బ్రహ్మ

వికీపీడియా నుండి

కర్ణాటకలోని హళిబీడులో ఉన్న బ్రహ్మ శిల్పం

విషయ సూచిక

[మార్చు] హిందూ సంప్రదాయంలో స్థానం

సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు.

[మార్చు] బ్రహ్మ మానస పుత్రులు

మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు

[మార్చు] ప్రధాన కధ

[మార్చు] మత సంప్రదాయాలు

[మార్చు] పేర్లు, అవతారాలు

[మార్చు] గ్రంధాలూ, పురాణాలూ

[మార్చు] దేవాలయాలు

పుష్కర్ లోని బ్రహ్మదేవుడు
చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం.

బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్ధించినా, బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది అజ్మీర్ దగ్గరలోని పుష్కర్ (Pushkar) వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు.

శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం ఉన్నది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉన్నది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం (Kheteshwar Brahmadham Tirtha) అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నవి.

బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది కంబోడియా లోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం.

[మార్చు] కర్ణాటక సంగీతం

కర్ణాటక సంగీతంలోని మేళకర్త రాగాలలో తొమ్మదవ చక్రం పేరు బ్రహ్మ చక్రాల పేర్లు వాటితో సంబంధమున్న సంఖ్యను సూచిస్తాయి. ఇక్కడ నవబ్రహ్మలు అనగా తొమ్మిదవ చక్రం అని అర్ధం.[1] [2]

[మార్చు] ఆచారాలు, పండగలు

[మార్చు] ప్రార్ధనలు, స్తోత్రాలు

[మార్చు] ఇవి కూడా చూడండి


[మార్చు] వర్గాలు

[మార్చు] వనరులు

[మార్చు] బయటి లంకెలు


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు