భూక్యా జాన్సన్ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూక్యా జాన్సన్‌ నాయక్‌
నియోజకవర్గం ఖానాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1976-06-06) 1976 జూన్ 6 (వయసు 47)
తిమ్మాపూర్‌ తండా, ఇబ్రహీంపట్నం మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు భుక్యా శామ్యూల్‌ నాయక్‌, కేస్లిబాయి
జీవిత భాగస్వామి భూక్యా జయలక్ష్మీబాయి
నివాసం హైదరాబాద్‌, తెలంగాణ భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.[2]

2023లో జరిగిన ఎన్నికల ప్రచారంలో

జననం, విద్యాభాస్యం[మార్చు]

భూక్యా జాన్సన్ నాయక్ తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా,ఇబ్రహీంపట్నం మండలం, తిమ్మాపూర్‌ తండాలో జన్మించాడు. ఆయన నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ ఆ తర్వాత ఉస్మానియా యునివర్సిటీ నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమో పూర్తి చేసి కొంత కాలం పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.

రాజకీయ జీవితం[మార్చు]

భూక్యా జాన్సన్ నాయక్ స్వదేశానికి తిరిగి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్‌ను మార్చి పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించింది.[3][4] ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు చేతిలో 4289 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (6 November 2023). "భూక్యా జాన్సన్‌ నాయక్‌". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  3. Eenadu. "మూడు చోట్ల మార్పు.. కారు టికెట్ల కూర్పు". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
  4. Sakshi (22 August 2023). "ఖానాపూర్‌ నియోజకవర్గం". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.