అనంతపురం

వికీపీడియా నుండి

  ?అనంతపురం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 14°42′N 77°35′E / 14.7, 77.59
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 19,130 కి.మీ² (7,386 చ.మై)
ముఖ్య పట్టణము అనంతపురం
ప్రాంతం రాయలసీమ
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
3,639,000 (2001)
• 190/కి.మీ² (492/చ.మై)
• 919999
• 1859000
• 1779000
• 56.69
• 68.94
• 43.87

అక్షాంశరేఖాంశాలు: 14°42′N 77°35′E / 14.7, 77.59


అనంతపురం (Anantapur or Anantapuram) దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన అతి పెద్ద జిల్లా మరియు ముఖ్య పట్టణము. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి వేర్పాటు చేయబడినది. ఈ ప్రాంతము ప్రధానముగా వర్షాధారిత వ్యవసాయము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు

విషయ సూచిక

[మార్చు] భౌగోళికము

అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున కడప జిల్లా, ఆగ్నేయమున చిత్తూరు జిల్లా, పశ్చిమాన మరియు నైఋతిన కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా కలవు. జిల్లాకు ఉత్తరాన మరియు మధ్యభాగములో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగము ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, స్వర్ణముఖి మరియు తడకలేరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతము కురుస్తుంది. రాజస్థాన్ లోని జైసల్మీరు తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.

[మార్చు] చరిత్ర

అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి బుక్క రాయలు శంకుస్థాపన చేసాడు. అతని భార్య అనంతాదేవి పేరు మీద అనంతపురి అని పేరు పెట్టాడు. అలాగే అతని పేరు మీద బుక్కరాయ సముద్రం చెరువు ఎర్పాటు చేశాడు. అనంతర కాలంలో అనంతపురం అని వాడుకలోకి వచ్చింది.

[మార్చు] జిల్లా విశిష్టతలు

  • జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబర్ కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. రామగిరి, సింగనమల, వజ్రకరూర్ జిల్లాలోని కొన్ని ప్రముఖ పవనవిద్యుత్కేంద్రాలు.
  • జిల్లాలోని వజ్రకరూర్ వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
  • లేపాక్షి లో భారతదేశములోనే అతి పెద్దదైన నంది విగ్రహము కలదు.
  • కదిరి పట్టణములో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయము, సమీపమున గుట్టబయలు గ్రామమున ఆసియా ఖండమునకే విశాలమైన మర్రి చెట్టు కలదు.
  • గుంతకల్ మండలంలోని కలశాపురం(కసాపురం) గ్రామంలో శ్రీ మధ్వాచార్య ప్రతిష్టిత వీరాంజనేయ స్వామి దేవస్థానం కలదు.
  • పెద్ద వడుగూరు మండలంలో కోటకొండ ఇక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందినది.
  • గుత్తి పట్టణం లో పురాతన కట్టడాల్లో ఒకటైన కోట ప్రసిద్ధిగాంచినది. ఈ కోట లో సుమారు 101 దిగుడు బావులు కలవు, తరచు పలువురు సందర్శకులు ఈ ప్రసిద్ధ కోటను సందర్శిస్తుంటారు.
  • శ్రీ సత్యసాయి బాబా గారి ఆశ్రమము ప్రశాంతి నిలయము అనంతపురం జిల్లా లోని పుట్టపర్తిలో కలదు.
  • పారిశ్రామికపరముగా తాడిపత్రి పట్టణంలో గ్రానైటు ను శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారము మరియు బీడీల పరిశ్రమ, ధర్మవరం పట్టు మరియు జౌళి పరిశ్రమ బాగా ప్రసిద్ధి చెందినవి.
  • తాడిపత్రి పట్టణంలో శ్రీ కృష్ణదేవరాయల వారి అరుదైన కట్టడాలలో ఒకటైన దేవాలయములు బాగా ప్రసిద్ధి.
  • యాడికి గత దశాబ్దకాలంగా ధర్మవరం తరువాత అతిపెద్ద పట్టు మరియు జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచినది.
  • పెనుకొండ పట్టణంలో రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో దేవాలయాలు ఉన్నవి
  • రాష్ట్రంలో వైశాల్యములో అతి పెద్ద జిల్లా, అక్షర క్రమములో రెండవది.

[మార్చు] జిల్లా ప్రముఖులు

హెమవథి గుది 8- 10 దసబద్బు లొ నిర్మిన్ఛబదిన గుది. ఛుద ముఛత ఉఒతున్ది

[మార్చు] గణాంకాలు

అనంతపురం జిల్లా ప్రస్తుతం కరువు జిల్లా గా ప్రసిద్ది చెందినప్పటికీ రాయల వారి కాలము లో సకల సంపదలతో విరాజిల్లినది.

[మార్చు] రెవిన్యూ డివిజన్లు

3 అనంతపురం ,పెనుగొండ , ధర్మవరం.

[మార్చు] మండలాలు

భౌగోళికంగా అనంతపురం జిల్లాను 63 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[2].

అనంతపురం జిల్లా మండలాలు

[మార్చు] పర్యాటక కేంద్రాలు

అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, పెనుగొండ మరియు రాయదుర్గం కోటలు, పుణ్య క్షేత్రమైన పుట్టపర్తి, మరియు లేపాక్షి దేవాలయములకు ప్రసిద్ధి. గుత్తిలో సముద్రమట్టమునకు 2,171 అడుగుల ఎత్తున ఉన్న అద్భుతమైన కోటదుర్గము కలదు. ఇటువంటిదే బెంగుళూరుకు సమాన ఎత్తులో సముద్రమట్టమునకు దాదాపు 3,100 అడుగుల ఎత్తునగల ఇంకా పెద్దదయిన కోటదుర్గము పెనుగొండలో కలదు. హైదర్ అలీ ఆక్రమించుకొనేవరకు గుత్తి దుర్గము మరాఠాలకు గట్టిపట్టుగా ఉండినది. 1789 లో టిప్పూ సుల్తాన్ దీనిని నిజాం వశము చేశాడు. 1800లో నిజాం ఇతర రాయలసీమ(దత్త మండలము) జిల్లాలతో సహా అనంతపురం జిల్లాను బ్రిటిషు వారికి దత్తము చేశాడు. కదిరి సమీపములో ని తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.ఇది సుమారు 5 ఎకరాల విస్తీర్ణం లో వుంది.ఇది గిన్నిస్ రికార్డ్ కూడా.


అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, కదిరి, ధర్మవరం, మరియు రాయదుర్గం. జిల్లాలోని ముఖ్య పట్టణములు. ఆలూరు, చిత్రచేడు, ఎనుమలదొడ్డి, గుత్తి, లేపాక్షి, మరియు పుట్టపర్తి ఇతర ప్రధాన ప్రదేశములు.

[మార్చు] మూలాలు

  1. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైటులో ఆంధ్రప్రదేశ్ జిల్లాల వివరాలు
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో అనంతపురం జిల్లా తాలూకాల వివరాలు. జూలై 7, 2007న సేకరించారు.

[మార్చు] స్వచ్ఛంద సేవా సంస్థలు

ఒకప్పుడు పాడి పంటలతో కళకళ లాడిన అనంతపురం ఇప్పుడు నిత్యం కరువు కాటకాలతో సతమతమౌతోంది.జిల్లాలో అధిక విస్తీర్ణం సాగు వర్షాధారం. ఇక్కడ వేరుసెనగ సాగు చేస్తారు.ఏళ్ళు గడచినా ఇక్కడ ప్రజల జీవన విధానంలో పెద్దగా మార్పు లేదు.ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు RDT(Rural Development Trust) సేవా సంస్థ చాలా ఏళ్ళుగా కృషి చేస్తోంది.

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు