బృందావనం (మైసూరు)
వికీపీడియా నుండి
భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన క్రిష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బృందావన్ గార్డెన్స్ అను ఒక ఉద్యానవం కలదు. 1927 సంవత్సరమున ఈ ఉద్యానవనం పనులను ప్రారంభించి 1932 సంవత్సరము నాటికి పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను కూడా సందర్శిస్తుంటారు.
విషయ సూచిక |
ప్రవేశం [మార్చు]
ఈ బృందావన్ గార్డెన్స్ లోకి ప్రవేశించడానికి టిక్కెట్ కొనవలసి ఉంటుంది.
మ్యూజికల్ ఫౌంటెయిన్ [మార్చు]
ఈ బృందావన్ గార్డెన్స్ లో సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది.