లేపాక్షి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లేపాక్షి
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో లేపాక్షి మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో లేపాక్షి మండలం యొక్క స్థానము
లేపాక్షి is located in ఆంధ్ర ప్రదేశ్
లేపాక్షి
ఆంధ్రప్రదేశ్ పటములో లేపాక్షి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°49′N 77°36′E / 13.81°N 77.60°E / 13.81; 77.60
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము లేపాక్షి
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 42,101
 - పురుషులు 21,786
 - స్త్రీలు 20,315
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.91%
 - పురుషులు 65.76%
 - స్త్రీలు 39.12%
పిన్ కోడ్ 515331

లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 515331. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకొ కల పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్థంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.

ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉన్నది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.

లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం.అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.

ఇతిహాసము[మార్చు]

ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని క్రి. శ ౧౫, ౧౬ వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయలకాలములో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనె పెరుగల ఒక కోండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అందురు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచినారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయ్.

రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యెక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయినది. ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి ’లే-పక్షి’ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

నవోదయ పాఠశాల[మార్చు]

ప్రతిభ ఉన్నా చదువుకోలేని గ్రామీణ విద్యార్థుల్లో వెలుగులు నింపుతోంది జవహర్ నవోదయ విద్యాలయం. ఉన్నతప్రమాణాలతో కూడిన అధునాతన విద్య ఉచితంగా అందించడంతో పాటు నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠశాల ప్రత్యేకత. అంతేగాక విశాలమైన క్రీడామైదానం, గ్రంథాలయంతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయంలోను విద్యార్థులకు పాఠాలు భోదించేలా పనిచేసే ఇంటరాక్టివ్ బోర్డు, ప్రతి విద్యార్థికి కంప్యూటర్ శిక్షణ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. సంగీతం, చిత్రలేఖనంలోనూ తర్ఫీదు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. జిల్లాలో లేపాక్షిలో ఈ విద్యాలయాన్ని 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్థాపించాడు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ కౌన్సిల్ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిలబస్‌లో బోధన సాగుతోంది. 10, 12 తరగతుల విద్యార్థులు సెంటర్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు. అందుకే ఈ పాఠశాలలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

లేపాక్షి చిత్ర మాలిక[మార్చు]

లేపాక్షి వీరభద్ర మందిరం
నాగలింగం
లేపాక్షి బసవన్న
శివ పార్వతీ కళ్యాణ మంటపం
లేపాక్షి ఆలయం లోపల


"http://te.wikipedia.org/w/index.php?title=లేపాక్షి&oldid=1242665" నుండి వెలికితీశారు