ఆయుర్వేదం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాదుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సాంప్రదాయములు కలవు.

ధన్వంతరి, ఆయుర్వేద వైద్యుడు

పౌరాణిక గాథలు[మార్చు]

వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగినది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉన్నది.

చారిత్రక ఆభివృద్ధి[మార్చు]

ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తకరూపంలో తక్షశిల,నలందా విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.

ఇతర వైద్యవిధానాలతో పోలిక[మార్చు]

ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు మరియు రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.

వివిధ సాంప్రదాయాలు[మార్చు]

ప్రస్తుత ఆచరణ విధానాలు[మార్చు]

ప్రస్తుతము ఆయుర్వేదము నందు పంచకర్మ బాగా ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ విధానముచే కండరాలు నరములకు సంభందించిన అనేక వ్యాధులను చికిత్స చేయవచ్చు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు, వనరులు[మార్చు]

  • శ్రీ చిత్ర పురాణపండ, ఆయుర్వేదమ్‌ (భారతీయ వైద్య శాస్త్రము), జనప్రియ పబ్లికేషన్స్‌, తెనాలి - 522 201

ఉపయుక్త గ్రంథసూచి[మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=ఆయుర్వేదం&oldid=1167406" నుండి వెలికితీశారు