సున్న
సున్న ఒక అంకె మరియు ఇతర సంఖ్యలు (పది కంటే పెద్ద సంఖ్యలు, దశమ స్థానాలు) వ్రాయడములో ఉపయోగ పడే అక్షరము కూడా. సున్న అంటే శూన్యము అంటే ఏ విలువ లేకపోవడము. పూర్ణాంకాలు, సహజ సంఖ్యల సంకలనము లో, ఇతర బీజగణిత నిర్మాణాలలో సంకలన తత్సమం Identity గా ఉపయోగపడుతుంది. స్థానమును నిర్థారించడానికి కూడా సున్న ను వాడతారు. చారిత్రాత్మకంగా సున్న వాడుక లోకి వచ్చిన ఆఖరి అంకె. ఇంగ్లీషులో సున్నని అంకెగా ఉన్నపుడు 'నల్' అని కాని 'నిల్' అని , న్యూమరల్[తెలుగు పదము కావాలి] గ ఉన్నపుడు 'ఓ' అని, నాట్ అని అన్ని పరిస్థితులలో అనపడుతుంది.
సున్నాను కనుగొనడం గణితశాస్త్రం మొత్తం మీద విప్లవాత్మక మైన మార్పు తెచ్చింది. సున్నా అనే భావన బాబిలోనియా లాంటి పలు పురాతన నాగరికతలలో కనిపించినప్పటికీ, మనం ఇవాళ ఉపయోగిస్తున్న చిహ్నం ఆ తరువాతి కాలం వరకు కనుగొనబడినది.
మద్య ఆసియా-భారత దేశాల మధ్య వర్తక వాణిజ్యా సంబంధాలు మనదేశానికి 'సున్నా' ను పరిచయం చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మాయాన్లు, బాబిలోనియన్లలాగనే భారతీయులు కూడా ఖాళీ స్థలాన్ని చూపడానికి '0' గుర్తును ఉపయోగిస్తున్నారు. అయినా క్రీస్తు శకం 9వ శతాబ్ధం నాటికి భారతీయులు 'సున్నానూ ఒక అంకెగా కూడా భావించడం ప్రారంభించారు. దీన్ని గణిత శాస్త్రంలో అతిపెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. ఒకటికన్నా తక్కువ అంకె ఉందనీ ఒకటి నుంచీ దానిని తీసివేస్తే సమాధానం లభిస్తుందనీ భారతీయులు కనుగొన్నారు. అప్పటినుంచి భారతీయుల సంఖ్యా విధానం మనం ఇవాళ అంకెలను గణిస్తున్నట్టు 10 మీద ఆధారపడి ఉంటుంది.[1]
[మార్చు] ఒక అంకెగా సున్న
ధన 1 ముందు , ఋణ 1 తరువాత సున్న వస్తుంది. చాలా సంఖ్యా వ్యవస్థలలో 0, ఋణ సంఖ్యల కంటే ముందు తీసుకొనబడింది. హైరోగ్లఫిక్స్[తెలుగు పదము కావాలి] లో ధైర్యమైనది అని పిలువబడును. ఆధునిక వాడకంలో సున్న ను వృత్తాకారం, దీర్ఘ గోళాకారం లేదా గుండ్రటి భుజాలుగల చతురస్రాకారంలో రాస్తారు.
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- 'సున్న' చరిత్ర
- 'సున్న' చరిత
- 'సున్న' ఆవిష్కరణ
- 'అల్-జిబ్రా' చరిత్ర
- అంకెలు 'సున్న' తోనే ఎందుకు మొదలవ్వాలి. - Edsger Dijkstra
- Numbering Starts with Zero same topic as Dijkstra's article, including some more aspects
- "Zeroes" Song parody
- "My Hero Zero" Educational children's song