విటమిన్ సి

వికీపీడియా నుండి
Citrus fruits were one of the first sources of vitamin C available to ship's surgeons.

విటమిన్ C రసాయనిక నామం 'ఏస్కార్బిక్ ఆమ్లం'. నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ C మృదులాస్థి, ఎముక, డెంటీన్ ల మాత్రికను, రక్తనాళాల ఎండోథీలియమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్తంలో కొలెస్టిరాల్ ను కరిగిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి, ఇనుము శోషణాన్ని అధికం చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

విటమిన్ C లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది. చర్మం పగలటం, పళ్ళ చిగుళ్ళు వాయడం, చిగుళ్ళనుంచి రక్తస్రావం, గాయాలు త్వరగా మానకపోవడం ఈ వ్యాధి లక్షణాలు.

"http://te.wikipedia.org/w/index.php?title=విటమిన్_సి&oldid=809407" నుండి వెలికితీశారు