కల్పము (వేదాంగం)
వికీపీడియా నుండి
ఈ వ్యాసం వేదాంగాలలో ఒకటి గురించి. పురాణోక్త కాలమానం కొరకు, కల్పము (కాలమానం) చూడండి.
| ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు |
|
| వేదములు (శ్రుతులు) | |
|---|---|
| ఋగ్వేదం · యజుర్వేదం | |
| సామవేదము · అధర్వణవేదము | |
| వేదభాగాలు | |
| సంహిత · బ్రాహ్మణము | |
| అరణ్యకము · ఉపనిషత్తులు | |
| ఉపనిషత్తులు | |
| ఐతరేయ · బృహదారణ్యక | |
| ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
| కఠ · కేన · ముండక | |
| మాండూక్య ·ప్రశ్న | |
| శ్వేతాశ్వర | |
| వేదాంగములు (సూత్రములు) | |
| శిక్ష · ఛందస్సు | |
| వ్యాకరణము · నిరుక్తము | |
| జ్యోతిషము · కల్పము | |
| స్మృతులు | |
| ఇతిహాసములు | |
| మహాభారతము · రామాయణము | |
| పురాణములు | |
| ధర్మశాస్త్రములు | |
| ఆగమములు | |
| శైవ · వైష్ణవ | |
| దర్శనములు | |
| సాంఖ్య · యోగ | |
| వైశేషిక · న్యాయ | |
| పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
| ఇతర గ్రంథాలు | |
| భగవద్గీత · భాగవతం | |
| విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
| లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
| శివ సహస్రనామ స్తోత్రము | |
| త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
| పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
| ... · ... | |
| ఇంకా చూడండి | |
| మూస:హిందూ మతము | |
ఆరు వేదాంగాలలో కల్పము వకటి. ఇది యాగ క్రియలను గురించి చెప్పే శాస్త్రము. కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రాలను రచించారు
సంప్రదాయ వైదిక సాహిత్యంలో కల్పములనే వేదాంగాలగురించి ప్రత్యేకమైన రచనలు పేర్కొనబడలేదు. కాని యజ్ఞయాగాదులలో జరిగే కార్యాల విషయంలో అనేక సూత్రాలు కాలానుగుణంగా చెప్పబడ్డాయి. అవే కల్పాలుగా ప్రసిద్ధమయ్యాయి. కల్ప సూత్రాలు రెండు విధాలు.
- శ్రౌత సూత్రాలు : ఇవి "శ్రుతులు" ఆధారంగా తెలియవచ్చాయి. పెద్ద పెద్ద యాగాలలో జరిపే హోమ ప్రక్రియల గురించి. ఈ రకమైన యాగాలలో మూడు గాని ఐదు గాని హోమగుండాలుంటాయి. యజుర్వేదానికి సంబంధించిన శ్రౌత సూత్రాలలో "శుల్వ సూత్రం" అనే విభాగం ఉంది. వివిధ రకాలైన కొలతలు,. హోమగుండ నిర్మాణం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.
- స్మార్త సూత్రాలు : ఇవి "స్మృతులు"లో చెప్పిన నియమాలను బట్టి రూపొందాయి. వీటిలో మళ్ళీ రెండు విధాలున్నాయి.
- "గృహ్య సూత్రాలు" - గృహస్తులకు పనికివచ్చే సూత్రాలు. పెళ్ళి, జననం, నామకరణం వంటి సందర్భాలలో పాటించవలసిన విధానాలు. ఇంటిలో ఏర్పరచే హోమగుండం గురించి.
- "ధర్మ సూత్రాలు" : ఆచారాలు, సామాజిక వ్యవహారాలు, విధానాలు గురించిన సూత్రాలు. తరువాతి ధర్మ శాస్త్రాలకు ఇవే మౌలిక సూత్రాలు.
సూత్రాలలో చెప్పబడిన విషయాలకు అనుబంధంగా వెలువడిన రచనలను "పరిశిష్ఠాలు" అంటారు.