నిమ్మ

వికీపీడియా నుండి
నిమ్మ
Citrus x limon
Scientific classification
Kingdom: ప్లాంటే
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Subclass: Rosidae
Species: C. × limon
Binomial name
Citrus × limon
(లిన్నేయస్) Burm.f.

నిమ్మ (ఆంగ్లం Lemon) పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం గురించి ఎక్కువగా వీటిని పెంచుతారు.


విషయ సూచిక

చరిత్ర [మార్చు]

నిమ్మ గురించి మొదటిసారిగా 10వ శతాబ్దంలొని అరబ్ సాహిత్యంలో పేర్కొనబడింది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు.

సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే స్కర్వీ వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ సి లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు.


వర్ణన [మార్చు]

కాయలతో నిమ్మచెట్టు
నిమ్మపండు
నిమ్మచెట్టు పై రూపుదిద్దుకుంటున్న కాయలు

నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.

నిమ్మపండ్ల ఉత్పాదన [మార్చు]

నిమ్మ ఉత్పాదనలో మెక్సికో, భారతదేశం ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.

ఉపయోగాలు [మార్చు]

  • నిమ్మరసం వేసవికాలంలో ఉప్పు లేదా పంచదారతో కలిపి పానీయంగా తాగడం చాలా మందికి ఇష్టం. ఒక నిమ్మపండు నుండి ఇంచుమించు 3 చెంచాల రసం వస్తుంది. నిమ్మరసంతో పులిహోర చాలా రుచిగా ఉంటుంది.
  • నిమ్మరసంలో చేపలు, మాంసం కొంతసేపు నానబెట్టిన అది మెత్తబడి రుచిగా ఉంటుంది.
  • నిమ్మపండులతో ఊరగాయ చేస్తారు. ఇది పత్యం చేసేవారికి చాలా ఇష్టంగా ఉంటుంది.

ఎండా కాలంలో నిమ్మ రసం కలిపిన షోడ ఉపయోగం తెలియని వారుండరు/. నీమ్మ తో షర్బత్ లు, నిల్వ వుండే పానీయాలు తయారు చేస్తారు. ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాల త్వరగా శక్తి వస్తుంది. అందుకే నిరాహార దీక్ష విరమించె వారు నిమ్మ రసంతో దీక్ష విరమిస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు [మార్చు]

Lemon, raw, without peel
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 30 kcal   120 kJ
పిండిపదార్థాలు     9 g
- చక్కెరలు  2.5 g
- పీచుపదార్థాలు  2.8 g  
కొవ్వు పదార్థాలు 0.3 g
మాంసకృత్తులు 1.1 g
నీరు 89 g
విటమిన్ సి  53 mg 88%
Citric acid 5 g
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
  • నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది.
  • ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు.
  • దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
  • జపాన్ లోని కొందరు నిమ్మ వాసన ఎలుకలలో ఉద్రేకాన్ని తగ్గిస్తాయని నిరూపించారు.

చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు. అలాగె నిమ్మను చాల సౌందర్య సాదనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడ ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. శిరోజ సంరక్షణకు కూడ నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.

నిమ్మ రకాలు [మార్చు]

మనకు తెలిసిన నిమ్మ పరిమాణంలొ తేడాలు తప్ప అన్ని ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కాని నిమ్మ లో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలొ మనదె అగ్ర స్థానం. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్క. కొన్ని నిమ్మ తీగలు కూడా వుంటాయి. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగ తెలిసిన రంగులు పశుపు వచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగు వి కూడ వుంటాయి. దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడ వున్నాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=నిమ్మ&oldid=809235" నుండి వెలికితీశారు