మొక్కజొన్న
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| మొక్కజొన్న | |
|---|---|
| Cultivars of maize | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | Liliopsida |
| Order: | Poales |
| Family: | పోయేసి |
| Genus: | జియా |
| Species: | జి. మేస్ |
| Binomial name | |
| జియా మేస్ లి. |
|
మొక్కజొన్న (Maize) ఒక ముఖ్యమైన ఆహారధాన్యము.
ఉపయోగాలు [మార్చు]
- మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు.
- మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు.
- లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు.
- మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు.
- మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు.
మొక్కజొన్న ఇతర ఉపయోగాలు: పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలో ను మొక్కజొన్న వాడుతున్నారు. విస్కీ తయారీలోను మొక్కజొన్న వుండాల్సిందే. ఇంకా అనేక పారిశ్రామికి ఉత్పత్తుల్లొ కూడ మొక్కజొన్న ఉపయోగ పడుతున్నది. మానవునికి ఆరోగ్య పరంగా మొక్క జొన్న ఉపయోగం అనంతం. మొక్క జొన్న వేర్లు, కాండం నుండి తీసిన కషాయం అరోగ్యానికెంతో మంచిది. ఇంకా కండి చుట్టు వున్న మృదువైన దారాల నుండి తీసిన కషాయం మధు మేహాని కి చాల మంచిది. ఇలా మొక్క జొన్న వుపయోగం కొన్ని వేల ఉత్పత్తులలో కనబడుతున్నది. ఒకప్పుడు కేవలం మొక్క జొన్న కండిలను కాల్సుక తినెవారు. వాటి ఉపయోగం పెరగడం వల్ల ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా మొక్క జొన్న ఉత్పత్తి బాగా పెరిగింది. అందుకే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పండే పంటల్లో నాల్గవ స్థానంలో మొక్క జొన్న నిలిచింది.
| Sweetcorn (seeds only) పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు |
||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శక్తి 90 kcal 360 kJ | ||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||
| శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా Source: USDA పోషక విలువల డేటాబేసు |
||||||||||||||||||||||||
ఉత్పాదకత [మార్చు]
మొక్కజొన్న ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన ఆహారంగా అన్నింటికన్నా ఎక్కువగా పెంచబడుతున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు సుమారు సగం (~42.5%) ఉత్పత్తికి కారణమై అగ్రస్థానంలో నిలిచింది. తరువాత పది స్థానాలు చైనా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటినా, భారతదేశం మరియు ఫ్రాన్స్ ఆక్రమించాయి. 2007 సంవత్సరంలో ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి సుమారు 800 మిలియన్ టన్నులున్నది; దీనిని 150 మిలియన్ హెక్టారులలో పండించగా, సుమారు 4970.9 కిలోగ్రాము/హెక్టారు దిగుబడి వచ్చినది.
| Top Ten Maize Producers in 2007 | ||||
|---|---|---|---|---|
| దేశం | ఉత్పాదన (టన్నులు) | Note | ||
| 332,092,180 | ||||
| 151,970,000 | ||||
| 51,589,721 | ||||
| 22,500,000 | [F] | |||
| 21,755,364 | ||||
| 16,780,000 | ||||
| 13,107,000 | ||||
| 12,381,561 | ||||
| 10,554,500 | ||||
| 9,891,362 | ||||
| 784,786,580 | [A] | |||
| No symbol = official figure, P = official figure, F = FAO estimate, * = Unofficial/Semi-official/mirror data, C = Calculated figure, A = Aggregate (may include official, semi-official or estimates); |
||||