పుష్యమాసము
వికీపీడియా నుండి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
పుష్య మాసము తెలుగు సంవత్సరం లో పదవ నెల. పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రము (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఆ నెల పుష్యము.
కర్ణాటక సంగీతం లో నాదబ్రహ్మగా కొనియాడబడిన త్యాగరాజు వారి సంస్మరణార్ధం ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి రోజున తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కొన్ని వేల మంది ఈ సంగీత మహోత్సవంలో పాల్గొంటారు. మన్మధ నామ సంవత్సరంలో ఇదే రోజు (క్రీ.శ. 1775) మరొక కర్ణాటక సంగీత చక్రవర్తి ముత్తుస్వామి దీక్షితార్ జన్మించారు.
ఆంధ్రులకు పెద్ద పండుగైన సంక్రాంతి ఈ మాసంలోనే జరుపుకుంటారు.
అయ్యప్ప స్వామి దీక్ష కార్తీకమాసములో ప్రారంభమై పుష్యమిలో కూడా నడుస్తుంది.
రుధిరోద్గారి నామ సంవత్సరం (క్రీ. శ. 1924) లో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారిచే భారతి (మాస పత్రిక) స్థాపించబడినది.
పండుగలు [మార్చు]
|
|||||