ఋగ్వేదం
| ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు |
|
| వేదములు (శ్రుతులు) | |
|---|---|
| ఋగ్వేదం · యజుర్వేదం | |
| సామవేదము · అధర్వణవేదము | |
| వేదభాగాలు | |
| సంహిత · బ్రాహ్మణము | |
| అరణ్యకము · ఉపనిషత్తులు | |
| ఉపనిషత్తులు | |
| ఐతరేయ · బృహదారణ్యక | |
| ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
| కఠ · కేన · ముండక | |
| మాండూక్య ·ప్రశ్న | |
| శ్వేతాశ్వర | |
| వేదాంగములు (సూత్రములు) | |
| శిక్ష · ఛందస్సు | |
| వ్యాకరణము · నిరుక్తము | |
| జ్యోతిషము · కల్పము | |
| స్మృతులు | |
| ఇతిహాసములు | |
| మహాభారతము · రామాయణము | |
| పురాణములు | |
| ధర్మశాస్త్రములు | |
| ఆగమములు | |
| శైవ · వైష్ణవ | |
| దర్శనములు | |
| సాంఖ్య · యోగ | |
| వైశేషిక · న్యాయ | |
| పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
| ఇతర గ్రంథాలు | |
| భగవద్గీత · భాగవతం | |
| విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
| లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
| శివ సహస్రనామ స్తోత్రము | |
| త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
| పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
| ... · ... | |
| ఇంకా చూడండి | |
| మూస:హిందూ మతము | |
నాలుగు వేదాల లోను ఋగ్వేదము అత్యంత పురాతనమైన గ్రంథము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది .ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋక్కులలో ఐదు రుక్కులను ప్రధానంగా చెప్పబడ్డాయి.1 శాకల, 2 వాష్కల, 3 అశ్వలాయన, 4 మండూకాయన, 5 శాంఖ్యాయన. వీటిలో శాంఖ్యాయన, మండూకాయన, వాష్కల లభ్యం కాలేదు. ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒకటి అష్టకాలు వాటిలో అధ్యాయాలు వాటిలో వర్గాలు ఉంటాయి. రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ వాటిలో సూక్తులుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్ధాలు వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని భావన.
ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాధలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదం అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని దశమ సూక్తంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించింది. ఋగ్వేదం కామితార్ధాలను తీర్చే వేదం. వర్షాలు పడాలంటే పర్జస్య పఠించాలని సూచింప బడింది. జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది. శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది. "అనోభద్రా క్రతవో యంతు విశ్వత॰" అనే సూక్త పఠనం మానవులను దీర్గాయుషులను చేస్తుందని విశ్వసిస్తున్నారు.
విషయ సూచిక |
[మార్చు] ఋగ్వేదం విజ్ఞానం
ఋగ్వేదంలోని ప్రధమ మండలంలోని అశ్వనిసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి. ఖేలుడు అనే రాజు భార్య యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేసింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.
ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ధ ప్రయోగం ద్వారా ద్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిః లో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను అధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి.గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం మొదలైన శబ్దాలతో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.
[మార్చు] ఋగ్వేదంలోని విశేషాలు
ఋగ్వేదం పది మండలములు గా విభజింపబడింది. ఇందులో 10,622 పద్యాలు, 1,53,326 కావ్యాలు, 4,32,000 పదాలు ఉన్నాయట. ఇందులో మొదటి యేడు మండలాలు పరబ్రహ్మమును అగ్ని అనే పేరుతోను, పదవ మండలంలో ఇంద్రునిగాను, మిగిలిన గీతములు బ్రహ్మమును విశ్వే దేవతలు గాను స్తుతిస్తున్నాయి. ఎనిమిదవ, తొమ్మిదవ మండలాలలో ముఖ్యమైన గీతములలో పరబ్రహ్మము వర్ణన ఉంది. 8వ మండలంలో 92 గీతములు, 9వ మండలంలో 114 గీతములు ఉన్నాయి. వీటిలో కొన్ని సోమలతను ప్రార్ధిస్తున్నాయి. మొత్తానికి పదవ మండలంలో నూటికి పైగా అనువాకాలున్నాయి. వీటిలో ఆ గీతములను రచించిన ఋషులు పేర్లు, అవి ఉద్దేశించిన దేవతలు, స్తుతికి కారణం ఉన్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయారణ్యకము,ఐతరేయోపనిషత్తు, కౌషీతకి ఉపనిషత్తు ముఖ్యమైనవి.[1] ==శాఖలు==
- ఋగ్వేదమునకు మొత్తము 21 ప్రధాన శాఖలు ఉండేవి. ప్రధాన శాఖలు అయిన 19 కాలగర్భంలో కలసి పోయాయి. ప్రస్తుతము ఇప్పుడు దొరుకుతున్నది కేవలం ఒక శాఖ మాత్రమే.((అదే శాకల శాఖ))
- ఇంక ఉప శాఖలు ఏవీ దొరకడము లేదు. కానీ కొన్నింటికి, దాదాపుగా 20 ఉప శాఖల పేర్లు మాత్రము మిగిలాయని, తెలుస్తున్నాయని ఉవాచ.
[మార్చు] మండల విభాగము
- మండలములు సంఖ్య = 10.
[మార్చు] అష్టక విభాగం
- అష్టకములు సంఖ్య 8.
- అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8.
- అధ్యాయములు సంఖ్య 64
- ఈ సంహిత లో 64 అధ్యాయములు మరియు 8 అష్టకములుగా విభజించ బడ్డాయి.
- ఋగ్వేదంలో ఋక్కులు సంఖ్య = 10472 + వాలఖిల్య సూక్తాలు లోని ఋక్కులు = 80 కలిపి మొత్తం = 10552
- సూక్తములు సంఖ్య = 1017 + వాలఖిల్య సూక్తాలు లోని ఖిల సూక్తములు = 11 కలిపి మొత్తం = 1028.
- వర్గములు సంఖ్య = 2006 + వాలఖిల్య సూక్తాలు లోని వర్గములు = 18 కలిపి మొత్తం = 2024
- ఋగ్వేదంలో అక్షరములు సంఖ్య = 3,94,221 + వాలఖిల్య సూక్తాలు లోని అక్షరములు = 3,044 కలిపి మొత్తం = 3,97,265.
[మార్చు] వేదాలపై నిరాదరణ
- ఒకానొకనాడు, ఆచార్యుడు ఒక స్థానములో ఉండి వేద విద్య ను ప్రపంచ మానావాళికి సభ్యత ను, సంస్కృతి ని, నేర్పినది మన భారత దేశం. అంతర్జాతీయ పుస్తక భాండాగారములో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం అని, ప్రపంచములోని మేధావులు అందరు ఏకగ్రీవముగా మన విదేశీయులే వేదాలు విశ్వ విజ్ఞాన భాండాగార నిధులని, మన వేద విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసల సునామీలు సృష్టించారు. కొందరి విదేశీయుల పరిశోధకుల ఎంతో శ్రమ ప్రయత్నాల వలన కొంత వరకు వెలుగులోకి వచ్చాయి.
- సాంప్రదాయకులైన వేదజ్ఞుల సంఖ్య సామాజిక, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా, అనేక రూపాంతర ప్రభావములకు కుంగి, లొంగి పోయి, ఏమాత్రము కూడా సరి అయిన ఆదరణ లభించక పోవడము వలన జీర్ణావస్థకు చేరుకుంది.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ "అష్టాదశ పురాణములు" - రచన: వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ: సోమనాధ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
[మార్చు] బయటి లింకులు
|
||||||||||||||||||||