శివ లింగము

వికీపీడియా నుండి

శివ లింగము

శివ లింగము హిందూ మతం లో ఒక పవిత్ర చిహ్నం. హిందూ మతాన్ని అనుసరించే వారిని ప్రధానంగా మూడు వర్గాలుగా విభజించవచ్చు.

శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం హిందూ మతమంత ప్రాచీనమైనది. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం.

విషయ సూచిక

[మార్చు] శివ లింగనిర్మాణము

శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.

[మార్చు] శివ లింగములు - రకములు

  • స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
  • దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
  • రుష్య లింగములు:రుషి ప్రతిష్టితాలు.
  • మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
  • బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).

[మార్చు] శివ లింగములు నిర్మించు విధానము

శివలింగ నిర్మాణం

[మార్చు] లింగ రూపము యొక్క భావార్ధము

[మార్చు] ఉదాహరణలు

[మార్చు] చిత్రములు

[మార్చు] పంచభూతలింగాలు

పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.

[మార్చు] పంచారామాలు

  • 1. అమారారామము:అమరావతి(గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
  • 2. ద్రాక్షారామము:ద్రాక్షారామ(తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
  • 3. కుమారారామము: సామర్లకోట(తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమారభీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
  • 4 భీమారామము: భీమవరము(పశ్ఛిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
  • 5. క్షీరారామము: పాలకొల్లు(పశ్ఛిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, ఉమ


[మార్చు] కొన్ని విశేషాలు

  • శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.

[మార్చు] ఇవి కూడా చూడండి

పేజీకి సంభందించిన లింకులు