పెనుకొండ
| ?పెనుకొండ మండలం అనంతపురం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పెనుకొండ |
| జిల్లా(లు) | అనంతపురం |
| గ్రామాలు | 16 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
50,796 (2001) • 26228 • 24568 • 62.75 • 74.36 • 50.39 |
పెనుకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణం మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] పెనుకొండ దుర్గం
పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది.
పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం. ఈ దుర్గ ప్రశస్తి గురించిన ఒక గేయం:
చనిన నాళుల తెనుగు కత్తులు
- సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ
రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
- ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల, కరితి నీలపు దండ, ఈ పెనుగొండ కొండ
వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
- పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ, ఈ పెనుగొండ కొండ
తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
- నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ, ఈ పెనుగొండ కొండ
పెనుకొండలో చూడదగిన ప్రదేశములు: 1.పెనుకొండ కోట బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాశనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి. 2.యెర్రమంచి గేటు ఇందులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండ లొ 365 దేవాలయాలు కలవు. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు.
[మార్చు] రాజకీయ ప్రముఖులు
రాష్ట్రంలోని రాజకీయ నాయకుల్లో ఒకడైన కీ.శే. పరిటాల రవి ఈ నియోజక వర్గం నుండే ప్రాతినిధ్యం వహించాడు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- దుద్దేబండ
- గుట్టూరు
- మునిమడుగు
- చెర్లోపల్లి
- వాసుదేవపురం
- ఎర్రమంచి
- గొందిపల్లె
- మావటూరు
- నాగలూరు
- అడదాకులపల్లె
- పెనుకొండ
- గోనిపేట
- రాంపురం
- కొండంపల్లె
- శెట్టిపల్లె
- బొజ్జిరెడ్డిపల్లె
- ఇసలపురము(పెనుకొండ)
|
|||||||
|
|
|
|---|---|
| దుద్దేబండ · గుట్టూరు · మునిమడుగు · చెర్లోపల్లి · వాసుదేవపురం · ఎర్రమంచి · గొందిపల్లె · మావటూరు · నాగలూరు · అడదాకులపల్లె · పెనుకొండ · గోనిపేట · రాంపురం · కొండంపల్లె · శెట్టిపల్లె · బొజ్జిరెడ్డిపల్లె |
