భారత ప్రభుత్వము
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
కేంద్ర ప్రభుత్వము |
|
|
|
ఇతర దేశాలు |
భారత ప్రభుత్వము (హిందీ: भारत सरकार) సాధారణంగా కేంద్ర ప్రభుత్వము అని వ్యవహరింపబడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడింది. దేశంలో గల 28 రాష్ట్రాలు, మరియు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది భారత రాజధానియైన ఢిల్లీ లో కేంద్రీకృతమై ఉంటుంది.
భారత ప్రభుత్వ యంత్రాంగం మూడు స్వతంత్ర విభాగాలుగా ఏర్పడి ఉన్నది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ . కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతి ఆద్వర్యంలో నడుస్తుంది. శాసన వ్యవస్థ (పార్లమెంటు) ఎగువసభ గా పిలిచే రాజ్యసభను, దిగువసభగా పిలిచే లోక్‌సభను, రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. న్యాయ వ్యవస్థ శీర్షమున అత్యున్నత న్యాయస్థానమును (సుప్రీమ్ కోర్టు), 21 ఉన్నత న్యాయస్థానాలనూ (హై కోర్టు), ఇంకా జిల్లా స్థాయిలో పౌర (సివిల్), నేర (క్రిమినల్), కుటుంబ(ఫామిలీ) న్యాయస్థానములను కలిగి ఉంటుంది. భారత పౌరులకు దిశా నిర్దేశము చేయు పౌర విధాన స్మృతి, భారతీయ శిక్షా స్మృతి, నేర విధాన స్మృతి వంటి సాధారణ న్యాయ సూత్రాలను కేంద్ర శాసన వ్యవస్థ రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వము వలెనే ప్రతీ రాష్ట్ర ప్రభుత్వమూ కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లను కలిగి ఉంటుంది. కేంద్రానికి, రాష్ట్రాలకి వర్తించు న్యాయ వ్యవస్థ ఇంగ్లీష్ కామన్ మరియు స్టాట్యుటరీ లా ఆధారంగా తయారు చెయ్యబడినది. భారత దేశము కొన్ని సౌలభ్యములతో అంతర్జాతీయ న్యాయ స్థానము ( ఇంటర్‌నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ) ను అంగీకరిస్తోంది. ప్రాంతీయ పరిపాలన కొరకు, అధికార వికేంద్రీకరణకు ఉపకరంచిన పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజ్యాంగములోని 73వ మరియు 74వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది.
విషయ సూచిక |
వ్యక్తిత్వ భాద్యతలు [మార్చు]
భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థ విధానాలు యునైటేడ్ కింగ్‌డమ్ (వెస్ట్ మినిస్టర్ సిస్టమ్) ను పోలి ఉంటుంది.