పాణిని

వికీపీడియా నుండి

సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి పాణిని. ఈయన బాల్య జీవితం గూర్చి ఆసక్తి కరమైన కథ ఉంది. ఈయన చిన్నతనంలో విద్యాభ్యాసానికి గురుకులానికి పంపినపుడు చురుగ్గా ఉండేవాడు కాదు. గురువేమో కోప్పడుతూ ఉండేవాడు. చివరికి ఒకసారి అతని హస్తసాముద్రికాన్ని పరిశీలించిన గురువు నీకు చదువు రేఖ లేదు, వెళ్ళిపొమ్మన్నాడు. ఇంటికి తిరిగి వెళుతూ ఒక చోట దాహం తీర్చుకోవడానికి బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పాత్రలు పెట్టే చోట రాయి బాగా అరిగి పోయి ఉంది. రాపిడి వలన రాయే అరిగి పోయినపుడు బాగా ప్రయత్నం చేస్తే నాకు చదువెందుకు రాదు? అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. గురువు గారు రేఖ లేదన్న చోట పదునైన రాయితో గీత గీసుకుని గురువు గారి ఆశ్రమానికి తిరుగు ప్రయాణమయ్యాడు. తిరిగి వచ్చిన శిష్యుడి ధృఢ సంకల్పం చూసి ఆయన అచ్చెరువొందాడు. విద్య నేర్పడానికి అంగీకరించాడు. పాణిని పెద్దవాడైన తర్వాత ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన సంస్కృత భాషకు వ్యాకరణం రచించాడు. దీనినే "పాణినీయ వ్యాకరణం" లేదా అష్టాధ్యాయి అని కూడా అంటారు.

అష్టాధ్యాయి [మార్చు]

అష్టాధ్యాయి అనగా అష్టానాం అధ్యాయ్యానాం సమహారము అని అనెదరు. ఆ గ్రంధమున ఎనిమిది (8)అధ్యాయములు కలవు. దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు కలవు.

"http://te.wikipedia.org/w/index.php?title=పాణిని&oldid=809487" నుండి వెలికితీశారు