భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్
స్థానం
,
భారతదేశం
సమాచారం
స్థాపన24 జూన్ 2020
బోధనా సిబ్బంది5

భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, నీలంతోగు గిరిజన గ్రామంలో ఏర్పాటు చేసిన పాఠశాల.[1][2]

పాఠశాల ఏర్పాటు[మార్చు]

కరోనా 2020 లాక్‌డౌన్‌ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లా విద్యార్థి సంతోష్‌ ఇస్రం తన సొంత ఊరు తాడ్వాయి మండలం, నార్లపూర్ వెళ్ళాడు. ములుగు జిల్లా అడవుల్లోని మారుమూల గ్రామం 'నీలంతోగు'కి కొన్నినిత్యావ‌స‌రాలు పంచడానికి తన మిత్రులు వీరెల్లి షెషీందర్ రెడ్డి, నరేష్ దూడపాక, గున్మంతరావుతో కలిసి వెళ్లాడు. అక్క‌డికి వెళ్లిన వారికీ అక్కడ ఉన్న పిల్లలకు అస‌లు స్కూల్, చదువ‌లు అనే వాటి గురించి తెలియవని గుర్తించారు.[3]

సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వీరెల్లి షెషీందర్ రెడ్డి,నరేష్ దూడపాక, గున్మంతరావులు లాక్‌డౌన్‌ సమయంలో వారానికోసారి నీలంతోగు వెళ్లి, రోజంతా వాళ్లతోనే ఉండి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. నార్లపూర్ నుంచి రోడ్లు కూడా సరిగా లేని మారుమూల నీలంతోగుకు 16 కిలోమీటర్లు, అందులో 11 కిలోమీటర్లు వాహనాలపై వెళ్లి అక్కడి నుండి 5 కిలోమీటర్లు పూర్తిగా కాలినడకనే వెళ్లేవారు. నీలంతోగు వెళ్లిన ప్రతిసారి పిల్లల కోసం గుడ్లు తీసుకెళ్లేవాళ్లు. అలా పిల్లలతో సమయం గడిపి వాళ్లతో ఆడి, పాడి, చదువు గురించి చెప్పి అవగాహనా కల్పించాడు. అలా పిల్లల్లో కొంత మార్పు వచ్చాక, ఊరి వాళ్లకు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి చెప్పారు.లాక్‌డౌన్‌ సమయంలో స్నేహితులతో క‌లిసి గిరిజన పిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించి భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్‌గా పేరు పెట్టారు.[4]సంతోష్ సమయమున్నపుడల్లా తన మిత్రులతో కలిసి అక్కడకు వెళ్లి, వాళ్లకు అవసరమైన సామగ్రిని సమకూరుస్తున్నారు.[5]ఈ పాఠశాలకు సంబంధించి విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నతెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంతోష్ మిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందించడంతో భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు మరింత ప్రాచుర్యం దక్కింది. భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను దాతల సహాయంతో బండ్ల పహాడ్, సారలమ్మ గుంపు, ముసలమ్మ పెంట, తక్కెళ్లగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేశారు.[6]

మూలాలు[మార్చు]

  1. The News Minute (1 July 2020). "How three friends started a school for tribal kids in Telangana during the lockdown" (in ఇంగ్లీష్). Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  2. Namasthe Telangana (9 July 2021). "అడ‌వి బిడ్డ‌ల జీవితాల్లో అక్ష‌ర కాంతులు". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  3. TV9 Telugu (15 July 2020). "ఆ గిరిజ‌న గ్రామంలో పిల్ల‌లు మొద‌టిసారి పాఠ‌శాల‌ను చూశారు." Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. V6 Velugu (6 July 2020). "ఈ స్కూల్కు ఎప్పడైన పోవచ్చు!" (in ఇంగ్లీష్). Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Hindu (2 July 2020). "Youth brings education to tribal hamlet" (in Indian English). Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  6. Sakshi (21 March 2022). "అడవిని చేరిన అక్షరం". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.