నారాయణ పండితుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణ పండితుడు

నారాయణ పండితుడు (సంస్కృతం: नारायण पण्डित) (1340–1400) ఒక ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త. యీయన సంస్కృత భాషలో గణిత భావనలను రెండవ భాస్కరాచార్యుని తరువాతి కాలములో వ్రాశాడు[1] ఆయన "గణిత కౌముది" అనే గ్రంధమును 1356 సంవత్సరంలో గణిత ప్రక్రియలతో వ్రాశాడు. ఆయన రచనలు గణిత శాస్త్రం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని చెప్పవచ్చు.

ఆతని తండ్రి పేరు నృసింహ లేదా నరసింహ, ఆతని గణిత రచనలను బట్టి ఆయన ఉత్తర భారత దేశంలో నివసించేవాడని తెలుస్తుంది.

గణిత సేవలు[మార్చు]

నృసింహ పుత్రుడగు నారాగణ పండితుడు అంకగణీతమునకు, జ్యామితికి అంకితము చేయబడిన తన గణిత కౌముదిని వ్రాసెను. ఇతడే "నా బీజ గణితము" అని అందు పేర్కొన్నాడు. గణిత కౌముదిని శోధించిన పద్మాకర ద్వివేది ఆ గ్రంథం యొక్క ఉపోద్ఘాతమునందు నారాయణ బీజం అను పేరిట బీజగణితమును విమర్శించు ఖండమొకటి, వారణాసి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సరస్వతీ భవన్ కోశ భాండాగారము నందు కలదని చెప్పెను. అంతకన్న మించి దాని విషయమై మనకు తెలియదు. కొందరు దాని విస్తృత లక్షణమును పురస్కరించుకొని కాబోలు గణిత కౌముదిని లీలావతీ వ్యాఖ్యానమని చెప్పుట కద్దు. అది భ్రాంతి మూలకం. క్రమరహితముగ, గణిత కౌముది యందు కూర్చబడిన విషయములలో అత్యంత ప్రధానములయినవి పూర్ణాంక, భిన్నాంకములకు సంబంధించిన మూలపరికర్మాష్టకము, వర్ణములకు, వర్ణమూలాంకములకు అన్వయించి భిన్నాంకములను గురించిన కఠిన సమస్యలు(సంకీర్ణ ప్రజాతయః), వర్గమునకు సంబంధించిన విచిత్ర సమస్యలు, వ్యప్తవిధి(ఇన్వర్షన్), త్రైరాశికం, మిశర్మ వ్యవహారం, వృద్ధి, ధనం(వడ్డీ), కాలం-దూరం, కాలం-పని, వీటిని గూర్చి సమస్యలు, శ్రేఢి వ్యవహారం, స్థూల వ్యవహార విధి, ఋజు రేఖాచిత్రముల యొక్క కర్ణములుల్, ఎత్తుల, పరివ్యాసములు లెక్కలు, వృత్తముల చాపములు, జ్యాలు, అంకశ్రేఢుల జ్యామితీనిరూపణ, పూర్ణాంక నిలువు చిత్రములు, జ్యామితి యందు మిక్కి కఠినమయిన(పైశాచిక) సమస్యలు, త్రవ్వటాములు(ఖాతాఅ వ్యవహారాలు), వర్గ ప్రకృతి, బాధదాన విధానం, అనగా ఒక దత్త సంఖ్యను నిశ్శేషంగా భాగింపగల సంఖ్యలను కనుగొనడం, భిన్నాంక క్షేత్రమందలి ఇతర సమస్యలు అంక పాశములు, భద్రగణితం.

నారాయణ పండితుడు రచించిన అంకగణిత శాస్త్రమును "గణిత కౌముది", బీజగణిత శాస్త్రమును "బీజగణిత వతంశ" అని అంటారు.కొందరు దాని విస్తృత లక్షణమును పురస్కరించుకొని కాబోలు గణిత కౌముదిని లీలావతీ వ్యాఖ్యానము "కర్మప్రదీపిక" చెప్పుట కద్దు[2] . కర్మదీపిక గ్రంథంలో సంఖ్యల వర్గములు కనుగొను వివిధ పద్ధతులు ఉన్నాయి. ఈ గ్రంథంలో బీజగణితం, మాజిక్ చతురస్వాలు వంటివి ఉన్నాయి.⌊⌊⌊M15⌋⌋⌋⌋ .

నారాయణ పండితును ముఖ్యమైన వని వల్ల గణిత శాస్త్రం వృద్ధి చెందింది. ఆయన కొన్ని సంఖ్యలకు వర్గమూలాలను సుమారు విలువలను కనుగొనే విధానాలను, రెండవ తరగని సమీకరణములైన nq2 + 1 = p2(పెల్స్ సమీకరణం) ను కనుగొనుట, ఉన్నత తరగతి సమీకరణాల సాధనలు, సున్న తో గణి త ప్రక్రియలు, జ్యామితీనియమాలు, విచిత్ర చతురస్రాలు గూర్చి ఆయనచే తెలియ జేయబడ్డాయి[2]. ఆయన కనుగొన్న కలన గణితము యొక్క భావనలను మనం రెండవ భాస్కరాచార్యుని రచనలలో చూడవచ్చు. దీనిని బట్టి కలన గణిత భావనలు నారాయణ పండితుని కృషిని తెలియజేసే సాక్ష్యంగా చెప్పవచ్చు. నారాయణ పండితుడు చక్రీయ చతుర్భుజాల గూర్చి కూడా తన రచనలలో వివరించాడు.[3].

యివి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Kim Plofker (2009), Mathematics in India: 500 BCE–1800 CE, Princeton, NJ: Princeton University Press, ISBN 0-691-12067-6
  2. 2.0 2.1 J. J. O'Connor and E. F. Robertson (2000). Narayana Archived 2008-01-24 at the Wayback Machine, MacTutor History of Mathematics archive.[unreliable source?]
  3. Ian G. Pearce (2002). Mathematicians of Kerala Archived 2008-12-19 at the Wayback Machine. MacTutor History of Mathematics archive. University of St Andrews.[unreliable source?]