అంగారకుడు
హబుల్ టెలీస్కోపు నుండి 'కుజుఁడు' |
||||||||||
| Orbital characteristics[1] | ||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Epoch J2000 | ||||||||||
| అపహేళి: | 249,209,300 km 1.665861 AU |
|||||||||
| పరీహేళి: | 206,669,000 km 1.381497 AU |
|||||||||
| Semi-major axis: | 227,939,100 km 1.523679 AU |
|||||||||
| Eccentricity: | 0.093315 |
|||||||||
| Orbital period: | 686.971 day 1.8808 Julian years |
|||||||||
| Synodic period: | 779.96 day 2.135 Julian years |
|||||||||
| సగటు orbital speed: | 24.077 km/s | |||||||||
| Inclination: | 1.850° 5.65° to సూర్యుని మధ్యరేఖ (నడిమి గీఁత) |
|||||||||
| Longitude of ascending node: | 49.562° | |||||||||
| Argument of perihelion: | 286.537° | |||||||||
| ఉపగ్రహాలు: | 2 | |||||||||
| Physical characteristics | ||||||||||
| Equatorial radius: | 3,396.2 ± 0.1 km[2][3] 0.533 Earths |
|||||||||
| ధృవాల radius: | 3,376.2 ± 0.1 km[2][3] 0.531 Earths |
|||||||||
| Surface area: | 144,798,500 km² 0.284 Earths |
|||||||||
| ఘనపరిమాణం: | 1.6318×1011 km³ 0.151 Earths |
|||||||||
| భారము: | 6.4185×1023 kg 0.107 Earths |
|||||||||
| సరాసరి సాంద్రత: | 3.934 g/cm³ | |||||||||
| Equatorial surface gravity: | 3.69 m/s² 0.376 g |
|||||||||
| Escape velocity: | 5.027 km/s | |||||||||
| Sidereal rotation period: | 1.025957 day 24.62296 h |
|||||||||
| Rotation velocity at equator: | 868.22 km/h | |||||||||
| అక్షాంశ వాలు: | 25.19° | |||||||||
| Right ascension of North pole: | 21 h 10 min 44 s 317.68143° |
|||||||||
| Declination: | 52.88650° | |||||||||
| Albedo: | 0.15 | |||||||||
| ఉపరితల ఉష్ణోగ్రత: Kelvin సెల్సియస్ |
|
|||||||||
| Apparent magnitude: | +1.8 to -2.91[5] | |||||||||
| Angular size: | 3.5" — 25.1"[5] | |||||||||
| విశేషాలు: | 'కుజుని' | |||||||||
| పర్యావరణం | ||||||||||
| ఉపరితల పీడనం: | 0.7–0.9 kPa | |||||||||
| Composition: | 95.72% కార్బన్ డై ఆక్సైడ్ 2.7% నైట్రోజన్ |
|||||||||
కుజుఁడు (ఆంగ్లం : Mars), దీనికి 'ఎర్ర గ్రహం' (Red Planet) అని కూడా పేరు కలదు. నవగ్రహాలలో ఒక గ్రహం పేరు. ప్రస్తుతం ఎనిమిది గ్రహాలున్నవని అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ప్రకటించింది.
కుజుఁడు యొక్క పుట్టుక గుఱించి హిందూ పురాణాల్లో మూడు కథలు వాడుకలో ఉన్నాయి. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే కుజుఁడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఒకసారి, నేల మీఁద పడ్డ విష్ణువు యొక్క చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుట్టాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు.
ఆ గ్రహమే 'కుజ గ్రహం' అని పద్మ పురాణం చెబుతుంది. దాక్షాయణి దూరమైన ఎడబాటులో ఉన్న శివుడి శరీరం లోంచి రాలిన ఓ చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుడితే, భూదేవి అతన్ని తన సొంత కొడుకుఁగా చేరదీసిందనీ, అతనే కుజుఁడని మరో కథ కూడా నానుడిలో ఉంది.
కుజ గ్రహానికి రెండు సహజసిద్ధ ఉపగ్రహాలు కలవు. అవి ఫోబోస్ మరియు డెయిమోస్, ఇవి చిన్నవిగాను, గుండ్రతనము కొఱవడి అనాకారంగాను వున్నవి.[5]
విషయ సూచిక |
భౌతిక లక్షణాలు [మార్చు]
కుజుఁడు లేదా కుజ గ్రహము, భూమి వ్యాసార్ధం లో సగం, గరిమ పదోవంతు మాత్రమే కలిగిఉన్నాడు. భూమిపై గల భూభాగం కంటే కొద్దిగా తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉన్నాడు[భూమి కడలులని మినహాయించితే మిగిలిన నేల అంత కంటెను కొంచెము తక్కువ కలిగి యున్నాడు]. [5] బుధగ్రహం కంటే ఎక్కువ గరిమ గలిగి వున్నాడు. కుజ గ్రహ ఉపరితలం 'ఎర్ర-నారింజ' రంగులో అగుపించడానికి కారణం దానిపై 'ఐరన్ (III) ఆక్సైడ్, లేదా హెమటైట్ లేదా త్రుప్పు ఉండడమే.[6]
వాతావరణం [మార్చు]
కుజునిపై గల 'మాగ్నెటోస్ఫియర్' నాలుగు బిలియన్ల సంవత్సరాల క్రితమే అంతమైనది, అందులకే, సౌరవాయువు (సోలార్ విండ్), కుజుని అయనో ఆవణం పై నేరుగా తాఁకఁగలిగి దెబ్బ తీయగలుగుతోంది, ప్రభావం చూపుతుంది. ఇందులకు, కుజునిపై గల వాతావరణం, కుజుని వెనుక భాగాన అంతమైనది.[7][8]
చంద్రుళ్ళు [మార్చు]
కుజునికి, రెండు ఉపగ్రహాలు గలవు. అవి ఫోబోస్ మరియు డెయిమోస్. వీటిని ఉపగ్రహాలు అనడం కంటే ఆస్త్రాయిడ్లు అనడం సబబు. వీటికి నిర్దిష్టమైన ఆకారం లేదు. ఈ
గ్రహానికి దగ్గరలో, ఉపగ్రహాలకు కావలసిన కొన్ని లక్షణాలు పుచ్చుకొని పరిభ్రమిస్తున్నాయి.[9]
యాత్రలు [మార్చు]
డజన్ల కొద్దీ ఈ, అంతరిక్ష నౌకలు, ఆర్బిటార్లు, ల్యాండర్లు, మరియు రోవర్లు, కుజునిపై ప్రయోగింపబడ్డాయి. వీటిని సోవియట్ యూనియన్, నాసా, ఇ.ఎస్.ఏ. యూరప్
మరియు జేఎఎక్స్‌ఏ-జపాన్ మున్నగు వారు, కుజుని ఉపరితలం పై వాతావరణం గ్రహగర్భశాస్త్రం (క్రొత్త పదం ఉపయోగించడమైనది, సభ్యులు సరియైన ప్రత్యామ్నాయ పదం ఉపయోగించవలెనని
మనవి.) మొదలగు పరిశోధనల కొరకు ప్రయోగించారు.
జరిగిన కార్యక్రమాలు [మార్చు]
1964 లో నాసా వారు మొదటి సారిగా కుజునిపై విజయవంతంగా మార్టినర్ 4 ను ప్రయోగించారు. కుజుఁడి ఉపరితలంపై మొదటిసారిగా విజయవంతంగా సోవియట్ యూనియన్ వారు
1971 లో తమ మార్స్ 2 మరియు మార్స్ 3 యాత్రలను ప్రయోగించారు. కానీ ఈ రెండు ప్రయోగాలలో, ఉపరితలంపై చేరిన మరుక్షణమే సంబంధాలు తెగిపోయాయి. తరువాత 1975 లో నాసా
వారు వైకింగ్ కార్యక్రమం ప్రారంభించి, వీటిలో గల రెండు ఆర్బిటర్లను సంధించారు. ప్రతిదీ ఒక ల్యాండర్ కలిగివున్నది. ఈ కార్యక్రమం మొదటిసారిగా కుజుని రంగుచిత్రాలు భూమిపైకి పంపగలిగినది.[10] మరియు మ్యాపులను,
ఉపరితల విషయాలను భూమికి పంపింది. మరలా సోవియట్ యూనియన్ తన రెండు ప్రోబ్ లను పంపింది, మొదటిది విజయవంతం కాలేదు. రెండవది విజయవంతమైనది, కుజునికి చెందిన
చిత్రాలను భూమికి పంపింది.
వర్తమాన కార్యక్రమాలు [మార్చు]
2001 లో నాసా, మార్స్ ఒడిస్సీ ను విజయవంతంగా ప్రయోగించింది, ఇది ఇప్పటికీ తన నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతున్నది. దీని నిర్ధారిత సమయం మార్చి 2008 లో ముగిస్తున్నపటికీ దీనిని
సెప్టెంబరు 2008 వరకూ పొడిగించారు. కుజునిపై హైడ్రోజన్ మరియు నీటి ఆనవాళ్ళు కనుగొనడమే దీని పని.[11]
భవిష్యత్తు కార్యక్రమాలు [మార్చు]
కుజునిపై తరువాత కార్యక్రమం, 'డాన్ మిషన్', సెరిస్ పై పరిశోధనా యాత్ర, '4 వెస్తా', మరియు 'ఫినిక్స్ అంతరిక్ష నౌక' యాత్ర. దీనిని ఆగస్టు 4 2007 న
ప్రయోగించారు, ఇది మే-25 2008 న, కుజుని ఉత్తర ధృవం పైకి చేరుకుంటుంది. దీనిలో గల సూక్ష్మ కెమెరాలు, వెంట్రుకవాసి లోని వెయ్యవ వంతు సూక్ష్మమైన వస్తువుల చిత్రాలు
తీయగలవు.[12]
2003 లో అతిదగ్గర రాక [మార్చు]
ఆగస్టు 27, 2003 న, 9:51:13 UT, సమయాన, కుజుఁడు, భూమికి అతిదగ్గరగా వచ్చాడు. ఈ విశేషం ప్రతి 60,000 సంవత్సరాలకోసారి జరుగుతుంది. కుజుఁడు భూమికి అతి దగ్గరగా 55,758,006 కి.మీ. వచ్చాడు. ఈ విశేషం దాదాపు సెప్టెంబరు 12 క్రీ.పూ. 57,617 లో జరిగినది, ఇంకోసారి ఈ ఘటన 2287 లో జరిగే అవకాశం
గలదు.
ప్రపంచ సంస్కృతిలో కుజుఁడు [మార్చు]
చారిత్రాత్మక లంకెలు [మార్చు]
మార్స్ అనే పేరు, అలనాఁటి రోమన్ల మతానికి చెందెడి వారు కొలుఁచుకొనెడి 'పోరాటముల యొక్క దేవత' పేరే . బాబిలోనియా లోని ఖగోళ శాస్త్రంలో 'నెర్గల్' లేదా అగ్నిదేవత, మరియు యుద్ధ, వినాశ దేవత.[13] అరబ్బీ లో 'అల్-మిరీఖ్'
مریخ మరియు టర్కిష్ లో "మెరీహ్". పర్షియన్ లో బహ్రామ్ ఉర్దూ మరియు పర్షియన్ లలో مریخ. ప్రాచీన తురుష్కులు సాకిత్ అని అంటారు.
చైనీయులు, జపనీయులు, కొరియన్లు మరియు వియత్నామీయులు 'అగ్ని తార' 火星, అని సంబోధిస్తారు.
సాక్షి వార్త పత్రిక లో ని వ్యాసం
http://sakshi.kunisetty.com/main/Weeklydetails.aspx?Newsid=21624&Categoryid=5&subcatid=13
మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కాని మనిషి కంటే తెలివైన జీవులు అరుణగ్రహం (అంగారకుడు)లో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. అంగారకుడిపై ఆనాడు కనిపించిన మానవ ముఖ రూపం నుంచి నిన్నా మొన్నటి గాంధీజీ ఆకృతి వరకు... కేవలం చిత్రాలు కావని... ఒకనాటి సంపన్న నాగరికతకు చెందిన సూచన ప్రాయమైన గుర్తులని అంటున్నారు. ఆ కథేమిటో తెలుసుకుందాం...
మన చిన్నప్పటి ఆకాశం పెద్ద కాన్వాస్. ప్రతి మేఘం చేయి తిరిగిన చిత్రకారుడి చిత్రమై మనల్ని గిలిగింతలు పెట్టేది. ‘ఆకాశంలో నేను గుర్రాన్ని చూశాను’ అని ఒకరంటే ‘నేను ఏనుగును చూశాను’ అని ఒకరు అనేవారు. మేఘాల్లో కనిపించే ‘చిత్ర’విచిత్రాలు అంగారక గ్రహంలోనూ ఎప్పటి నుంచో కనిపిస్తున్నాయి. తేడా ఏమిటంటే... మేఘాలు మన ఆనందానికి, ఆశ్చర్యానికి మాత్రమే పరిమితం. కానీ అంగారకగ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటికప్పుడు చర్చను రేకెత్తిస్తోంది.
సరికొత్త ప్రతిపాదనలకు కారణమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఇటలీ అంతరిక్ష సంస్థ అంగారకగ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. ఐరోపా మార్స్ ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో గాంధీజీ రూపం స్పష్టంగా ఉంది! అంగారకుడిపై చిత్రాల సందడి నిన్నటి మొన్నటి విషయం కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది.
1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా )కు చెందిన వైకింగ్-1 స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమి మీదకు పంపింది. ఆ చిత్రాల్లో సైడోనియ అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటి పడింది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగోళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు.
మరికొందరు మాత్రం చాలా ఏళ్ల క్రితమే అంగారకుడిపై తెలివైన నాగరికత వర్థిల్లిందని దాని తాలూకు ఒకానొక ఆనవాలే ‘మానవ ముఖరూపం’ అని చెప్పారు. కొందరైతే రెండు మూడు అడుగులు ముందుకు వేసి ‘అంగారకుడిపై ప్రాచీన నాగరికత తాలూకు అంశాలను దాచి పెట్టే కుట్రను నాసా చేస్తోంది’’ అని ఆరోపించారు.
ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమంటే, వైకింగ్ చిత్రాల కంటే ముందుగానే...1958 సెప్టెంబర్‌లో ‘ది ఫేస్ ఆన్ మార్స్’ పేరుతో కామిక్‌బుక్ వచ్చింది. విలియమ్‌సన్ రాసిన ఈ పుస్తకానికి జాక్ కిర్బె బొమ్మలు గీశాడు. ఈ కథలో అంగారకుడిపై వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్షశాస్త్రవేత్తల బృందానికి అక్కడి కొండల్లో చెక్కిన మానవరూపం కనిపిస్తుంది! హైరిజుల్యుషన్ ఉన్న వైకింగ్ చిత్రాలు అందరికీ అందుబాటులో లేక పోవడంతో ఎవరి ఊహలకు అనుగుణంగా వారు వ్యాఖ్యానించుకునే పరిస్థితి ఏర్పడింది.
కొందరైతే అంగారక గ్రహంపై కనిపించిన మానవ ముఖంపై పుస్తకాలు రాసి హాట్ హాట్‌గా అమ్ముకున్నారు కూడా. ‘అంగారకుడిపై మానవ ముఖం’ అనే అంశం పుణ్యామా అని ఆరోజుల్లో మిగిలిన గ్రహాల కంటే అంగారకుడిపై ఆసక్తి పెరగడానికి కారణమైంది. అంగారకుడిపై హాలివుడ్‌లో సినిమాలు ప్రారంభమయ్యాయి. పత్రికల్లో, రేడియోల్లో వేడి వేడి చర్చ మొదలైంది.
‘స్పష్టాస్పష్టంగా కనిపించే రూపాలను ఆధారంగా చేసుకుని ఊహలు అల్లడం అనైతికం’ అని హేతువాదులు వేడివేడిగా వాదనకు దిగే రోజుల్లో ఒక చిత్రం జరిగింది. ‘అంగారకుడిపై ఏదో ఉంది’ అని వాదించేవాళ్లకు అదొక అదృష్టంగా పరిణమించింది. 1998లో నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ స్పేస్‌క్రాఫ్ట్ అతి దగ్లర్లో నుంచి తీసిన అంగారకుడి చిత్రాలను భూమి మీదికి పంపింది. వైకింగ్ చిత్రాల కంటే ఇవి ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయి. మానవ ముఖరూపం, కళ్లు, పెదాలు, ముక్కు... కొంత స్పష్టంగా గుర్తించడానికి వీలైంది.
మార్స్ ఆర్బిటర్ కెమెరా (ఎంఒసి) చిత్రించిన చిత్రాల ద్వారా అంగారకుడిపై మరి కొన్ని ఆకారాలను గుర్తించారు. ఒక చోట సీతాకోక చిలుక ఆకారం కనిపించింది. మరోచోట ఒక కొండ నత్త ఆకారం, దాన్నే మరో వైపు నుంచి చూస్తే కుక్క ఆకారం కనిపించింది. నవ్వుతున్న ముఖంతో కూడిన ఆకారం, ప్రేమగుర్తు కూడా ఎంఒసి చిత్రాల్లో కనిపించాయి. కొన్ని చిత్రాలలోని ఆకారాలు అంగారకుడిపై చెట్లు ఉన్నాయనే వాదనను లేవనెత్తాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనను కొట్టిపారేశారు. ‘‘అంగారకుడిపై ఏర్పడిన ధూళిమేఘాలు వివిధరూపాలు ధరించి చెట్ల రూపాన్ని గుర్తుకు తెస్తున్నాయి తప్ప అక్కడ ఎలాంటి చెట్లు లేవు’’ అన్నారు వాళ్లు.
2007లో తీసిన ఒక ఫోటోలో ఒక వ్యక్తి మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్న ఆకారం కనిపించింది. దీని ఆధారంగా ‘అంగాకుడిపై జీవులు ఉన్నాయనే దానికి ఇదొక నిదర్శం’ అని వాదించిన వాళ్లు ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అంగారుకుడిపై మిథేన్ వాయువు ఆనవాళ్లు కనుగొనడంతో అంగారకుడిపై జీవుల గురించి ఆసక్తి మళ్లీ తాజాగా మొదలైంది. అంగారకుడికి సంబంధించిన సమాచారంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ కోలిన్ (బ్రిటన్) ‘అంగారకుడిపై జీవుల ఉనికిని నిర్ధారించడానికి మీథేన్ వాయువు బలమైన నిదర్శనం’ అని చెప్పారు. అంగారకుడిపై వాతావరణం లేని కారణంగా పగటి ఊష్ణోగ్రతకు, రాత్రి ఊష్ణోగ్రతకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫలితంగా అక్కడ జీవులు మనుగడకు అవకాశాలు తక్కువ అని కొందరు శాస్త్రవేత్తలు కోలిన్ నమ్మకాన్ని తోసిపుచ్చారు.
అంగారకుడిపై ఆశ్చర్యం గొలిపే ఆకారాలపై ఆసక్తి ఈనాటిది కాదు. 1784లో బ్రిటీష్ ఆస్ట్రానమర్ సర్ విలియమ్ హర్‌స్కెల్ ‘అంగారకుడిపై చీకటిగా కనిపించే ప్రాంతాలు సముద్రాలు, చీకటి తక్కువగా ఉన్న ప్రాంతాలు భూభాగం’ అని రాశారు. 1895లో పెర్సివల్ లొవెల్ అనే ఆస్ట్రానమర్ ‘మార్స్’ అనే పేరుతో రాసిన పుస్తకంలో అంగారకుడిపై కాలువలు ఉన్న విషయాన్ని రాశాడు. అయితే ఆ తరువాత కాలంలో ఇది అవాస్తవంగా రుజువైంది. తక్కువ నాణ్యత ఉన్న టెలిస్కోప్‌ల కారణంగా ఆనాటి శాస్త్రవేత్తలు అంగారకుడిలోని ఆకారాలను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. దర్పణభ్రమకు గురయ్యారు.
‘‘అంగారక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికప్పుడు మన భూమిని గుర్తుకు తెస్తుంది. ఏదో ఒక రోజు మనం అక్కడికి వెళ్లే వాళ్లమే’’ అన్నారు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్. మన భూమికి పొరుగు గ్రహమైన అంగారకుడితో ఒకప్పుడు మనకు బీరకాయపీచు బంధుత్వం ఉండేది. ఆ తరువాత అది దూరపు బంధుత్వంగా మారింది. ఇప్పుడు మాత్రం అంగారకుడితో మనకు దగ్గరి చుట్టరికం. చుట్టపు చూపుగా రేపో మాపో మనం అక్కడికి వెళ్లొచ్చు. సీతకోక చిలకతో చెలిమి చేయవచ్చు. గాంధీతాతతో మాట్లాడవచ్చు! అక్కడ సుసంపన్నమైన నాగరిత వెలిగి ఉంటే ఆ వెలుగు జాడలు వెదికి చూడవచ్చు. వేచి చూద్దాం! - యాకూబ్ పాషా
ఆర్థర్ సి. క్లార్క్ రాసిన తొలి సైన్స్ ఫిక్షన్ నవల ‘ది సాండ్స్ ఆఫ్ మార్స్’. 1951లో ప్రచురించబడిన ఈ నవల మంచి ఆదరణ పొందింది. మార్టిన్ గిబ్బన్ అనే సుప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత అంగారక యాత్ర చేస్తాడు. అంగారక గ్రహం ప్రధానాధికారిని కలుస్తాడు. ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అంగారకుడిపై కంగారులను పోలిన జీవులను చూస్తాడు. అక్కడ మొక్కలను పెంచుతారనే విషయాన్ని తెలుసుకుంటాడు...ఇలా అంగారకుడికి సంబంధించి చిత్రవిచిత్ర విషయాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. అంగారకుడిపై నీటి కాలువలు ఉన్నాయనే ఊహ ఆధారంగా క్లార్క్ ఈ నవల రచించాడు.
|
||||||||||||||
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు మరియు నోట్స్ [మార్చు]
- ↑ Yeomans, Donald K. (2006-07-13). "HORIZONS System". NASA JPL. Retrieved 2007-08-08. — At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Mars" and "Center: Sun".
- ↑ 2.0 2.1 Seidelmann, P. Kenneth; Archinal, B. A.; A’hearn, M. F.; et.al. (2007). "[http://adsabs.harvard.edu/doi/10.1007/s10569-007-9072-y Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements: 2006]". Celestial Mechanics and Dynamical Astronomy 90: 155–180. DOI:10.1007/s10569-007-9072-y. Retrieved on 2007-08-28.
- ↑ 3.0 3.1 Best fit ellipsoid
- ↑ [http://solarsystem.jpl.nasa.gov/planets/profile.cfm? Object=Mars&Display=Facts&System=Metric "Mars: Facts & Figures"]. NASA. Retrieved 2007-03-06.
- ↑ 5.0 5.1 5.2 5.3 David R. Williams (September 1, 2004). "Mars Fact Sheet". National Space Science Data Center. NASA. Retrieved 2006-06-24.
- ↑ Peplow, Mark. "How Mars got its rust". Retrieved 2007-03-10.
- ↑ Philips, Tony (2001). "The Solar Wind at Mars". Science@NASA. Retrieved 2006-10-08.
- ↑ R. Lundin, S. Barabash, H. Andersson, M. Holmström, A. Grigoriev, M. Yamauchi, J.-A. Sauvaud, A. Fedorov, E. Budnik, J.-J. Thocaven,2 D. Winningham, R. Frahm, J. Scherrer, J. Sharber, K. Asamura, H. Hayakawa, A. Coates, D. R. Linder, C. Curtis, K. C. Hsieh, B. R. Sandel, M. Grande, M. Carter, D. H. Reading, H. Koskinen, E. Kallio, P. Riihela, W. Schmidt, T. Säles, J. Kozyra, N. Krupp, J. Woch, J. Luhmann, S. McKenna-Lawler, R. Cerulli-Irelli, S. Orsini, M. Maggi, A. Mura, A. Milillo, E. Roelof, D. Williams, S. Livi, P. Brandt, P. Wurz, P. Bochsler (2004). "Solar Wind-Induced Atmospheric Erosion at Mars: First Results from ASPERA-3 on Mars Express". Science 305: 1933– 1936. DOI:10.1126/science.1101860. Retrieved on 2007-02-26.
- ↑ [http://sci.esa.int/science- e/www/object/index.cfm?fobjectid=31031 "Close Inspection for Phobos"]. ESA website. Retrieved 2006-06-13.
- ↑ "Other Mars Missions". Journey through the galaxy. Retrieved 2006-06-13.
- ↑ Britt, Robert (March 14, 2003). "Odyssey Spacecraft Generates New Mars Mysteries". Space.com. Retrieved 2006-06-13.
- ↑ "Phoenix: The Search for Water". NASA website. Retrieved 2007-03-03.
- ↑ {{cite web|last = Sheeham|first=William|date=February 2, 1997| url=http://www.uapress.arizona.edu/onlinebks/mars/chap01.htm%7Ctitle= Motions of Mars| work=The Planet Mars:: A History of Observation and Discovery|accessdate=2006-06-13}}
బయటి లింకులు [మార్చు]
- 3D maps of Mars in NASA World Wind
- Google Mars – Interactive image of Mars
- Flight Into Mariner Valley – NASA/JPL/Arizona
State University 3D flythrough of Valles Marineris
- Marsgeo.com – Mars Rover photos, videos & surface geology
- Guide to Mars – information about Mars and how to observe
it.
- Nine Planets Mars page
- [http://history.nasa.gov/SP-4212/on-mars.html On Mars: Exploration of the Red Planet
1958–1978] from the NASA History Office.
- Martian Law – a CATO white paper
- [http://www.maniacworld.com/mars_mariner_valley.htm Computer Simulation of a flyby
through Mariner Valley]
- Mars Unearthed – Comparisons of terrains between Earth
and Mars
- Ralph Aeschliman's Online Atlas of Mars
- Geody Mars – World's search engine that supports
NASA World Wind, Celestia, and other applications.
- Be on Mars – Anaglyphs from the Mars
Rovers (3D)
- NASA/JPL OnMars WMS Server for Mars Data – Work as Google
Earth client overlays
- Exploring Mars: Image Center
- Astronomy Cast: Mars
- [http://news.bbc.co.uk/1/hi/sci/tech/3426539.stm BBC News update on Mars Express'
findings of polar water ice and water-eroded features on the surface]
- [http://news.bbc.co.uk/1/hi/sci/tech/4285119.stm BBC News Mars pictures reveal frozen
sea]
- [http://www.space-nasa.com/02-apr-2007-esa-1.html 04/02/07: ESA Prepares for a Human
Mission to Mars]
relative size] at opposition as seen by HST
- [http://www.psrd.hawaii.edu/Archive/Archive-Mars.html Mars articles in Planetary
Science Research Discoveries]
వనరులు [మార్చు]
తరగతి:సౌరమండలము తరగతి:పురాణ పాత్రలు తరగతి:సౌరకుటుంబం తరగతి:సౌరకుటుంబంలోని గ్రహాలు