యజ్ఞం

వికీపీడియా నుండి
(యజ్ఞము నుండి దారిమార్పు చెందింది)

యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.

విషయ సూచిక

[మార్చు] యజ్ఞ విధానం

వైదిక యజ్ఞంలో "అధ్వర్యుడు" ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక అర్చకులు, పండితులు ఉంటారు. "ఉద్గాత" వేద మంత్రాలు చదువుతాడు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చును.


వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞము విష్ణు స్వరూపము.


[మార్చు] యజ్ఞము, యాగము, హోమము, క్రతువు

[మార్చు] యజ్ఞాలలో రకాలు

యజ్ఞాలు మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు [1].

  1. పాక యజ్ఞాలు - ఇవి మళ్ళీ ఏడు విధాలు
    1. ఔపాసన
    2. స్థాలీపాకము
    3. వైశ్వదేవము
    4. అష్టకము
    5. మాస శ్రాద్ధము
    6. సర్పబలి
    7. ఈశాన బలి
  2. హవిర్యాగాలు - వీటిలో కూడా ఏడు రకాలున్నాయి.
    1. అగ్నిహోత్రాలు
    2. దర్శపూర్ణిమాసలు
    3. అగ్రయణం
    4. చాతుర్మాస్యాలు
    5. పిండ, పితృ యజ్ఞాలు
    6. నిరూఢ పశుబంధము
    7. సౌత్రామణి
  3. సోమ సంస్థలు - వీటిలో ఏడు రకాలు
    1. అగ్నిష్టోమము
    2. అత్యగ్నిష్టోమము
    3. ఉక్థము
    4. అతిరాత్రము
    5. ఆప్తోర్యామం
    6. వాజపేయం
    7. పౌండరీకం

[మార్చు] కొన్ని యజ్ఞాలు

[మార్చు] మూలాలు

  1. శ్రీ కైవల్య సారథి విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=యజ్ఞం&oldid=688237" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు