బెనజీర్ భుట్టో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెనజీర్ భుట్టో
بينظير ڀُٽو
బెనజీర్ భుట్టో
11వ, 13వ పాకిస్తాన్ ప్రధాన మంత్రి
In office
అక్టోబర్ 19, 1993 – నవంబర్ 5, 1996
అధ్యక్షుడువాసిమ్ సజ్జద్
ఫరూఖ్ లెఘారీ
అంతకు ముందు వారుమొయినుద్దీన్ అహ్మద్ ఖురేషీ
తరువాత వారుమాలిక్ మిరాజ్ ఖలీద్
In office
2 డిసెంబర్ 1988 – 6 ఆగస్టు 1990
అధ్యక్షుడుగులాం ఇషాక్ ఖాన్
అంతకు ముందు వారుమహమ్మద్ ఖాన్ జునేజో
తరువాత వారుగులాం ముస్తఫా జటాయ్
ప్రతిపక్ష నాయకురాలు
In office
17 ఫిబ్రవరి 1997 – 12 అక్టోబర్ 1999
అంతకు ముందు వారునవాజ్ షరీఫ్
తరువాత వారుఫజల్ ఉల్ రహ్మాన్
In office
6 నవంబర్ 1990 – 18 ఏప్రిల్ 1993
అంతకు ముందు వారుఖాన్ అబ్దుల్ వలీ ఖాన్
తరువాత వారునవాజ్ షరీఫ్
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్ పర్సన్
In office
12 నవంబర్ 1982 – 27 డిసెంబర్ 2007
అంతకు ముందు వారునుస్రత్ భుట్టో
తరువాత వారుఆసిఫ్ ఆలీ జర్దారీ
బిలావల్ భుట్టో జర్దారీ
వ్యక్తిగత వివరాలు
జననం(1953-06-21)1953 జూన్ 21
కరాచీ, సింధ్, పాకిస్తాన్
మరణం2007 డిసెంబరు 27(2007-12-27) (వయసు 54)
రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్
మరణ కారణంహత్య
సమాధి స్థలంభుట్టో కుటుంబ స్మశాన వాటిక, గర్హి ఖుదా బక్ష్, పాకిస్తాన్
రాజకీయ పార్టీపాకిస్తాన్ పీపుల్స్ పార్టీ
జీవిత భాగస్వామిఆసిఫ్ అలీ జర్దారీ (1987–2007)
బంధువులుభుట్టో కుటుంబం (జన్మత:)
జర్దారీ కుటుంబం (వివాహం తర్వాత)
సంతానంబిలావల్, భక్తవర్, ఆసీఫా
తల్లిదండ్రులుజుల్ఫీకర్ ఆలీ భుట్టో (తండ్రి)
నుస్రత్ భుట్టో (తల్లి)
కళాశాలహార్వర్డ్ విశ్వవిద్యాలయం
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
సంతకం

బెనజీర్ భుట్టో (సింధీ: بينظير ڀُٽو; 1953 జూన్ 21 – 2007 డిసెంబరు 27) పాకిస్తాన్ 11వ ప్రధానమంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు. ఒక ముస్లిం సంఖ్యాధిక్య దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళ, అలాంటి దేశానికి రెండు మార్లు ప్రధాని అయిన ఏకైక మహిళ.[1][2]

ఆమె 1970ల్లో పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసిన జుల్ఫీకర్ అలీ భుట్టో కుమార్తె. బెనజీర్ హార్వర్డ్ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు, ఆక్స్ ఫర్డ్ యూనియన్ కు నాయకత్వం వహించిన తొలి ఆసియన్ మహిళగా నిలిచారు.[3] ఆమె తండ్రి ప్రభుత్వాన్ని కూలదోసిన 1977 నాటి సైనిక తిరుగుబాటు తర్వాత కుటుంబ సభ్యులతో సహా బెనజీర్ పలుమార్లు గృహనిర్బంధంలో జీవించాల్సి వచ్చింది. 1979లో ఆమె తండ్రిని ఉరితీశాకా బెనజీర్, తన తల్లి నుస్రత్ తో కలిసి గృహనిర్బంధంలో నుంచే ప్రజాస్వామ్యాన్ని పున: స్థాపించేందుకు ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1984లో బెనజీర్ కుటుంబంతో పాటుగా లండన్ ప్రవాసం వెళ్ళి 1988 వరకూ అక్కడే జీవించారు. తిరిగి వచ్చాకా బెనజీర్ పీపుల్స్ పార్టీని 1988 పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించారు.[4]

జాతీయ శాసనసభలో అనుకూల పక్షాల మద్దతుతో 1988 డిసెంబరులో ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు.[5] ఐతే రాజకీయ, ఆర్థిక అస్థిరత్వంతో బెనజీర్ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆశ్రిత పక్షపాతం, అవినీతి కారణాలుగా చూపిస్తూ అప్పటి అధ్యక్షుడు 1990 ఆగస్టు 7న ఆమె ప్రభుత్వాన్ని రద్దుచేశారు.[6] బెనజీర్ 1990 ఎన్నికల్లో తిరిగి తన పార్టీకి నాయకత్వం వహించారు, కానీ పార్టీ ఓటమి చెందింది. 2012లో పాకిస్తాన్ సుప్రీం కోర్టు 1990 ఎన్నికల్లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్ఐ) ఛాందసవాద ఇస్లామీ జమ్హూరీ ఇత్తేహాద్ (ఐజెఐ) గెలుపొందాలని పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసినట్టు తీర్పు చెప్పింది.[7] ఎన్నికల్లో జరిగిన అవినీతి వల్ల వంచింపబడ్డా బెనజీర్ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించారు[8]

బెనజీర్ భుట్టో తన పార్టీని 1993 పార్లమెంటరీ ఎన్నికల్లో విజయవంతంగా నడిపించి, మరోమారు ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిగా ఆమె రెండవ దఫా ఎన్నో వివాదాలకు బీజమైంది. వాటిలో ఆమె సోదరుడు ముర్తజాను కరాచీలో పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం కూడా ఒకటి. ఆమె భర్త, క్యాబినెట్ సభ్యుడు ఆసిఫ్ అలీ జర్దారీని హంతకునిగా నేరారోపణ చేసినా, తర్వాత ఆరోపణల నుంచి విముక్తి పొందారు. ఆమె ప్రభుత్వం 1995 నాటి సైనిక తిరుగుబాటును తట్టుకుని నిలబడినా ఆమె, ఆమె భర్త డసాల్ట్ సంస్థతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, తద్వారా తిరిగి అవినీతి కారణంగా చూపి ఆమె ప్రభుత్వాన్ని అధ్యక్షుడు రద్దుచేయడం జరిగింది. ఆమె భర్త ఎనిమిదేళ్ళు జైలు శిక్ష అనుభవించగా, ఆమె 1997 ఎన్నికల్లో తిరిగి పార్టీ నాయకత్వం వహించి, ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.[9][10]

1998లో బెనజీర్ దుబాయ్ లోని ఎమిరేట్స్ హిల్స్ కు తనంతట తానే ప్రవాసం వెళ్ళి, అక్కడ నుంచి పార్టీని బినామీల ద్వారా నడిపించారు. అవినీతి దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఆమె ప్రతిష్ఠ మసకబారింది, 1998లో న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తు నివేదిక ప్రకారం ఆమె, తన కుటుంబం కలిపి వంద మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను విదేశాల్లో కొన్నారు, వీటిలో ఇంగ్లాండుకు చెందిన సర్రేలోని 350 ఎకరాల రాక్ వుడ్ ఎస్టేట్ జనంలో చాలా ప్రాచుర్యం పొందింది.[11][12] ఆగస్టు 2003లో ఒక స్విస్ కోర్టు బెనజీర్, జర్దారీలను రెండు స్విస్ కంపెనీల కాంట్రాక్టు విషయంలో దోషులుగా తేల్చింది.[13]

ఒక వివాదాస్పదమైన ఒప్పందంలో భాగంగా అవినీతి ఆరోపణల నుంచి విముక్తి లభించాకా ఆమె 2007 అక్టోబరు 18 తేదీన పాకిస్తాన్ తిరిగి వచ్చారు.[14][15] 2007 అక్టోబరు 19లో బెనజీర్ కరాచీ తిరిగి వచ్చినప్పుడు ఆమె ప్రచార బస్సుపై దాడి జరిగింది, ఈ దాడిలో పదుల సంఖ్యలో ఆమె మద్దతుదారులు మరణించగా బెనజీర్ సురక్షితంగా బయటపడ్డారు.[16] తర్వాతి సంవత్సరం రావల్పిండిలో ప్రచారం ముగించుకుని వెళ్తూండగా అదే తరహా దాడిలో మరణించారు. ఆమె భౌతిక కాయాన్ని గ్రామీణ సింధ్ లోని భుట్టో కుటుంబ సమాధి ప్రాంతంలో ఖననం చేశారు.[17]

బెనజీర్ ప్రాచుర్యంలో రెండు పరస్పర భిన్న ధ్రువాలైన రెండు కోణాలు ఉన్నాయి: ఆమె కెరీర్ ని ముస్లిం ప్రపంచంలో మహిళల ఘన విజయంగానూ, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం అతివాద, ఉగ్రవాదాలపై పోరాటంగానూ చూస్తూంటారు. అదే సమయంలో అవినీతి, దుష్పరిపాలనలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఆమె మృతి తర్వాత ఆమె భర్త ఆసిఫ్ అలీ, కుమారుడు బిలావల్ ల నాయకత్వంలో పీపుల్స్ పార్టీ విజయం సాధిచింది, ఆసిఫ్ అలీ 2008లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యారు.[18] గార్డియన్ పత్రిక బెనజీర్ ను పాకిస్తాన్లోని తీవ్ర అనిశ్చితికి బాధితురాలిగానూ, కారకురాలైన నేరస్థురాలిగానూ అభివర్ణించింది.[19] న్యూయార్క్ టైమ్స్ ఆమె మరణం సందర్భంగా రాసిన వార్తలో గొప్ప ఆశయాల కలిగి, సంక్లిష్టమైన రాజకీయ యుక్తులు, తంత్రాల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగిన మహిళగా అభివర్ణించారు.[20] పలు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు బెనజీర్ పేరు పెట్టారు, ఆమె కెరీర్ మలాలా యూసఫ్‌జాయ్ వంటి అనేక సాంఘిక కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చారు.[21][22] డాటర్ ఆఫ్ ఈస్ట్, రీకన్సిలేషన్ అన్న రెండు పుస్తకాలు రచించారు.[23]

ఫుట్‌నోట్స్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Benazir Bhutto, the Muslim World's First Female Leader". Retrieved 2016-09-12.
  2. G., Dalia (9 June 2015). "Meet The Nine Muslim Women Who Have Ruled Nations". Egyptian Streets. Retrieved 27 December 2015.
  3. "Before Politics – 5 Wonderful Facts About Benazir Bhutto's Childhood | ARY ZAUQ Official, Recipes, Dramas, Live Streaming, Entertainment, Cooking Shows, Zauq Books, Chefs". Archived from the original on 2016-11-14. Retrieved 2017-01-22.
  4. Paracha, Nadeem F. (2015-09-24). "The 1983 MRD Movement: The flasher's version".
  5. Nasir, Abbas (2013-04-11). "Benazir's first victory".
  6. Times, Barbara Crossette, Special To The New York (1990-08-07). "Bhutto Is Dismissed in Pakistan After 20 Months". The New York Times. ISSN 0362-4331.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  7. Dawn.com (2012-10-19). "1990 election was rigged, rules SC".
  8. "Benazir Bhutto: Courageous Pakistani opposition leader who had twice" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2007-12-28.
  9. "ISLAMABAD: C'wealth apprised of Asif's 'illegal' detention". 2003-11-09.
  10. Yusuf, Huma (28 December 2007). "Coming of age in the Benazir Bhutto era". The Boston Globe. Retrieved 18 November 2011.
  11. "Inside Benazir Bhutto's £10 million country retreat". Telegraph.co.uk.
  12. Burns, John F. (1998-01-09). "HOUSE OF GRAFT: Tracing the Bhutto Millions -- A special report.; Bhutto Clan Leaves Trail of Corruption". The New York Times. ISSN 0362-4331.
  13. Whitaker, Brian (2003-08-07). "Diamond necklace exposed Bhutto money-laundering trail". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077.
  14. "Benazir Bhutto is Back in Pakistan; from google (benazir bhutto arrive pakistan 18 october 2007) result 7".
  15. Perlez, Jane (2009-12-16). "Pakistan Strikes Down Amnesty for Politicians". The New York Times. ISSN 0362-4331.
  16. Gall, Carlotta; Masood, Salman (2007-10-20). "After Bombing, Bhutto Assails Officials' Ties". The New York Times. ISSN 0362-4331.
  17. Moini, Qasim A. (2013-12-27). "The Garhi Khuda Bakhsh mystique".
  18. "Leading article: Benazir Bhutto's divisive legacy to Pakistan" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2008-12-27.
  19. Burke, Jason (2007-12-27). "Benazir Bhutto". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077.
  20. Perlez, Jane; Burnett, Victoria (2007-12-28). "Benazir Bhutto, 54, Lived in Eye of Pakistan Storm". The New York Times. ISSN 0362-4331.
  21. Reporter, The Newspaper's Staff (2014-03-21). "New airport not to be named after Benazir Bhutto".
  22. "Following in Benazir's footsteps, Malala aspires to become PM of Pakistan - The Express Tribune" (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-12-10.
  23. Zakaria, Fareed (2008-04-06). "Reconciliation - Benazir Bhutto - Book Review". The New York Times. ISSN 0362-4331.