ఉర్దూ భాష

వికీపీడియా నుండి
ఉర్దూ
اُردو 
ఉచ్ఛారణ: 'ఉర్దూ'
మాట్లాడే దేశాలు: భారత దేశం, పాకిస్తాన్, యు.ఎ.ఇ., యు.ఎస్.ఎ., యు.కె., కెనడా, ఫిజీ 
ప్రాంతం: దక్షిణ ఆసియా (భారత ఉపఖండం)
మాట్లాడేవారి సంఖ్య: 100–130 మిలియన్ స్థానికులు
250 మిలియన్ మొత్తం 
ర్యాంకు: 19–21 (స్థానికంగా మాట్లాడేవారు), ఇటాలియన్ మరియు టర్కిష్ భాషలతో ఇంచుమించు సమానం
భాషా కుటుంబము:
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   సెంట్రల్ జోన్
    ఉర్దూ 
వ్రాసే పద్ధతి: ఉర్దూ అక్షరమాల (నస్తలీఖ్ లిపి
అధికారిక స్థాయి
అధికార భాష: Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ ;
Flag of భారత దేశం భారత్ (ఆంధ్ర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, జమ్మూ మరియు కాశ్మీర్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్);
Flag of ఫిజీ ఫిజీ (హిందుస్తానీ అంటారు)
నియంత్రణ: జాతీయ భాషా ప్రాధికరణము,
NCPUL, ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ కౌన్సిల్[1]
భాషా సంజ్ఞలు
ISO 639-1: ur
ISO 639-2: urd
ISO 639-3: urd 
Urdu_official-language_areas.png

ఉర్దూ (Urdu ఉచ్ఛారణ ) ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశం లో జన్మించిన భాష. ఈ భాష కు మాతృక లేదు. బహుభాషా సమ్మేళితం. ఖరీబోలి, లష్కరి, రీఖ్తి, హిందుస్తానీ దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బృజ్ భాష (హిందీ), పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ఉత్తర భారత దేశంలోని ముస్లింలు, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని పట్టణ ప్రాంతాలలోని ముస్లింలు, పాకిస్తాన్ లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, తదితర నగరాలు మరియు పట్టణాలలో ముస్లింలు మాత్రమే కాకుండా సింధీలు, సిక్కులు, హిందువులు కూడా ఉర్దూ ఎక్కువగా మట్లాడుతారు.

విషయ సూచిక

చరిత్ర [మార్చు]

13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాష గా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లినది. నాగరిక, సాహిత్య మరియు పద్యరూపాలకు పరిపూర్ణభాషగా పర్షియన్ ఉపయోగంలో వుండేది. మతపరమయిన మరియు ధార్మికపరమయిన భాషగా అరబ్బీ వుండేది. ఢిల్లీసుల్తానుల కాలంలో దాదాపు అందరు సుల్తానులు మరియు అత్యున్నత పదాధికారులందరూ మధ్యాసియా కు చెందిన పర్షియన్-తురుష్కులే. వీరి మాతృభాష చొఘ్తాయి లేదా టర్కిక్ భాష. మొఘలులుకూడా మధ్యాసియాకు చెందిన పర్షియన్ లే. వీరి ప్రథమభాష టర్కీ, తరువాత వీరు పర్షియన్ (పారసీ, ఫారసీ భాష) భాషను తమభాషగా ఉపయోగించసాగారు. మొఘలులకు పూర్వం, పర్షియన్ భాష అధికార భాషగాను సభ్యతా, సాహితీభాషగా పరిగణించబడినది. బాబరు మాతృభాష టర్కీ, టర్కీభాషలోనే బాబరు తన రచనలు చేశాడు. ఇతని కుమారుడు హుమాయూన్ కూడా టర్కీభాషనే అవలంబించాడు. మొఘల్ కాలపు హిందూ-పర్షియన్ చరిత్రకారుడు మొఘల్ పరిపాలనా, అక్బర్ పరిపాలనా కాలంలో పర్షియన్ భాష తన సభ్యతా విశాలధృక్పదాలు మరియు సరళతాకారణాలవల్ల ప్రధాన భాషగా ఆమోదం పొందిన భాష గా వర్ణిస్తాడు. [2] టర్కీ, పర్షియన్, బ్రజ్ భాష, హిందవి, హర్యానవి, హిందీ భాషల సమ్మేళనభాషగా ఉర్దూ జన్మించింది. ఈ భాష దక్షిణాసియాలో ప్రధానంగాను, ప్రపంచమంతటా పాక్షికంగాను వాడుకలోయున్నది. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో మరియు లాహోర్ లలో తనముద్రను ప్రగాఢంగా వేయగల్గింది.

స్వాతంత్రోద్యమంలో ఉర్దూ భాష [మార్చు]

స్వాతంత్య్ర ఉద్యమంలో ఉర్దూ భాష కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, ప్రవాసాంధ్రుల విభాగం మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.ఉర్ధూ భాష మనందరి భాషగా గుర్తించాలన్నారు.ఈనాడు 17.8.2009.

ఉర్దూ అనే పేరు ఎలా వచ్చింది [మార్చు]

జబాన్-ఎ-ఉర్దూ-ఎ-ముఅల్లా అనే పదం ("లష్కరీ భాష") నస్తలీఖ్ లిపిలో వ్రాయబడినది.

రీఖ్తి, లష్కరి (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, షాజహాన్ కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. ఉర్దూ అనే పదానికి మూలం టర్కిష్ పదము ఉర్ద్ లేదా ఓర్ద్, అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని లష్కరీ జబాన్ లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. ఎర్రకోట నిర్మాణసమయంలో దీనిపేరు ఉర్దూ గా స్థిరమయినది. సైనికులమధ్య వ్యావహారిక భాషగా మార్పుచెందుతూ, బజారులలో, వ్యాపారలావాదేవీల వ్యవహారాలలో, సభలలో తుదకు ఆస్థానాల ప్రధాన అధికారిక భాషగా స్థానం పొందింది. నవాబులు ఉర్దూను పోషించారు. రానురాను సాహితీభాషగా పద్యభాగానికి అనువైన భాషగా మార్పుచెందింది. ఉత్తరభారతదేశంలో ప్రధానభాషగా మారింది. రానురాను పర్షియన్ భాష స్థానాన్ని ఆక్రమించింది. పశ్చిమోత్తరభారతదేశంలో ప్రధానభాషగా వుండినది. 1947లో భారతదేశం విడగొట్టబడి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో అధికారభాష ప్రకటనా సమయంలో హిందీ భాషకు సమానంగా ఉర్దూకూ ఓట్లొచ్చాయి, పార్లమెంటులో హిందీ భాష ఆమోదం పొందింది. హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని హిందవి లేదా హిందూస్తానీ భాషగానూ ప్రజామోదం పొందింది.

ఉర్దూ లిపి [మార్చు]

ఉర్దూ లిపి నస్తలీఖ్, అరబ్బీ మరియు పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను(అరబ్బీ భాషలో ప,ట,చ,డ మరియు గ శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ మరియు గ శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు.

మాండలికాలు [మార్చు]

ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో)

ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలు గలవు. అవి

దక్కని కు ఇతర పేర్లు దఖ్ఖని, దేశియా మరియు మిర్గాన్.

ఉర్దూ సాహిత్యం [మార్చు]

ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్ మరియు అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది.

గద్యం

ధార్మికసాహిత్యం

ఇస్లామీయ మరియు షరియా సాహిత్యంలో అరబ్బీ మరియు పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము, మరియు ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు. ఖససుల్ అంబియా, తఫ్ హీముల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్సీరుల్ ఖురాన్, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్ మరియు బహారె షరీయత్ లు ప్రముఖం.

సాహితీ

గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం. దాస్తాన్, అఫ్సానా, నావల్ (నవల), సఫర్ నామా, మజ్ మూన్, సర్ గుజిష్త్, ఇన్ షాయియ, మురాసల, ఖుద్ నవిష్త్.

పద్యం

పద్యం లేదా కవితాసాహిత్యానికి చాలా అనువైనభాషగా ఉర్దూకు పేరుగలదు.

గజల్ ఉర్దూకవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్ కు పేరురాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తిగాదు.

పద్యసాహిత్యంలో కవితలకు ఈవిధంగా వర్గీకరించవచ్చు. నజమ్, గజల్, మస్ నవి, మర్సియా, దోహా, ఖసీదా, హమ్ద్, నాత్, ఖతా, రుబాయి, షెహ్ర్-ఎ-ఆషూబ్.

కవి తనకవితలలో తన కలంపేరు 'తఖల్లుస్' ఉపయోగిస్తాడు.

అరూజ్ లేదా ఛందస్సు

అరూజ్ అనగా కవితా రచనలో తీసుకోవలసిన సాంప్రదాయక విలువలు. కవితలు ఒక క్రమంగా తఖ్తీ ను గలిగి వుంటాయి. ఒక బహర్ (మీటర్) లో ఇమడబడి వుంటుంది. తఖ్తీ మూలాన్ని బహర్ అని, బహర్ లో వుండే శబ్దాలను అర్కాన్ లని అంటారు. అరూజ్ లో ముఖ్యమైన పదాలు అరూజ్, తఖ్తీ, బహర్, జమీన్, అర్కాన్.


షారిఖ్ జమాల్ నాగ్ పూరి అరూజ్ విద్వాంసుడు. ఇతని శిష్యగణం భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణభారతదేశమంతటా గలరు.

వ్యావహారికము [మార్చు]

ఉదాహరణలు [మార్చు]

తెలుగు వాడుక ఉర్దూ లిపిలో తెలుగు లిప్యాంతరీకరణ యధానువాదం (గమనిక)
నమస్కారము السلام علیکم అస్సలామ్ ఒ అలైకుమ్ "మీకు శాంతి కలుగును గాక." ( అరబ్బీ నుండి.)
(ప్రతి) నమస్కారము و علیکم السلام వ అలైకుమ్ అస్సలామ్ "మీకునూ శాంతి కలుగును గాక." (అరబ్బీ నుండి)
నమస్తే (آداب (عرض ہے ఆదాబ్ (అర్జ్ హై) "గౌరవాన్ని ప్రకటించడం" (సెక్యులర్ విధానము)
మంచిది. వెళ్ళి రండి خدا حافظ ఖుదా హాఫిజ్ "అల్లాహ్ మిమ్మల్ని కాపాడు గాక"
అవును ہاں హాఁ అవును (సాధారణ వ్యవహారం)
అవును جی జీ అండీ(గౌరవ సూచకం)
అవునండీ جی ہاں జీ హాఁ అవునండీ(మర్యాదపూర్వంగా)
లేదు نا నా (సాధారణ వ్యవహారం)
లేదండి نہیں، جی نہیں నహీఁ, జీ నహీఁ లేదు (సాధారణ వ్యవహారం);లేదండీ (మర్యాదపూర్వంగా)
దయచేసి, దయవుంచి مہربانی మెహర్బానీ (కర్‌కె) దయ (ఉండి)
ధన్యవాదాలు شکریہ షుక్రియా ధన్యవాదాలు
దయచేయండి, స్వాగతం تشریف لائیے తష్రీఫ్ లాయియే "గౌరవంగా స్వాగతించడం"
దయచేసి కూర్చోండి تشریف رکھیئے తష్రీఫ్ రఖియే "గౌరవంగా కూర్చోబెట్టడం"
మీతోకలసి చాలా సంతోషించాను اپ سے مل کر خوشی ہوئی ఆప్ సే మిల్ కర్ ఖుషీ హుఈ "మీతోకలవడం ఆనందదాయకం"
మీరు ఇంగ్లీషు మాట్లాడగలరా? کیا اپ انگریزی بولتے ہیں؟ క్యా ఆప్ అంగ్రేజీ బోల్ తే హైఁ? "మీకు ఇంగ్లీషు వచ్చా?"
నేను ఉర్దూ మాట్లాడలేను. میں اردو نہیں بولتا/بولتی మైఁ ఉర్దూ నహీఁ బోల్ తా/బోల్ తీ బోల్ తా (పుంలింగము), బోల్ తీ (స్త్రీలింగము)
నా పేరు ... میرا نام ۔۔۔ ہے మేరా నామ్ .... హై
లక్నో ఎక్కడుంది? لکھنئو کہاں ہے؟ లక్నో కహాఁ హై
ఉర్దూ మంచి భాష. اردو اچھی زبان ہے ఉర్దూ అచ్ఛీ జబాన్ హై

ఇవి కూడా చూడండి [మార్చు]

  1. ఉర్దూ సాహిత్యము
  2. ఉర్దూ ప్రముఖులు
  3. ఉర్దూ కవులు
  4. ముషాయిరా (కవిసమ్మేళనం)
  5. ఉర్దూ రచయితలు
  6. ఉర్దూ షాయిరి
  7. ప్రముఖ ఉర్దూ పుస్తకాలు

ఉర్దూ జాతీయాలు [మార్చు]

ఉర్దూ-తెలుగు నిఘంటువు [మార్చు]

  • 1938-మొదటి ఉర్దూ - తెలుగు నిఘంటువు 1938లో వరంగల్ ఉస్మానియా కాలేజిలో అరబిక్ మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.ఇది అలీఫ్ నుండి లామ్ వరకు అహ్మదియా ప్రెస్ కర్నూలులోను మీమ్ నుండి యే వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ప్రింటు చేయబడింది.మొత్తం 857 పేజీల పుస్తకం.
  • 2009-శ్రీ ఎ.బి.కె.ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం 862 పేజీలతో ఈ నిఘంటువును పునర్ముద్రించింది.

ఉర్దూ భాషలోకి అనువదింపబడిన ప్రముఖ గ్రంధాలు [మార్చు]

  • రామాయణం
  • మహాభారతం
  • భగవద్గీత : హిందూముస్లింల పరస్పర అవగాహన కొరకు, అలహాబాద్ కు చెందిన డాక్టర్ అజయ్ మాల్వి సంస్కృతంలోగల భగవద్గీతను ఉర్దూలోకి తర్జుమా చేశాడు, దీనికి "నగ్మయే యజ్దానీ" (నగ్మా=గీతం; యజ్దాన్=భగవంతుడు=>భగవంతుడి గీతం=>భగవద్గీత)ఈనాడు డిసెంబరు 26, 2008
  • గులేబకావళి కథ. మొదలగునవి.

ఉర్దూ సామెతలు [మార్చు]

చూడండి : ఉర్దూ సామెతలు

ఉర్దూ భాష మాట్లాడే దేశాలు [మార్చు]

భారత దేశంలో ఉర్దూ అధికారిక భాష గల రాష్ట్రాలు [మార్చు]

ప్రథమ అధికారిక భాష

రెండవ అధికారిక భాష

ఆంధ్రప్రదేశ్ లో రెండవ అధికారిక భాషగా గల జిల్లాలు

ఉర్దూమాధ్యమంలో పరీక్షలు [మార్చు]

  • రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు ఇకపై ఉర్దూలో నిర్వహించనున్నట్లు రైల్వే శాఖామంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు.ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషులో మాత్రమే ఆర్‌ఆర్‌బీ పరీక్షలు నిర్విహస్తున్నారు.(ఈనాడు29.10.2009)

ఆంధ్రప్రదేశ్ నుండి ప్రచురితమయ్యే ఉర్దూ వార్తా పత్రికలు [మార్చు]

దినపత్రికలు

సియాసత్,[1] * మున్సిఫ్ [2] ,* రహ్ నుమా-యె-దక్కన్, ఏతెమాద్ [3], రాష్ట్రీయ సహారా [4] మరియు మిలాప్ [5]


వార పత్రికలు


మాస పత్రికలు

అంధ్రప్రదేశ్ లో ఉర్దూ జనాభా [మార్చు]

55.6 లక్షల మంది ఉన్నారు.స్థానిక జనాభాలో 15% కంటే మించి ఉర్దూ ప్రజలు ఉన్నపట్టణాలు ఇవి:

  • చిత్తూరు జిల్లా మదనపల్లి,వాయల్పాడు
  • కడప ప్రొద్దుటూరు లక్కిరెడ్డిపల్లి
  • గుత్తి రాయదుర్గ అనంతపురం ధర్మవరం గుంతకల్లు హిందూపురం
  • అదిలాబాద్ భైంసా కాగజ్ నగర్ నిర్మల్ మధోల్
  • గుంటూరు చిలకలూరిపేట నరసరావుపేట పొన్నూరు
  • ఎమ్మిగనూరు ఆదోని కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ ఆత్మకూరు బనగానపల్లె నందికొట్కూరు
  • కరీంనగర్
  • ఖమ్మం
  • గద్వాల్ మహబూబ్ నగర్ నారాయణపేట
  • మెదక్ సదాశివపేట సంగారెడ్డి సిద్దిపేట జహీరాబాద్
  • నెల్లూరు
  • బోనగిరి నల్గొండ
  • వరంగల్లు
  • బోధన్ నిజామాబాద్
  • మార్కాపురం
  • మార్పల్లి, తాండూరు
  • హైదరాబాదు

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ విశ్వవిద్యాలయాలు [మార్చు]

ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ భాషా విభాగాలు గల విశ్వవిద్యాలయాలు [మార్చు]

ఉర్దూ భాషాభివృధ్ధి కొరకు పాటుపడుతున్న సంస్థలు [మార్చు]

భారతదేశం లో ఉర్దూ టి.వి. ఛానళ్ళు [మార్చు]

భారతదేశం లో ఉర్దూ రేడియో స్టేషన్లు [మార్చు]

  1. "The Council". National Council for Promotion of Urdu language. Retrieved 2007-06-15. 
  2. Alam, Muzaffar. "The Pursuit of Persian: Language in Mughal Politics." In Modern Asian Studies, vol. 32, no. 2. (May, 1998), pp. 317–349.


"http://te.wikipedia.org/w/index.php?title=ఉర్దూ_భాష&oldid=806284" నుండి వెలికితీశారు