మంగళయాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మంగళయాన్
Mars Orbiter Mission - India
Mars Orbiter Mission - India - ArtistsConcept.jpg
Artist's Conception
మిషన్ రకం మార్స్ ఆర్బిటర్
నిర్వహించే సంస్థ ఇస్రో
వెబ్ సైటు MOM
మిషన్ కాలము 300 days
Spacecraft properties
తయారీదారుడు ఇస్రో
ప్రారంభ ద్రవ్యరాశి 1,350 kg (2,980 lb)[1]
పొడిగా ఉన్నప్పుడు ద్రవ్యరాశి 500 kg (1,100 lb)
పే లోడ్ ద్రవ్యరాశి 15 kg (33 lb)
శక్తి సౌర ఘటకాలు
Start of mission
Launch date 5 November 2013 09:08 (2013-11-05UTC09:08Z) UTC[2]
రాకెట్ PSLV-XL C25[1]
Launch site Satish Dhawan FLP
Contractor ఇస్రో
Orbital parameters
Reference system Areocentric
Periareon 377 km (234 mi)
Apoareon 80,000 km (50,000 mi)
Inclination 17.864 degrees [3]
Epoch Planned
అంగారకుడు orbiter
Orbital insertion 24 సెప్టెంబరు 2014

అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ మంగళయాన్. 2013 నవంబర్ 5, మంగళవారం శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి దీనిని విజయవంతంగా ప్రయోగించారు. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లాంచర్ సాయంతో ‘మంగళ్‌యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంటుంది. చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ అరుణగ్రహంపై జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంతా సవ్యంగా సాగితే అరుణగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటివరకూ ఈ ఘనతను సాధించిన అమెరికా, రష్యా, ఐరోపాల సరసన నిలుస్తుంది.

నేపధ్యము[మార్చు]

4.5 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోలు బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు నౌక నింగికేసి దూసుకెళ్ళింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్ సెంటర్‌లో 32 డీప్‌స్పేస్ నెట్‌వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉంచారు. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను 2013 నవంబరు 3 ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను నవంబరు 4 సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేశారు.


ప్రత్యేకతలు.[మార్చు]

బరువు - 1,337 కిలోలు. ఇందులో ఇంధనం బరువు 860 కిలోలు
తయారీ ఖర్చు - రూ.150 కోట్లు
నియంత్రణ ఖర్చు- రూ.90 కోట్లు
పీఎస్‌ఎల్‌వీ తయారీకి ఖర్చు - రూ.110 కోట్లు
మొత్తం మిషన్‌ ఖర్చు - 450 కోట్లు
సాగించిన ప్రయాణం - 82 కోట్ల కిలోమీటర్లు
అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన నాలుగవ దేశంగా నిలిపింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలిదేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, రష్యాలు ఈ ఘనత సాధించినప్పటికీ తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించిన ఘనత మాత్రం భారత్‌దే.

మంగళయాన్‌ ప్రయోగం లక్ష్యాలు[మార్చు]

అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం.
అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం.
భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవసహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడం.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "12 must-know facts about India's mission to Mars". Economic Times. 11 October 2013. Retrieved 11 October 2013. 
  2. "India to launch Mars Orbiter Mission on November 5". NDTV. 22 అక్టోబరు 2013. Retrieved 19 October 2013. 
  3. Mars Orbiter Mission (MOM) - Manglayaan (15 October 2013)

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"http://te.wikipedia.org/w/index.php?title=మంగళయాన్&oldid=1299776" నుండి వెలికితీశారు