమొరీ, హార్ద్ డిస్క్ మరియు ఇతర హార్డువేరు పరికరాలతో పని చేయిస్తుంది. మరియు వచ్చిన ఫలితాలను షెల్ మరియు ఇతర సాఫ్టువేరు గమనాలకు(processes) అందిస్తుంది.


మొదట కంప్యూటరు ప్రారంభించినపుడు బూట్ గమనం కెర్నెల్ ను పర్యవేక్షక పాత్రలో మెమొరీ లోకి నింపుతుంది. తర్వాత కెర్నెలు తనంత తానే నడుస్తూ కంప్యూటర్ కి సంబంధించిన ఇతర సర్వీసులను ఒకటొకటిగా ప్రారంభిస్తుంది. ఆతర్వాత అది తెర వెనుక పాత్రకు పరిమితమౌతుంది. ఇతర అప్లికేషన్లు తట్టి అడిగినపుడు మాత్రమే అది తగిన కోరికలు తీరుస్తుంది.
కెర్నెలు ముఖ్యముగా మూడు భూమికలు నిర్వహిస్తుంది. అవి, గమనాల నిర్వహణ(Process Management), గుర్తు నిర్వహణ(Memory Management) మరియు పరికరాల నిర్వహణ(Device Management). అధిక సమాచారం కోశం ఈ మార్గము లో చూడండి